Chinni Serial Today January 23rd: చిన్ని సీరియల్: మ్యాడీ మనసు మార్చిన మధు! నాగవల్లికి షాక్! చిన్ని కోసం వెతుకుతాడా!
Chinni Serial Today Episode January 23rd మధు మ్యాడీని ఒప్పించి తన ఊరు తీసుకెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధు తల్లిదండ్రులు ఇంటికి వస్తారు. మిమల్ని మా ఇంటికి పిలిచే అంత స్థాయి మాకు లేదు కానీ కార్యక్రమానికి అందరూ రావాలి అని పిలుస్తారు. అక్కడికి వెళ్లడానికి మ్యాడీకి ఇష్టమో లేదో తెలుసుకోండి అని లోహిత అంటే నాగవల్లి వెళ్దామా వద్దా నాన్న అని అడుగుతుంది. వెళ్లడం ఇష్టం అయితే ముందే చెప్పేవాడు వాడికి కార్యాక్రమానికి వెళ్లాలి అనిపిస్తే చెప్పేవాడు అంటాడు.
మ్యాడీ కూడా నాకు ఇప్పుడు ఎక్కడికీ వెళ్లడం ఇష్టం లేదు. రిసెప్షన్‌లో అలా జరిగినప్పటి నుంచి మనసు బాలేదు ఇప్పుడప్పుడే మనం వెళ్లొద్దు అని అంటాడు. అలా అంటే ఎలా నాన్న అని నాగవల్లి అడుగుతుంది. సారీ అత్తయ్య నేను వచ్చే పరిస్థితిలో లేను అని చెప్తాడు. సుబ్బు సరే అని తర్వాత కార్యక్రమానికి వద్దురులే అని అంటాడు. సుబ్బు, స్వరూప చెప్పి వెళ్లిపోతారు.
నాగవల్లి మధు దగ్గరకు వెళ్లి వెటకారంగా నవ్వుతుంది. డిసప్పాయింట్ అయ్యావా కోడలు పిల్ల.. మీ ఆయన్ని నీ పుట్టింటికి తీసుకెళ్లాలి అనుకున్నావా అని అంటుంది. నా మొగుడు నా పుట్టింటికి రావొద్దు అత్త నేను నా మొగుడితో అన్నీ నా అత్తారింట్లో సరదాగా జరుపుకుంటా మీరు డిసప్పాయింట్ అవ్వొద్దు అంటుంది. మధు మ్యాడీ దగ్గరకు వెళ్లి నువ్వు రాను అని చెప్పడం నాకు నచ్చలేదు అని అంటుంది. జరిగింది పెళ్లే కాదు అని అనుకుంటే ఎలా రాను అంటాడు. మీ వాళ్లని సంతోషపెట్టడానికి అన్నీ కార్యక్రమాలు చేసుకున్నావ్,, ఇప్పుడు మా వాళ్ల కోసం రాలేవా అంటుంది. చిన్ని గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నా ఇప్పుడు మీ ఇంటికి వస్తే చిన్ని కోసం వెతకడం అవ్వదు కదా అంటాడు. చిన్ని కోసం వెతకాలి అనుకుంటే నువ్వు మా ఇంటికి రావాలి.. అప్పుడే చిన్ని కలుస్తుంది అంటుంది.
చిన్ని నిన్ను ఫాలో అవుతుంది కదా.. నువ్వు మా ఇంటికి వస్తే తను నిన్ను ఫాలో అవుతూ నిన్ను కలుస్తుంది. నీతో చెప్పాలి అనుకున్నది చెప్పేస్తుంది అని అంటుంది. మధు మాటలకు మ్యాడీ కన్విన్స్ అయిపోతాడు. మధుతో పాటు తన పుట్టింటికి వస్తాను అని అంటాడు. అత్తయ్యా వాళ్లు నువ్వు రావడం లేదు అని బాధ పడుతున్నారు.. వెళ్లి వస్తాను అని చెప్పు అని మ్యాడీని పంపిస్తుంది.
మ్యాడీ వెళ్లను అనడంతో లోహిత, శ్రేయ చాలా హ్యాపీగా ఫీలవుతారు. నాగవల్లి వచ్చి వాడు వెళ్లడు అని నాకు తెలుసు నువ్వు అనవసరంగా ఆలోచించకు మీకు మంచి జరుగుతుంది అని అంటుంది. ఇంతలో మ్యాడీ వచ్చి మధు వాళ్ల ఇంటికి వెళ్తాను అని చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. ఇంతకు ముందే వెళ్లను అన్నావ్ ఇప్పుడు వెళ్తా అంటావేంటి.. ఎవరైనా మిమల్ని బలవంత పెట్టారా అని దేవా అడుగుతాడు. నీ ఇష్టం నేను కాదు అనను నాన్న అని నాగవల్లి అంటుంది. మధు మాయ చేసుంటుందని లోహిత అంటుంది. ఇక మధు మ్యాడీతో రేపు పొద్దున్న మనం స్టార్ అవ్వాలి అని అంటుంది. మ్యాడీ నాన్నని కూడా పిలిస్తే నాకు వేరే పని ఉంది అని అంటాడు. అన్ని రోజులు వాళ్లు కలిసి ఉంటే మధు మ్యాడీని కొంగున కట్టేస్తుంది. నేను వెళ్తా అని లోహిత అంటే అవసరం లేదు పెద్దక్క వెళ్తుందని నాగవల్లి అంటుంది. శ్రేయ చెప్పడంతో లోహితను కూడా నాగవల్లి పంపిస్తుంది.
నాగవల్లి మధు దగ్గరకు వెళ్లి నా కొడుకు నిన్ను భార్యగా చూడడు.. తొందర్లోనే నిన్ను మెడ పట్టుకొని గెంటేస్తాడు అని అంటుంది. ప్రస్తుతం మ్యాడీ నన్ను దూరం పెట్టాడు అని ఇంత కూల్‌గా ఉన్నారేమో కానీ ముందు ముందు కూల్‌గా ఉండలేరు.. కోడలి రూపంలో మీకు సమ్మర్ వచ్చేసింది ఇక మీకు ఉక్కపోత తగ్గదు.. మీతో చెడుగుడు ఆడేస్తా అని మధు అంటుంది. మ్యాడీని మీ కొడుకుగా ఇప్పుడు తీసుకెళ్తా.. వచ్చేటప్పుడు నా మొగుడుగా తీసుకొస్తా అని అంటుంది. ఓటమి ప్రాప్తిరస్తు అని నాగవల్లి అంటుంది. ఇక అందరూ మధు వాళ్ల ఊరు బయల్దేరుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















