అన్వేషించండి

Podharillu Serial Today January 9th: అడవిమార్గంలో తప్పించుకున్న మహా,చక్రి రాత్రంతా ఎక్కడ ఉన్నారు...? పారిపోతున్న మహా భూషణ్‌కు దొరికిపోయిందా..?

Podharillu Serial Today Episode January 9th: అడవి మార్గంలోకారు ఆగిపోవడంతో రాత్రంతా చక్రి, మహా పొలాల్లోనే ఉండిపోతారు.తెల్లారి కారు రిపేరు చేసుకుని పారిపోతుండగా...భూషణ్‌కు దొరికిపోతారు.

 Podharillu Serial Today Episode: ప్రతాప్‌ పంపించిన మనుషులు మహా కారును వెంటాడుతుంటే...చక్రి వాళ్లను దారితప్పించేందుకు  అడవి మార్గంలోకి తీసుకెళ్తాడు. దీంతో రౌడీలకు మహా, చక్రి కనిపించకుండాపోతారు. ప్రతాప్‌వాళ్లకు భయపడి భూషణ్‌ కూడా  వాళ్ల కారులో నుంచి దిగి ప్రెండ్‌ను పిలిపించుకుని వేరే కారులో వెళ్లిపోతాడు. అయితే మహా వాళ్లు ప్రయాణిస్తున్న  కారు అడవిమార్గంలో ఆగిపోతుంది. దీంతో మహా మరింత భయపడుతుంది. చక్రి ఏమైనా చేస్తాడేమోనని భయంతో వణికిపోతుంది. అయితే చక్రి చలికాచుకోవడానికి చలి మంటవేయడంతోపాటు తినడానికి మొక్కజొన్నపొత్తులు అన్నీ అరెంజ్ చేయడంతో మహాకు అతనిపై నమ్మకం కుదురుతుంది. చక్రి మంచివాడేనని అనుకుంటుంది. ఇద్దరూ కలిసి కారుదిగి చలిమంట వద్దకు వెళ్తారు. మహాకు మంచి నిద్రరావడంతో  అలాగే చక్రి భుజంపై నిద్రపోతుంది. దీంతో చక్రి ఆమెకు గడ్డితో పడుకోవడానికి ఏర్పాట్లు చేసి పడుకోబెడతాడు.
                    చక్రి ఫోన్‌ స్విచ్ఛాప్‌ రావడంతో మాధవ్‌ భయపడుతుంటాడు. పెళ్లికొడుకుని కిడ్నాప్ చేసింది మనమేనని తెలిసి చక్రికి ఏమైనా అపాయం తలపెట్టారేమోనని కేశవ్‌తో అంటాడు. మనం ఒక్క క్లూ కూడా వదిలిపెట్టలేదని...మనం అని తెలిసే ఛాన్స్‌ లేదని అంటాడు. వాళ్లు పెళ్లి ఆపడంలేదని వీడు మళ్లీ ఏదో ప్రయత్నం చేసి ఉంటాడని అనుమానిస్తాడు. చక్రికి ఏంకాదులే అని ఛార్జింగ్ పెట్టుకుని ఉండడులేఅని కేశవ్‌ సర్దిచెబుతాడు. ఈలోగా  మళ్లీ తెల్లారడంతో చక్రి నిద్రలేచి చూసే సరికి మహా ఇంకా నిద్రపోతూనే ఉంటుంది. దీంతో అతను మెల్లగా  లేచి వెళ్లిపోయి కారు రిపేర్ చేస్తుంటాడు. ఈలోగా మహా కూడా  నిద్రలేచి అతని వద్దకు వస్తుంది. ఇంతలో చక్రి కారు రెడీ చేస్తాడు. ఈపాటికి మీనాన్న పంపించిన రౌడీలు వెతికి వెతికి అలిసిపోయి తిరిగి ఇంటికి వెళ్లిపోయి ఉంటారని చక్రి అంటాడు. అయితే పోలీసు  కంప్లైంట్ ఇస్తే మాత్రం వాళ్లు సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ ఆధారంగా వెతుక్కుంటూ వచ్చే ప్రమాదం ఉందని అందుకే ఫోన్‌కూడా ఆన్ చేయడం లేదని చెబుతాడు. ఇద్దరూ రెడీ అయిపోయి హైదరాబాద్‌ వెళ్లేందుకు  అడవి మార్గంలో ఎవరికీ కనిపించకుండా మరోసారి బయలుదేరతారు..
                             అయితే రాత్రంతా వెతుకుతున్న భూషణ్‌ తెల్లారిన తర్వాత కూడా మహా కోసం పిచ్చెక్కినవాడిలా  వెతుకుతూనే ఉంటాడు. ఈ క్రమంలో భూషణ్ కారుకు మహాకారు ఎదురుపడుతుంది. దీంతో వారిని అడ్డగించి మహాను లాక్కుని వెళ్లేందుకు భూషణ్ ప్రయత్నిస్తాడు. తాను రానంటే రానని మహా గొడవ చేస్తుంది. చక్రి కూడా అడ్డుకుంటాడు. అయినా సరే భూషణ్ చక్రిని పక్కకు నెట్టేసే మహాను తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో మహా మరింత గొడవ చేసి పెద్దరాయి తీసుకుని మీ కారు మొత్తం పగులగొట్టేస్తానంటూ  బెదిరిస్తుంది. దీంతో భూషణ్ వెంట వచ్చిన అతని ప్రెండ్‌ బ్రతిమలాడతాడు. ఈకారు నాదని ఏం చేయవద్దని వేడుకుంటాడు. భూషణ్‌ను నేను తీసుకెళ్తానని చెబుతాడు.  భూషణ్‌ను వాళ్ల ప్రెండ్ బలవంతంగా కారులో కూర్చోబెట్టడంతో  మహా,చక్రి తమ కారులో మళ్లీ పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా...వెనక భూషణ్‌ వాళ్లను కారులో వెంటాడుతుంటాడు. ప్రతాప్‌కు ఫోన్ చేసి మహా నాకు దొరికిందని...నేను తననే ఫాలో అవుతున్నానని మీరు వెంటనే రండని చెబుతాడు.

