అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today January 23rd: శ్రీలక్ష్మీతో మ్యాడీకి పెళ్లి ఎలా కుదురింది..? షాక్‌లో నుంచి తేరుకోని మధుసూదన్

Lakshimi Raave Maa Intiki Serial Today Episode January 23nd: శ్రీలక్ష్మీతో మ్యాడీకి పెళ్లి ఎలా కుదురింది..? షాక్‌లో నుంచి తేరుకోని మధుసూదన్

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode:  శ్రీలక్ష్మీని చేసుకునే పెళ్లికొడుకు బుల్లిరాజుకు ఊరువారంతా కలిసి కొట్టడంతో బాగా దెబ్బలు తగులుతాయి. దీంతో వాళ్ల అక్క, బావ అక్కడికి వచ్చి పెద్ద గొడవ చేస్తారు. పెళ్లికాక ముందే అందరి ముందు పట్టుకుని ఈ అమ్మాయి మావాడిని కొట్టిందంటే...మున్ముందు వాడిని బతకనివ్వదని అంటుంది. నేను మొదటి నుంచి ఈసంబంధం వద్దంటే వీడే  ఏరికోరి డబ్బులు ఖర్చుపెట్టి మరీ ఈ పెళ్లికి సిద్ధమయ్యాడని మండిపడుతుంది. ఇక ఈ పెళ్లి జరగనే జరగదని చెబుతుంది. దీంతో  కోటేశ్వరరావు, నూకాలు వాళ్లను ఎంతో బ్రతిమలాడతారు. పెళ్లిమండపంలో పెళ్లి ఆగిపోతే తన కుమార్తెకు మళ్లీ జన్మలో పెళ్లి అవ్వదని వేడుకుంటారు.అయినప్పుటికీ బుల్లిరాజును తీసుకుని వాళ్ల అక్క అక్కడి నుంచి వెళ్లిపోతుంది. శ్రీలక్ష్మీ పెళ్లి ఆగిపోవడంతో అటు మ్యాడీ, సింధూ కూడా  చాలా డిస్పాయింట్‌ అవుతారు.
              పెళ్లి ఆగిపోవడంతో నూకాలు చాలా బాధపడుతుంది. నాకూతురుకు ఇంక పెళ్లికాదంటూ ఇంట్లోకి వెళ్లి కిరోసిన్ తీసుకుని వచ్చి మీదపోసుకుని చనిపోతానని బెదిరిస్తుంది. కోటేశ్వరరావుతోపాటు అం దరూ కలిసి ఆమెను ఆపుతారు. సూర్యనారాయణ అక్కడికి వచ్చి ఆమెను గట్టిగా మందలిస్తాడు. శ్రీలక్ష్మీ ఒక్కరే నీకూతురు కాదని....ఇంకా నీకు  ఇంకో ఇద్దరు బిడ్డలు ఉన్నారని మర్చిపోయావా అని కోప్పడతాడు. జరిగిన దానిలో ఎవరు తప్పులేదని...ఆ తాగుబోతువాడు అసలు శ్రీలక్ష్మీకి తగిన వాడేకాదని అంటాడు. మీకు ఏం ఏమైనా చెబుతారు.ఆగిపోయింది నా కూతురు పెళ్లి అని అంటుంది. ఈ పెళ్లి పెద్దమనిషిలా దగ్గర ఉండి జరిపించాల్సిన మీవల్లే ఈ పెళ్లి ఆగిపోయిందని తిడుతుంది. ఆ మాటలకు సూర్యనారాయణ కొంత బాధపడతాడు.  మీ ఇంట్లో పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఎంత బాధపడి ఉంటారని నిలదీస్తుంది. ఇప్పుడు అదే బాధ నాకు కూడా ఉందని అంటుంది. అసలు దీనంతటికి కారణం ఈ శ్రీలక్ష్మీయే అని  తిడుతుంది.అందరి ముందు మగాడు అన్నది కూడా లేకుండా పెళ్లికొడుకు మీద చేయి చేసుకుందని మండిపడుతుంది. నాన్నను నలుగురిలో పట్టుకుని కొట్టి అవమానిస్తుంటే నేను చూస్తూ  ఎలా ఊరుకుంటానని అంటుంది. నన్ను గౌరవించకపోయినా పర్వాలేదని.. కానీ నిన్ను,నాన్నను  అగౌరవ పరచాలని చూస్తే నేను ఒప్పుకోనని అంటుంది.ఈ పెళ్లి చెడగొట్టే ఉద్దేశమే ఉంటే....పెళ్లి చీర కట్టుకుని మండపంలోకి ఎందుకు వస్తానని అంటుంది. శ్రీలక్ష్మీ పెళ్లి ఆగిపోయినందుకు అందరూ బాధపడుతుంటారు. ఇంతలో ప్రియంవద మ్యాడీకి సైగ చేస్తుంది.అందరూ లక్ష్మీ పెళ్లి గొడవలో ఉన్నారని...సింధూను తీసుకుని వెళ్లిపోవడానికి ఇదే సరైన సమయమని చెబుతుంది. దీంతో మ్యాడీ వాళ్ల అక్కను తీసుకుని వెళ్లిపోవడానికి బయటకు వెళ్తాడు.
