Chinni Serial Today January 24th: చిన్ని సీరియల్: మ్యాడీకి షాక్! మధు 'మహి' అని పిలవడానికి కారణం ఏంటి? ఆఫ్ టికెట్ కిడ్నాప్!
Chinni Serial Today Episode January 24th మధు, మ్యాడీ మధు పుట్టింటికి వెళ్లడం అక్కడ ఆచారాలతో మ్యాడీ ఇబ్బంది పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధు, మ్యాడీలు మధు వాళ్ల ఊరు బయల్దేరుతారు. మొదటి సారి అల్లుడిగా వస్తున్న మ్యాడీని సుబ్బు, స్వరూప వాళ్లు బ్యాండ్ మేళంతో ఆహ్వానిస్తారు. ఇలాంటివన్నీ నాకు ఇబ్బందిగా ఉంటాయని మ్యాడీ అంటాడు. సుబ్బు, స్వరూపలు మ్యాడీని అల్లుడు అని సంతోషంగా పరిచయం చేసుకుంటారు. మినిస్టర్ కొడుకు అయినా నీ కోసం కూరగాయలు అమ్మారు.. పేదింటి అమ్మాయిని మినిస్టర్ గారు కోడలిగా ఒప్పుకున్నారు అంటే గ్రేట్ అని అంటారు.
బ్యాండ్ మేళం సందడితో మ్యాడీని తీసుకెళ్తారు. మరోవైపు బాలరాజు తనతో తాను నేను చాలా దురదృష్టవంతున్ని చిన్ని అమ్మ విషయంలో భర్తగా ఫెయిల్ అయ్యాను.. పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సిన నేను ఏం చేయలేకపోయా.. నీ విషయంలో తండ్రిగా ఫెయిల్ అయిపోయా.. కనీసం ఏ విషయంలోనూ నీ పక్కన లేను.. ఒంటరిగా నిన్ను వదిలేశా అని అనుకుంటాడు. ఇంతలో దేవా బాలరాజు దగ్గరకు వచ్చి ఎందుకు ఏడుస్తావ్ ఇప్పుడు నీ కూతురు పోయాక ఏడ్వొచ్చు.. ఆఫ్ టికెట్‌ని కూడా వదలను అని చెప్తాడు. ఇంతలో రౌడీలు కాల్ చేసి ఆఫ్ టికెట్ కనిపించాడు అని దగ్గర్లోనే ఉన్నాడు అని చెప్తారు. ఆఫ్ టికెట్‌ని చంపేయమని దేవా చెప్తాడు. వాడిని చంపేస్తే వాడిని చూడటానికి చిన్ని ఎక్కడున్నా వస్తుంది. చంపేయండి అని అంటాడు. ఆఫ్ టికెట్ అమాయకుడు వాడిని ఏం చేయొద్దని బాలరాజు బతిమాలుతాడు. ఆఫ్ టికెట్‌ని రౌడీలు కిడ్నాప్ చేస్తారు.
మధు, మ్యాడీలకు స్వరూప హారతి ఇచ్చి ఒకరు పేరు ఒకరు చెప్పుకోమని చెప్తారు. అందరూ చెప్పమని అనడంతో నేను మా ఆవిడ మధు వచ్చాం అని మ్యాడీ అంటాడు. మధు మ్యాడీ చేయి పట్టుకొని నేను మా వారు మహి వచ్చాం అని అంటుంది. మ్యాడీ షాక్ అయిపోతాడు. ఇదేంటి ఇలా తను మహి అని చిన్నిలా అంటుంది అని అనుకుంటాడు. మహి ఏంటి అక్కా అని చంటి అడిగితే మా ఆయన పేరు మహేంద్ర వర్మ అని అత్తయ్య చెప్పారు అందుకే మహి అని చెప్పాను అంటుంది. మ్యాడీ, మధులు దేవుడి దగ్గరకు వెళ్లి దండం పెట్టుకుంటారు. వెనకాలే కావేరి ఫొటో ఉండటంతో మధు చాలా టెన్షన్ పడుతుంది. స్వరూప రావడంతో చాలా టెన్షన్ పడి కావేరి ఫోటో చూపిస్తుంది. మ్యాడీని మాటల్లో పెట్టి ఫొటో దాచేస్తారు.
ఆఫ్ టికెట్ మళ్లీ తప్పించుకున్నాడని దేవా చాలా చిరాకు పడతాడు. నాగవల్లి వెళ్లి దేవాతో మాట్లాడి.. త్వరలోనే చిన్నిని నీ ముందు ఉంచుతా అని చెప్తుంది. మ్యాడీ మధుతో మనం భార్యభర్తలం కాదు కదా ఇన్నీ అవసరమా అంటే మా అమ్మానాన్నలకు అవసరమే అని మధు అంటుంది. నేను ఇక్కడికి వచ్చింది నీ ఓవర్ యాక్షన్ కోసం కాదు.. చిన్ని కోసం.. అని మ్యాడీ అంటాడు. నేను చిన్ని ఎప్పుడు నీకు నిజాలు చెప్తుందా అని ఆలోచిస్తున్నా అని అంటుంది. తర్వాత మధు మ్యాడీల కోసం స్వీట్స్ అన్నీ ఏర్పాటు చేసి ఒకరికి ఒకరు తినిపించుకోవాలని అంటారు. ఇలాంటి సంప్రదాయాలు నేను ఎక్కడ చూడలే అని లోహిత అంటే నేను చూడలేదు అని మ్యాడీ అంటాడు. మ్యాడీకి ఇలాంటివి చాలా ఇష్టం కానీ మీరు ఉన్నారు అని మొహమాట పడుతున్నాడు అని మధు అంటుంది. ఇక మ్యాడీ, మధు ఒకరికి ఒకరు తినిపించుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















