Chinni Serial Today December 30th: చిన్ని సీరియల్: గ్రహణం రోజు గుడిలో ఒంటరిగా మధు! మ్యాడీ మధుని చూస్తాడా! నాగుపాము కథేంటి?
Chinni Serial Today Episode December 30th లోహిత ప్లాన్ చేసి మధుని గ్రహణం రోజు గుడిలో ఉండేలా ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధుని లోహిత పక్కకి తీసుకెళ్లి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా మ్యాడీకి ఎన్ని రకాలుగా తన మనసు మార్చాలని ప్రయత్నించినా ఉపయోగం ఉండదు అని చెప్తుంది. శ్రేయకి మ్యాడీకి నిశ్చితార్థం జరిగినా.. రేపోమాపో వాళ్లకి పెళ్లి జరుగుతుందని తెలిసినా నువ్వు ఇంకా మ్యాడీని నీ వైపు తిప్పుకోవాలని చూస్తున్నావ్.. అది ఎప్పటికీ జరగదు. మ్యాడీని పెళ్లి చేసుకోవడానికి నాటకాలు తెరదించు అని అంటుంది.
మధు లోహితకు కౌంటర్‌గా నాటకాలు ఆడుతుంది నువ్వు.. అందుకే నువ్వు నీ ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నావ్.. ఆ నాటకాలకు నువ్వు తెరదించు అని మధు అంటే నువ్వే చిన్ని అని మ్యాడీకి చెప్పకుండా నాటకాలు ఆడటం లేదా అని అంటుంది. నేను చిన్ని అని చెప్పకపోవడానికి కారణం మా అమ్మ మీద పడిన నింద.. ఆ నింద పోతే నేను ధైర్యంగా చిన్ని అని మ్యాడీకి చెప్తా కానీ నువ్వు మీది రిచ్ ఫ్యామిలీ అని వరుణ్‌కి చెప్పగలవా అని అడుగుతుంది. మ్యాడీ మీద అనవసరంగా ఆశలు పెట్టుకోవద్దని లోహిత చెప్పి వెళ్తుంటే అరటి తొక్క మీద కాలు వేసి జారి పడిపోతుంది.
లోహితను పైకి లేపకుండా మధు వెళ్లిపోతుంది. ఇంతలో వరుణ్ వచ్చి లోహితను తీసుకెళ్లి పక్కన కూర్చొపెడతాడు. అయితే అక్కడే కొంతమంది ఆడవాళ్లు ఈ రోజు గ్రహణం గుడి మూసేస్తారు. రాత్రి నాగుపాము వచ్చి గుడి మొత్తం తిరుగుతుందని అనుకుంటారు. అది విన్న లోహిత మధుని గుడిలో ఉంచేయాలి అనుకుంటుంది. ఇక గుడి మూసేస్తామని అందరిని బయటకు వెళ్లమని చెప్తారు. మ్యాడీ, వరుణ్‌లు ప్రసాదాలు తీసుకొని బయట ఉంటాం వచ్చేయండి అంటారు. లోహిత శ్రేయని తీసుకొని వెళ్లిపోతుంది. మధుకి అన్నీ సర్దుకొని వచ్చేయమని అంటుంది.
లోహిత ప్రసాదంలో మత్తు మందు కలిపి మ్యాడీ ప్రసాదం ఇచ్చాడని మధుకి ఇస్తుంది. మధు అది తీసుకొని సామాను సర్దుతూ ఉంటుంది. ఇంతలో లోహిత చెప్పిన మనిషి మధు మీద మత్తు దూపం వేయడంతో ఆ పొగకి మధు కళ్లు తిరిగి గదిలో పడిపోతుంది. తర్వాత ఆయన లోపలికి వెళ్లి మధు సెల్ తీసుకుంటాడు. మ్యాడీ మధు గురించి అడిగితే ఇంటి నుంచి ఫోన్ రావడంతో వెళ్లిపోయిందని అంటుంది. మధుకి మ్యాడీ ఫోన్ చేస్తే స్విఛ్ ఆఫ్ వస్తుంది. తను వెళ్లిపోయింది కదా మనం వెళ్దాం అని శ్రేయ అంటుంది. మ్యాడీ దారిలో మధు వాళ్ల నాన్న మ్యాడీకి ఫోన్ చేస్తాడు. మధు ఇంకా రాలేదు అని అడుగుతాడు. దాంతో మ్యాడీ షాక్ అయిపోతాడు. దాంతో మ్యాడీ మధ్యలో కారు ఆపించి మధు గుడిలో ఉందని నాకు అనిపిస్తుంది. ఒకసారి వెళ్తా అని అంటాడు.
లోహిత మనసులో మ్యాడీ వెళ్లే సరికి గుడి తలుపులు మూసేసి ఉంటారు ప్రాబ్లమ్ ఉండదు అని అనుకుంటుంది. మ్యాడీ వెళ్లే సరికి గుడి తలుపులు మూసేసి ఉంటారు. మ్యాడీ లోపలికి వెళ్లి మధు కోసం వెతుకుతూ ఉంటాడు. ఓ చోట మ్యాడీకి మధు పట్టీ కనిపిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