                      శ్రీలక్ష్మీ వంటి మంచి అమ్మాయి పెళ్లి ఆగిపోవడానికి తానుకూడా కారణమని నింద తనపై పడిందని దాన్ని సరిదిద్దుకోవాల్సింది కూడా నేనేనని సూర్యనారాయణ అంటాడు. ఈ పెళ్లి జరిగి తీరుతుందని....పెద్దమనిషిగా ఈ పెళ్లి జరిపించే బాధ్యత తనదని అంటాడు. పెళ్లి ముహూర్తం ఇంకా మించిపోలేదని అందరూ ఈ పెళ్లి చూసే ఇక్కడ నుంచి వెళ్తారని అంటాడు. అప్పుడే సింధూను తీసుకుని కారు వద్దకు వెళ్లిన మ్యాడీని సూర్యనారాయణ కేకవేసి పిలుస్తాడు. అతను దగ్గరకు రాగానే....వెళ్లి పెళ్లిపీటల మీద కూర్చోమని చెబుతాడు.  ఆమాటలకు మ్యాడీకి ఏం అర్థంకాదు. ఏంటి తాతయ్యా అని మరోసారి అడుగుతాడు. నీకు, శ్రీలక్ష్మీకి పెళ్లి జరుగుతుందని చెప్పడంతో లక్ష్మీతోపాటు ఆక్కడ ఉన్నవారంతా షాక్‌కు గురవుతారు. 
                                       ఇంతలో మ్యాడీవాళ్ల అమ్మ హైమావతి కలుగుజేసుకుని సడెన్‌గా పెళ్లిఅంటే  ఎలా మామయ్య అని అడుగుతుంది. వాడి చదువు పూర్తికాలేదు, మంచి ఉద్యోగం కూడా చూసుకోలేదు.ఇప్పటికిప్పుడు పెళ్లి అంటే ఎలా చేస్తామని అంటాడు. సింధూ విషయంలో మీకు ఎదురు చెప్పలేదని...ఆడపిల్ల కదా చదువుకున్నవరకు చాల్లేనని సర్దుకుపోయామని పెద్దకొడకు అరవింద గజపతి అంటాడు. కానీ మ్యాడీకి చాలా మంచి భవిష్యత్‌ ఉందని వాడి జీవితం ఇలా చేయడం ఏం బాగాలేదని అంటాడు.అంతలో చిన్న కొడుకు కూడా కలుగజేసుకుని మనకు ఎంతో సాయం చేసిన లక్ష్మీ పెళ్లి ఆగిపోవడం అందరికి బాధ కలిగిస్తోందని....కావాలంటే ఆ బుల్లిరాజుపై కేసు వేసి వాడితో నష్టపరిహారం కట్టిద్దామని అంటాడు. కావాలంటే మనం కూడా ఆర్థికంగా లక్ష్మీకి సాయం చేద్దామంటాడు. అతని భార్య కూడా ఈ పెళ్లికి ఇష్టపడదు.మీరు ఇంట్లో వాళ్లను అసలు సంప్రదించకుండానే ఎప్పుడంటే అప్పుడు పెళ్లి ప్రకటనలు చేయడం ఏం బాగాలేదని అంటుంది. రేపు నా బిడ్డల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందేమోనని భయం వేస్తోందని అంటుంది. ప్రియంవద కూడా కల్పించుకుని ఈ పెళ్లి చెడిపోవడానికి మీరు ఎవరు కారణం కాదని....లక్ష్మీ నోటి దురుసుతనమే ఈ పెళ్లి ఆపించిందని అంటుంది. పెళ్లికొడుకుపై చేయిచేసుకుని తన పెళ్లిని అదే ఆపుకుందని అంటుంది. నా మేనకోడలకు జరిగిన అన్యాయం మళ్లీ ఇప్పుడు నా మేనల్లుడికి జరుగుతుంటే చూస్తూ ఊరుకోనని అంటుంది. ఈమాటలు విన్న సూర్యనారాయణకు తీవ్రంగా కోపం వస్తుంది. అందరూ  ఉపన్యాసాలు ఇవ్వడం అయిపోయిందా...లేకపోతే ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా అంటూ గట్టిగా అరుస్తాడు.  

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 21th:ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
జగద్ధాత్రి సీరియల్: ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
Illu Illalu Pillalu Serial Today August 21st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
Life Of Suma: బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
Nindu Manasulu Serial Today August 21st: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget