Chinni Serial Today December 29th: చిన్ని సీరియల్: మ్యాడీ-శ్రేయల పెళ్లికి బ్రేక్ వస్తుందా? తిలక్ ఎవరు? తిలక్‌కి దేవాకి సంబంధమేంటి?
Chinni Serial Today Episode December 29th మధు కళ్ల ముందే మ్యాడీ, శ్రేయల మాంగల్య పూర్తి దిగ్విజంగా పూర్తి కావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Chinni Serial Today Episode మధు నాగవల్లితో మ్యాడీకి నిశ్చితార్థం మాత్రమే అయింది.. ఇంకా పెళ్లి కాలేదు.. నిశ్చితార్థానికి పెళ్లికి చాలా టైం ఉంది.. ఈలోపు ఏమైనా జరగొచ్చు.. మ్యాడీ చిన్ని మీద ఇంత ప్రేమ చూపిస్తాడు అని మనం ఊహించామా.. నేను మళ్లీ కలుస్తాను అని ఊహించామా లేదు కదా.. ఊహించనివి ఎన్నో జరిగినప్పుడు ఇలా శ్రేయ, మ్యాడీల పెళ్లి జరుగుతుందని అనుకుంటున్నారా.. మీరు ఊహించని విధంగా మ్యాడీకి నా మీద ప్రేమ పోతుంది. మీరు ఊహించని విధంగా మా ప్రేమ గెలుస్తుంది. మీతోనే నేను చిన్ని అని చెప్పిస్తా చూస్తూ ఉండండి అని మధు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.
మ్యాడీ, శ్రేయల నిశ్చితార్థం గుర్చు చేసుకొని మధు చాలా ఏడుస్తుంద. ఇక ఉదయం గుడికి ధర్మకర్త తిలక్ వస్తారు. దేవుణ్ని దర్శించుకొని ఏర్పాట్ల గురించి మాట్లాడుతారు. ఇక మాంగల్య పూజ చేసుకోవడానికి మహి, శ్రేయ, లోహిత, వరుణ్ వస్తారు. మధు వస్తే వస్తానని మ్యాడీ అంటే తనేమైనా వీఐపీనా వస్తుందిలే అని శ్రేయ అంటుంది. కాబోయే జంట మీరు మాంగల్య పూజ చేయడం మన ఇంటి ఆనవాయితీ ముందు మీరు లోపలికి పదండి అని లోహిత అంటుంది. మ్యాడీ ఇద్దరికీ సర్ది చెప్పేలోపు మధు వస్తుంది. అందరూ గుడి లోపలికి వెళ్తారు.
లోహిత వెళ్తూ గుడి మెట్ల ముందు కూర్చొన్న పిచ్చామెలా మారిపోయి ఉన్న ఓ అమ్మాయిని చూపి లోహిత అరుస్తుంది. అక్కడే ఉన్న సాధువు భయపడొద్దని ఆ అమ్మాయి ఐదేళ్ల క్రితం వచ్చిన చంద్ర గ్రహణం వల్ల ఇలా అయిపోయింది. అప్పటి నుంచి ఇలా గుడి వైపే చూస్తుంది. ఇంకేం తెలీదు అని ఎవరి ఖర్మని ఎవరూ తప్పించుకోలేరు అని చెప్తారు.
పంతులు మ్యాడీ వాళ్లతో మధుని మ్యాడీని చూసి జంట అనుకొని చూడముచ్చటగా ఉన్నారు అంటాడు. శ్రేయ కోపంగా పంతులు గారు మా బావని పెళ్లి చేసుకోబోయేది నేను అని అంటుంది. దానికి పంతులు క్షమాపణ చెప్పి ఎడమవైపు తను ఉండటం చూసి అలా అనుకున్నా అని అంటాడు. దానికి లోహిత మీరు పొరపాటు పడినంత మాత్రాన వాళ్లు భార్యాభర్తలు అయిపోతారా ఏంటి అని అంటుంది. ఆ దేవుడు మా ఇద్దరికీ రాసి పెట్టాడు అని శ్రేయ అంటుంది. అరగంట తర్వాత పూజ చేస్తా అంటే అంత వరకు గదులో ఉండమని అంటారు. ఆ గదుల్లో ఏసీ లేదు అని లోహిత పుట్టినప్పుటి నుంచి ఏసీల్లో తిరిగా పెరిగా అని బిల్డప్ ఇస్తుంది.
