Jagadhatri Serial Today January 23rd:మీనన్ వేసిన ఉచ్చులో ఇరుక్కుపోయిన కేదార్,జగధాత్రి. కమలాకర్‌ను చంపి కేదార్‌పై కేసు నెట్టేలా మీనన్ ప్లాన్.
Jagadhatri Serial Today Episode January 23rd:మీనన్ వేసిన ఉచ్చులో ఇరుక్కుపోయిన కేదార్,జగధాత్రి. కమలాకర్‌ను చంపి కేదార్‌పై కేసు నెట్టేలా మీనన్ ప్లాన్.

Jagadhatri Serial Today Episode: కమలాకర్ కనిపించకుండాపోవడంతో అందరూ కేదార్‌ను నిలదీస్తారు. మీరే కమలాకర్‌ను ఏదో చేసి ఉంటారని అంటారు. తనకేమీ తెలియదని కేదార్ అంటాడు. రాత్రి మీకన్నా ముందే మేం రూమ్‌లోకి వెళ్లిపోయాం కదా...మాకు ఎలా తెలుస్తుందని జగధాత్రి కూడా అంటుంది. కమలాకర్ మామయ్య ఖచ్చితంగా ఇక్కడ లేడంటే ఆనందపురం మహల్‌కు వెళ్లి ఉంటాడని జగధాత్రి అంటుంది. అక్కడికి ఎందుకు వెళ్తాడని కౌషికి అంటే...నిజంగా కేదార్ వాళ్ల అమ్మను మామయ్య చంపి ఉంటే....ఆ సాక్ష్యాలు తారుమారు చేయడానికే వెళ్లి ఉంటాడని కావాలంటే మీరు వస్తే రుజువు చేస్తామని జగధాత్రి అంటుంది. కేదార్‌ను తీసుకుని ఆమె ఆనందపురం బయలుదేరుతుంది.
కేదార్, జగధాత్రి ఊహించినట్లే కమలాకర్ ఆనందపురం మహల్‌కు వెళ్తాడు. అక్కడ కేదార్ వాళ్ల తాతయ్యను చూసి కత్తితో బెదిరించాలని చూస్తాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ముసలోడు నిలదీస్తే...నిన్ను చంపి కేదార్‌కు సాక్ష్యాలు లేకుండా చేస్తానని అనగానే..ముసలోడి వేషంలో ఉన్న వ్యక్తి గట్టిగా నవ్వుతాడు. అతడు మీనన్, హోంమంత్రి పంపిన మనిషి. కౌషికి ఇంట్లో కమలాకర్ రాగానే కేదార్ వాళ్లపై గొడవ పెట్టుకోవడంతోనే మీనన్ మాస్టర్ ప్లాన్ వేసి ఈ ముసలోడిని రంగంలోకి దింపుతాడు. కేదార్ వాళ్ల తాతయ్యలా మహల్‌లోకి పంపిస్తాడు.ఇదంతా నిజమేనని కేదార్, ధాత్రిని నమ్మిస్తారు. కేదార్ వాళ్ల వెంట ఖచ్చితంగా కమలాకర్, యువరాజు కూడా వస్తారని అంచనా వేస్తారు. కమలాకర్ ముసలాడిని వెతుక్కుంటూ రాగానే...అతన్ని చంపేసి ఆ నేరం కేదార్‌పై నెట్టి జైలుకు పంపించాలనుకుంటారు.కేదార్ లేకుండా జగధాత్రి ఒంటరిగా రోడ్డున పడుతుందని...అప్పుడు బలం తగ్గిపోయిన కౌషికిని దెబ్బకొట్టి యువరాజును ఆ ఇంటికి కింగ్‌ను చేయాలని మీనన్ భావిస్తాడు. యువరాజులాంటి వాడు చేతిలో ఉంటే....తనకు ఇక అడ్డు ఉండదని హోంమంత్రి తాయరుతో అంటాడు. ఈ విషయాలన్నీ మహల్‌కు వచ్చిన ముసలోడికి చెప్పి పంపిస్తాడు.
మీనన్ పన్నాగం తెలియని కమలాకర్....ముసలాడిని చంపడానికి మహాల్‌కు వచ్చి ఇరుక్కుపోతాడు. తనను కేదార్, జగధాత్రి పంపారని...నిన్ను చంపేస్తే ఆ ఇంట్లో వారికి అడ్డు చెప్పేవారు ఉండరని అందుకే చంపుతున్నానని కత్తితో పొడుస్తారు.అప్పుడే అక్కడికి వచ్చిన కేదార్, జగధాత్రి....కమలాకర్ కేకలు విని లోపలికి పరుగుతెత్తుతారు. వాళ్లను చూసి మీనన్ మనుషులుు అక్కడి నుంచి పరారవుతారు.జగధాత్రి వారి వెంటపడుతుంది ఇంతలో పైకి వెళ్లిన కేదార్....రక్తపు మడుగులో ఉన్న కమలాకర్‌ను చూసి ఆస్పత్రికి వెళ్తామని చెప్పినా అతను వినడు. నువ్వు నన్న చంపడానికే ప్లాన్ వేశామని అంటాడు. అతని కడుపులో ఉన్న కత్తిని బయటకు తీయగా అప్పుడే సుధాకర్, కౌషికి,యువరాజు వస్తారు.కేదార్ చేతిలో కత్తి చూసి అతనే కమలాకర్‌ను చంపాడని భావిస్తారు. యువరాజు కేదార్ చొక్కాపట్టుకుని నిలదీయగా...తాను ఎందుకు బాబాయిని చంపుతానని...నేను వచ్చేసరికి ఎవరో పొడిచి వెళ్లిపోయారని అంటాడు. అయితే నీ చేతిలో కత్తి ఎందుకు ఉందని యువరాజు నిలదీస్తాడు.




