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today July 7th: నిండు మనసులు: సిద్ధూ ప్రేరణల పెళ్లికి ఏర్పాట్లు! ఇందిరకు దొరికిన సాక్ష్యం!
నిండు మనసులు: సిద్ధూ ప్రేరణల పెళ్లికి ఏర్పాట్లు! ఇందిరకు దొరికిన సాక్ష్యం!
Karthika Deepam 2 Serial Today July 7th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న, సూరజ్‌ల పెళ్లి ప్లాన్! ఇద్దరికీ కలపడానికి వచ్చిన ఈ మేడం ఎవరు?
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న, సూరజ్‌ల పెళ్లి ప్లాన్! ఇద్దరికీ కలపడానికి వచ్చిన ఈ మేడం ఎవరు?
Nuvvu leka Neanu Lenu Serial Today July 7th:రాధను ఇంట్లో నుంచి పంపించివేస్తానంటూ దమయంతి శపథం...మీతరం కాదంటూ వార్నింగ్ ఇచ్చిన రాధ
నువ్వులేక నేను లేను: రాధను ఇంట్లో నుంచి పంపించివేస్తానంటూ దమయంతి శపథం...మీతరం కాదంటూ వార్నింగ్ ఇచ్చిన రాధ
Gundeninda Gudigantalu July 7th Episode: తండ్రిని తక్కువ చేసి మాట్లాడితే కళ్లు పోతాయని మనోజ్‌ను శపించిన బాలు... యాక్సిడెంట్‌లో మనోజ్‌ కళ్లకు ప్రమాదం
గుండెనిండా గుడిగంటలు: తండ్రిని తక్కువ చేసి మాట్లాడితే కళ్లు పోతాయని మనోజ్‌ను శపించిన బాలు... యాక్సిడెంట్‌లో మనోజ్‌ కళ్లకు ప్రమాదం

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
Tata Sierra EV on EMI: టాటా సియారా EV కొనడానికి ఎంత జీతం సరిపోతుంది? నెలవారీ EMI ఎంత అవుతుంది? 
టాటా సియారా EV కొనడానికి ఎంత జీతం సరిపోతుంది? నెలవారీ EMI ఎంత అవుతుంది? 
Dalit Christian Vote Bank Politics: వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
Quitting Job in Midlife : 35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
Embed widget