Jagadhatri Serial Today January 22nd:కమలాకర్‌పై చేయిచేసుకున్న కేదార్..? ఇంట్లో కనిపించకుండాపోయిన కమలాకర్ ఏమయ్యాడు...?
Jagadhatri Serial Today Episode January 22nd:కమలాకర్‌పై చేయిచేసుకున్న కేదార్..? ఇంట్లో కనిపించకుండాపోయిన కమలాకర్ ఏమయ్యాడు...?

Jagadhatri Serial Today Episode: తన తల్లిని బాబాయి కమలాకర్ చంపాడని తెలుసుకున్న కేదార్ ఆవేశంగా ఇంటికి వచ్చిన అతన్ని నిలదీస్తాడు. కేదార్‌ను రెచ్చగొడితే ఖచ్చితంగా వాడు చేయిచేసుకుంటాడని...అప్పుడు కౌషికి వాళ్లను ఇంట్లో నుంచి బయటకు గెంటివేస్తుందని నిషిక చెప్పిన మాటలు గుర్తుతుకువచ్చిన కమలాకర్ కేదార్ వాళ్ల అమ్మ గురించి తప్పుగా మాట్లాడతాడు. దీంతో కోపంతో రగిలిపోయిన కేధార్ కమలాకర్ చెంప పగులగొడతాడు. చొక్కా పట్టుకుని చంపేస్తానంటూ బెదిరిస్తాడు. ఇదంతా చూస్తున్న కౌషికి వెంటనే వచ్చి కేదార్‌ను కొడతుంది. ఎంత ధైర్యం ఉంటే మా బాబాయిపై చేయి చేసుకుంటావని నిలదీస్తుంది.మా అమ్మను చంపాడని తెలిసిన తర్వాత కూడా ఎలా ఊరుకోమంటావని కేదార్ అంటాడు.అందుకు ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని అంటుంది. నువ్వు ఈ ఇంటి వారసుడివేనని చెప్పే సాక్ష్యాలు గానీ, మీ అమ్మను మా బాబాయి చంపాడని చెప్పే సాక్ష్యాలు గానీ ఉంటే చూపించమని అంటుంది. రేపటికల్లా సాక్ష్యాలు చూపిస్తే ఇంట్లో ఉంటారని....లేకపోతే వెళ్లిపోవాలని తేల్చి చెబుతుంది. తనను అక్కా అని కూడా పిలవొద్దని అంటుంది. కేదార్‌పై వాళ్ల నాన్న సుధాకర్‌కూడా కోప్పడతాడు. నువ్వు నన్ను నాన్న అని పిలిచే అర్హత కోల్పోయావని అంటాడు. ఎంత ధైర్యం ఉంటే మా తమ్ముడిని కొడతావని అంటాడు.అమ్మను చంపింది బాబాయే అని చెప్పినా వినడు. నా తమ్ముడికి అలాంటి అవసరం లేదని అంటాడు. దీంతో కోపంగా కేదార్ పైకి వెళ్లిపోతాడు. అతని వెంట ధాత్రి, శ్రీవల్లి కూడా వెళ్తారు.
ఒక్క చెంపదెబ్బతో వాళ్ల పని అయిపోయిందని యువరాజు,కమలాకర్, నిషిక, వైజయంతి సంతోషపడతారు. జగధాత్రి వెళ్లి కేదార్‌ను ఓదార్చుతుంది. నువ్వు కొంచెం కోపం తగ్గించుని ఉంటే బాగుండేదని అంటుంది.వాడు మా అమ్మను అన్ని మాటలు అంటుంటే చూస్తూ ఎలా ఊరుకుంటానని అంటుంది. కొంచెం శాంతంగా ఆలోచించమని చెబుతుంది. సడెన్‌గా ఓ వ్యక్తి వచ్చి మీ తాతయ్య అని చెబితే ఎలా నమ్ముతామని అంటుంది. అతను చెప్పిందంతా,ఇచ్చిన డైరీ కూడా నిజమేనని ఎలా నమ్ముతామని నిలదీస్తుంది. పోనీ ఆయన అన్ని విషయాలు చెబుతున్నారా అంటే అదీ లేదని అంటుంది.కేవలం నీ గురించి, మీ అమ్మ చనిపోవడం గురించి మాత్రమే చెబుతున్నారని...మీ చనిపోయే ముందు ఆమెకు నీతోపాటు ఇంకో బిడ్డ ఉంది కదా దాని గురించి ఎందుకు ప్రస్తావించడలేదని అంటుంది. మీ తాతయ్య చెప్పేది నిజమో కాదో రేపు వెళ్లి నిర్థారించుకుందామని సముదాయిస్తుంది.అప్పటి వరకు మీ బాబాయి తప్పు చేశాడని మనం కూడా నమ్మలేమని అంటుంది. ఏదీ ఏమైనా పెద్దవాళ్లపై చేయిచేసుకోవడం నువ్వుచేసింది తప్పేనని కాబట్టి వెళ్లి సారీ చెప్పమని చెబుతుంది.
రాత్రికి అందరూ భోజనాలకు సిద్ధమవ్వగా...జగధాత్రి, కేదార్ కిందకు వచ్చి వాళ్లఅక్కకు నాన్నకు సారీ చెబుతాడు. ఉదయం తాను చేసింది తప్పేనని బాబాయి కమలాకర్‌ను క్షమించమని అంటాడు. అయితే కమలాకర్ మీ అమ్మను చంపలేదని ఒప్పుకున్నట్లే కదా అని కౌషికి అంటుంది. నేను సారీ చెప్పింది ఆయనపై చేయి చేసుకున్నందుకు మాత్రమేనని....బాబాయే మా అమ్మను చంపలేదని తేలేవరకు నేను ఈ విషయాన్ని నమ్ముతూనే ఉంటానని అంటాడు. రేపు సాక్ష్యాలు చూపించాల్సి వస్తుందని కొత్త నాటకం మొదలుపెట్టారా అని నిషిక, వైజయంతి అంటారు. దీంతో జగధాత్రికి కోపం వస్తుంది. రేపటిలోగా సాక్ష్యాలు బయటపెట్టకుంటే మేమే ఇంట్లో నుంచి వెళ్లిపోతామని చెప్పి వెళ్లిపోతుంది.
ఉదయం కేదార్, జగధాత్రి రెడీ అవుతుండగా...కింద నుంచి కౌషికి గట్టిగా కేకలు వేస్తుంది. ఏమైందోనని కిందకు రాగా...కమలాకర్ బాబాయి కనిపించడం లేదని నువ్వే ఏదో చేశామని నిషిక, యువరాజు అంటారు. తనకు ఏ విషయం తెలియదన్న వినరు. జగధాత్రి వెళ్లి కౌషికిని అడుగుతుంది.నువ్వు కూడా ఇదే అనుకుంటున్నావా అని అంటుంది.





















