Podharillu Serial Today December29th: కిడ్నాప్‌కు గురైన పెళ్లి కొడుకు భూషణ్ ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయిందా? మహా పెళ్లి ఆగిపోయినందకు ఏం చేసింది..?
Podharillu Today Episode December 29th: పెళ్లికొడుకు కిడ్నాప్ గురవ్వడంతో ఆది తన మనుషులతో అంతా వెతికినా కనిపించడు. దీంతో ముహూర్తం దాటిపోయిందని ప్రతాప్ పెళ్లి వాయిదా వేయించడంతో మహా ఆనందపడిపోతుంది

Podharillu Serial Today Episode: మహా పెళ్లి ఆపడానికి భూషణ్‌ను చక్రి తమ్ముళ్లు కిడ్నాప్ చేయడంతో మాధవ్ చాలా కంగారుపడతాడు. పోలీసు కేసు అవుతుందేమోనని భయపడతాడు. రెండు గంటలు వాడిని కిడ్నాప్ చేస్తే ఈ పెళ్లి ఆగిపోతుందని...దీంతో మహాకు చక్రిపై ప్రేమ పుడుతుందని చిన్నా అంటాడు. ఇంతలో భూషణ్ తల్లిదండ్రులు ప్రతాప్ వద్దకు వెళ్లివాడిని మీరే కాపాడాలంటూ వేడుకుంటారు. పోలీసుు కంప్లైట్ ఇద్దామా అని అంటే...ప్రతాప్ వద్దంటాడు. పోలీసులకు తెలిస్తే కిడ్నాపర్లు భూషణ్‌ను ఏమైనా చేసే అవకాశం ఉందని అంటాడు. వాళ్లు కిడ్నాప్ చేసి ఎంతోసేపు కాలేదు కాబట్టి ఊరుదాటి వెళ్లి ఉండరని...కాబట్టి మన మనుషులను పెట్టి వెతికిద్దామని అంటాడు. ఆదిని పనికి పురమాయిస్తాడు.
ఇదంతా నువ్వే చేశావా అని మహా చక్రిని అడగ్గా...తనపనేనని చెబుతాడు. దీంతో వాళ్లిద్దరూ ఆనందపడిపోతుంటారు. తన పెళ్లి చెడగొట్టినందుకు మహా చక్రికి ధ్యాంక్స్ చెబుతుంది. ఏదైతే ఏమీ పెళ్లి ఆగిపోయినందుకు మహా చాలా సంతోషిస్తుంది. ఈలోగా ఆది మనుషులను తీసుకెళ్లి ఊరంతా వెతుకుతుంటారు. ఇంతలో మాధవ్ మరింత కంగారుపడుతుండగా...చక్రి అన్నయ్య ఫోన్ చేయగానే వీడిని వదిలేసి పారిపోదామని చిన్నా చెబుతారు. మీతో ఇలాంటి పనులు చేయిస్తున్నందుకు ఆ చక్రిగాడిని తన్నాలని అంటాడు. ఇంతలో చక్రి ఫోన్ చేయడంతో మాధవ్ మాట్లాడతాడు. తమ్ముళ్ల భవిష్యత్ నాశనం చేయడానికే ఇలాంటి పనులు చేస్తున్నావా అని మండిపడతాడు. వాడిని చాలా సేప్టీ ప్రాంతంలోనే దాచిపెట్టామని....అది ప్రతాప్ వాళ్ల కన్‌స్ట్రక్షన్ కంపెనీయేని కాబట్టి వాళ్లుఅక్కడికి వెచ్చి ఎట్టిపరిస్థితుల్లోనూ వెతకరని చెబుతాడు.ఇంతలో మాధవ్ మాటలు విని కింద ఉండేవాచ్‌మెన్ పైకి వస్తాడు. మాధవ్‌ను గుర్తుపట్టి ఇక్కడ ఉన్నావేంటి...ఈ సైట్ మేస్త్రీ వేరేవాళ్లు కదా అని అంటాడు. దీంతో ఈసైట్ పనులు తాము తీసుకుందామని....కాంట్రాక్టర్‌తో మాట్లాడి అడ్వాన్స్ తీసుకోవడానికి వచ్చామని కేశవ్ అబద్దం చెబుతాడు. మరి కింద ఉన్న వ్యాన్ ఎవరిదని అడగ్గా.....మాకు తెలియదని మరోసారి అబద్ధం చెబుతారు. తమ్ముళ్లు ఈ విధంగా అబద్ధాల మీద అబద్ధాలు చెబుతుండటంతో మాధవ్ భయం రెట్టింపు అవుతుంది. ఇంతలో ఆది తన మనుషులను తీసుకుని అదే సైట్‌కు వస్తాడు.అక్కడ వెతక్కుండానే ఇంటికి తిరిగి వెళ్తాడు.
అక్కడ ఇంట్లో చక్రి పాటలు పాడుతూ ఆనందంగా ఉండటం చూసి ఆదికి కోపం వస్తుంది. లోపలికి వెళ్లి భూషణ్ కనిపించలేదని చెప్పడంతో భూషణ్ తల్లిదండ్రులు ఇక ఆలస్యం చేస్తే మా అబ్బాయికి ప్రమాదమని...పోలీసులకు కంప్లైట్ చేస్తామని చెబుతారు.అది విని చక్రి కంగారుపడతాడు. ఇంతలో రిజిస్ట్రార్ ఫోన్ చేయడంతో....ముహూర్తం దాటిపోయింది కాబట్టి ఇంకోరోజు పెళ్లి పెట్టుకుంటామని ప్రతాప్ చెబుతాడు. ఈమాటలు విన్న మహా, చక్రి ఎగిరి గంతులేస్తారు. మహా అయితే రూమ్‌లోకి వెళ్లి మరీ పాటలు పాడుతూ డ్యాన్స్‌లు వేస్తుంది. తన పెళ్లి ఆగిపోయినందుకు సంతోషపడుతుంది. చక్రియే ఈపని చేసినందుకు అతనికి మరోసారి థ్యాంక్స్ చెబుతుంది.





