తిలక్‌కి గుడిలో పూజ అని తెలిసి ఏంటి అని అడుగుతారు. దేవేంద్రవర్మ పిల్లలు అని చెప్పి పూజ గురించి చెప్తారు. ఇక తిలక్‌ని మహి వాళ్లకి పరిచయం చేస్తారు. మీ నాన్న నేను చాలా మంచి ఫ్రెండ్స్.. ఇద్దరం కలిసే తిరిగాం.. కలిసే రాజకీయాలు చేశాం.. మీ నాన్న తెలివైన వాడు కాబట్టి మినిస్టర్ అయ్యాడు.. నేను ఇంకా ఊరి రాజకీయాల్లోనే ఉండిపోయా అని చెప్పి మాట్లాడి వెళ్లిపోతారు.
పూజ మొదలవుతుంది. మ్యాడీ, శ్రేయలు ఒకరికి ఒకరు బొట్టు పెట్టుకొని, కంకణాలు కట్టుకొని పూజ చేయడం చూసి మధు హార్ట్ బ్రేక్ అయిపోతుంది. చాలా బాధ పడుతుంది. మ్యాడీ మధుని చూసి చిన్ని కోసం బాధ పడుతుంది అని అనుకుంటాడు. మ్యాడీ, శ్రేయల మాంగల్య పూజ పూర్తవుతుంది. ఇక పెళ్లికి ఏం అడ్డు ఉండదు అని పంతులు చెప్పి మ్యాడీ, శ్రేయలను దీవిస్తారు.
మధు దేవుడు దగ్గరకు వెళ్లి అమ్మ మీద పడిన నింద వల్ల మహికి నన్ను దూరం చేశావ్.. అని ఏడుస్తుంది. మధుని వెతుక్కుంటూ మహి వస్తూ ఉంటాడు. మహి లేని జీవితం భరించలేని బరువుగా మారిపోతుంది. దయచేసి అలాంటి పరిస్థితి రానివ్వకు అని మొక్కుకుంటుంది. ఇంతలో మ్యాడీ మధు దగ్గరకు వస్తాడు. ఇంకా నేను పెళ్లికి రెడీగా లేను కానీ అప్పుడే అన్నీ అయిపోతున్నాయి అని మ్యాడీ అంటాడు. ఇదంతా నీ తప్పే మ్యాడీ, శ్రేయని పెళ్లి చేసుకోవడానికి ఇంకా రెడీగా లేను అని నువ్వు ఇంట్లో గట్టిగా చెప్పాల్సింది అని అంటుంది.
నేను చెప్పినా వినలేదు అని మ్యాడీ అంటాడు. మ్యాడీ, మధు మాట్లాడుకుంటూ ఉంటే తిలక్ వాళ్ల మాటలు దూరంగా ఉండి వింటాడు. మ్యాడీతో మధు ఎవరు అని అడుగుతాడు. తను నా ఫ్రెండ్ అని మ్యాడీ అంటే పెళ్లి కూతుర్ని వదిలేసి ఇలా ఫ్రెండ్‌తో ఒంటరిగా మాట్లాడటం తప్పు బాబు.. తను ఫీలవ్వదా అని అంటే చాలా ఫీలవుతుంది అని లోహిత ఎంట్రీ ఇస్తుంది. మ్యాడీని శ్రేయ దగ్గరకు పంపిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















