Chinni Serial Today January 9th: చిన్ని సీరియల్: మధు-మ్యాడీల పెళ్లిలో ఊహించని ట్విస్ట్! నాగవల్లి ఏం చేయబోతోంది?
Chinni Serial Today Episode January 9th మధు, మ్యాడీలకు పెళ్లి తంతు మొత్తం జరగడం మధు చాలా సంతోషంగా ఉండటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధు, మ్యాడీలకు మళ్లీ పెళ్లి తంతు జరుగుతుంది. మధు తల్లిదండ్రులు మ్యాడీ కాళ్లు కడిగి కన్యాదానం చేస్తారు. మధు, మ్యాడీ ఒకరి తలపై మరొకరు జీలకర్రా బెల్లం పెట్టుకుంటారు. తలంబ్రాలు పోసుకుంటారు. తర్వాతా బిందెలో రింగులు వేడయంతో రింగాట ఆడుతారు. తర్వాత ఒకరి మెడలో ఒకరు దండలు వేసుకుంటారు.
నాగవల్లి, లోహిత, దేవా అందరూ కోపంగా ఉంటారు. శ్రేయ కన్నీరు పెట్టుకుంటుంది. మ్యాడీ, మధులు ఒకరి కాళ్లు ఒకరు గట్టిగా తొక్కుంటారు. తర్వాత పంతులు సప్తపది విలువ చెప్తారు. ఇద్దరూ ఒకరి ఒకరు పట్టుకొని అగ్ని చుట్టూ తిరుగుతారు. తర్వాత పంతులు పెద్దల ఆశీర్వాదం తీసుకోమని అంటారు. ఇద్దరూ దేవా, నాగవల్లిల ఆశీర్వాదం తీసుకుంటారు. తర్వాత మధు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటారు. తర్వాత ఇద్దరితో సత్యన్నారాయణ వ్రతం చేయిస్తారు.
నాగవల్లి మ్యాడీతో నీ భార్యని తీసుకొని వెళ్లి అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్తుంది. ఇద్దరూ పార్వతి ఫొటో దగ్గరకు వెళ్తారు. మధు దీపం పెట్టి మ్యాడీ తనని భార్యగా చూడాలని కోరుకుంటారు. మ్యాడీ మనసులో మధు తనని అర్థం చేసుకొని తనకి మరో పెళ్లి చేసేలా ఆశీర్వదించాలని కోరుకుంటారు. ఇద్దరూ నువ్వేం కోరుకున్నావని అంటే నువ్వేం కోరుకున్నాం అని అడుగుతారు. మధు ఏం కోరుకుందో మ్యాడీ కరెక్ట్‌గా చెప్తాడు. మధు కూడా మ్యాడీ కోరికను కరెక్ట్‌గా చెప్పేస్తుంది. మ్యాడీ షాక్ అయిపోతాడు. కరెక్ట్‌గా చెప్పావని అంటాడు. మధు మ్యాడీ చెవి మెలేసి ఇంకోసారి ఇలా నామనసు గిల్లితే నేను నీ చెవిని గిల్లుతా అని అంటుంది.
మ్యాడీ ఎమోషనల్ అవుతూ అర్థం చేసుకో మధు నాకు చిన్ని అంటే చాలా ఇష్టం. చిన్నిని తప్పి ఇంకెవరినీ నేను భార్యగా చూడలేను.. తనకు నాకు మానసికంగా పెళ్లి అయిపోయింది అని అంటాడు. శ్రేయతో నిశ్చితార్థం చేసుకున్నావ్.. అమ్మానాన్నల మాట విని శ్రేయని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయావ్.. అలాగే దేవుడు కలిపిన నన్ను అర్థం చేసుకో.. నీకేం కావాలో నీకు తెలీదు మ్యాడీ.. నీ ఆలోచన కరెక్ట్ కాదు.. పది మందిలో నా మెడలో తాళి కట్టి ఇప్పుడు నువ్వు నన్ను నీ భార్య కాదు అనడం కరెక్ట్ కాదు అని అంటుంది. కరెక్టే నేను చేసేది కరెక్టే నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు.. ఇన్నాళ్లు నా ఫ్రెండ్‌గా నేను ఏం చేసినా అర్థం చేసుకున్న నువ్వు ఇప్పుడు అర్థం చేసుకోవడం లేదు.. అర్థం చేసుకోవద్దు నువ్వు నా బాధ అర్థం చేసుకోవద్దు.. నన్ను ఇంకా బాధ పెట్టు.. అసలు దీని అంతటికీ కారణం నువ్వే నువ్వు గుడిలో ఇరుక్కొని నన్ను ఇరుక్కుపోయేలా చేశావ్.. లైఫ్‌లో ఎప్పటికీ నేను నీ భర్తని కాను.. నువ్వు నా భార్యవి కావు.. కాలేవు.. అని వెళ్లిపోతాడు.
నాగవల్లి మొత్తం విని మధు దగ్గరకు వచ్చి ఏం కోడలు పిల్లా నా కొడుకు ఏం అంటున్నాడు.. మ్యాడీ అంటే ఏదైనా కచ్చితంగా అయిపోతుంది అని నాగవల్లి అంటుంది. మరి శ్రేయని చేసుకుంటా అన్నాడు కదా అత్త పెళ్లి అయిందా.. ఎప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం అని అంటుంది. ఎప్పటికైనా జరిగేది నేను చిన్ని అని మీరు చెప్పడం.. నా భర్త తనే అని మ్యాడీ చెప్పడం.. ఎప్పటికైనా మీ చేతులతో అన్నీ మీరే చేస్తారు అని అంటుంది. నేనే చేస్తా కానీ నువ్వు అనుకునేది కాదు అని నాగవల్లి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















