Chinni Serial Today September 18th: చిన్ని సీరియల్: మ్యాడీకి ప్రపోజ్ చేసిన మధు! ఒక్కటైపోయిన మహి, చిన్ని..కాఫీ షాప్‌లో ఏం జరిగిందంటే?
Chinni Serial Today Episode September 18th మధు మ్యాడీకి ప్రపోజ్ చేయడం మ్యాడీ చిన్ని లవ్ చేస్తున్నా అని చెప్పడం మహి, చిన్ని ఒక్కటైపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode లోహిత కాఫీ షాప్‌లో కాఫీ తాగుతూ ఉంటే మధు, మహి వస్తారు. వాళ్లిద్దరినీ చూసి లోహిత చాలా టెన్షన్ పడుతుంది. కొంపతీసి ప్రపోజ్ చేస్తుందా ఏంటి అని అనుకుంటుంది. ఇక వసంత అందరికీ స్వీట్స్ చేసి పంచుతుంది. వరుణ్‌కి సెంట్రల్ మినిస్టర్ కూతురి సంబంధం రావడంతో తన సంతోషాన్ని అందరితో పంచుకుంటుంది. మీరే లేకపోతే మేం ఏమైపోయేవాళ్లమో అని నాగవల్లితో అంటే మనం అంతా ఒక్కటే అని నాగవల్లి చెప్తుంది.
శ్రేయ రావడంతో వసంత స్వీట్ ఇచ్చి విషయం చెప్తుంది. శ్రేయ చాలా హ్యాపీగా ఫీలవుతుంది. నాగవల్లి, దేవాతో వరుణ్‌కి మనం ఇవ్వాలి అనుకున్న లైఫ్ కంటే వందరెట్లు మంచి లైఫ్ వచ్చిందని అంటుంది. అన్నయ్య పెళ్లి తోనే నాకు బావకి పెళ్లి అయిపోతే నా కల తీరిపోతుందని శ్రేయ అంటే నీ కల కూడా తీరిపోతుంది అదే రోజు అదే మండపంలో నీ పెళ్లి జరిగేలా చూస్తానని అంటాడు. మన ఇంట్లో ఇక పెళ్లి భాజాలు మోగుతాయి కదా అని శ్రేయ చాలా హ్యాపీగా ఫీలవుతుంది. అప్పటి వరకు హ్యాపీగా ఉన్న శ్రేయ చిన్ని కనిపిస్తే తన పరిస్థితి ఏంటా అని బాధ పడుతుంది. గడువు పూర్తయ్యే లోపు చిన్ని బావకి దొరికితే ఏంటి అత్తయ్యా అని శ్రేయ అంటే ఆ చిన్నిని ఎట్టిపరిస్థితుల్లోనూ మ్యాడీకి దొరకనివ్వను.. మీ మామయ్య చెప్పినట్లు నీ పెళ్లి మ్యాడీతో జరిగి తీరుతుంది అని చెప్తుంది.
వరుణ్ తనకు పెళ్లి ఫిక్స్ అయింది అన్న విషయం లోహితకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మధు మ్యాడీతో నీకు ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి మ్యాడీ అని చెప్తుంది. చెప్పు మధు అని మ్యాడీ అంటే గొడవలతో మొదలైన మన పరిచయం ఇక్కడి వరకు వచ్చింది. తెలిసో తెలీకో నీ గురించి ఆలోచిస్తున్నా మ్యాడీ. నీతో మాట్లాడుతుంటే నేను ఈ లోకాన్నే మర్చిపోతా. నిన్ను చూడగానే నా కళ్లలో ఓ మెరుపు వస్తుంది. నీకోసం కాలేజ్‌కి పరుగెత్తుకుంటూ వచ్చేస్తా అని అంటే దానికి మహి నీతో ఫ్రెండ్‌షిప్ ఎంజాయ్ చేస్తా మధు అంటాడు.
మధు ఇది ఫ్రెండ్‌షిప్ మాత్రమే కాదు అని చెప్తుంది. నీలో ఉన్న మంచితనం నన్ను నిన్ను ఇష్టపడేలా చేసింది. నువ్వంటే నాకు ఉన్న ఇష్టం పెరిగి పెరిగి ప్రేమగా మారింది అని మధు ఐలవ్‌యూ మ్యాడీ అని చెప్తుంది. మ్యాడీ షాక్ అయిపోతాడు. సారీ మధు నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు.. అది.. నేను ఇంకో అమ్మాయిని లవ్ చేస్తున్నా మధు అని చెప్తాడు. మధు షాక్ అయిపోతుంది. ఆ అమ్మాయి అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇష్టమే కాదు నా ప్రాణం కూడా.. అసలు నేను బతుకుతున్నదే తన కోసం.. అసలు నేను ఇండియాకి వచ్చిందే తన కోసం అని చెప్తాడు. సారీ మధు ఇప్పటి వరకు నువ్వు చెప్పిన ప్రేమ నాకు ఉంది కానీ ఆ ప్రేమ తన మీద ఉంది అని అంటాడు.
మధు ఏడుస్తూ పర్లేదు మ్యాడీ చిన్నప్పటి నుంచి నాకు అలవాటే నేను ఏదు కోరుకుంటే అది నాకు దక్కదు.. ఇంతకీ ఆ లక్కీగల్ ఎవరు అని అడుతుంది. నా చిన్నప్పటి ఫ్రెండ్ నా ఎవ్రిథింగ్ అన్నీ నాకు నా చిన్నినే అని అంటాడు. మధు షాక్ అయిపోతుంది. మధుకి మ్యాడీ చిన్ని ఫొటో చూపిస్తాడు. మధు షాక్ అయిపోతుంది. చిన్నప్పటి తమ విషయాలు అన్నీ గుర్తు చేసుకుంటుంది. ఇది ఈ ఫొటో అని అడిగితే తనే చిన్ని అని మ్యాడీ అంటాడు. పట్టరాని సంతోషంతో మధు అంటే నువ్వు మహినా అని అడుగుతుంది. మహి షాక్ అయిపోతాడు. నా పేరు నీకు ఎలా తెలుసు అని మ్యాడీ అడిగితే మధు వెంటనే ఫోన్ తీసుకొచ్చి మహి చిన్నప్పటి ఫొటో చూపిస్తుంది.
మహి చాలా సంతోషంతో అంటే నువ్వే నేను వెతుకుతున్న చిన్నివా అని అవును మహి అని మధు అంటుంది. ఇద్దరూ ఐలవ్‌యూ చెప్పుకొని హగ్ చేసుకొని కలిసిపోతారు. తీరా చూస్తే ఇదంతా లోహిత కల. ఇదే జరిగితే పరిస్థితి ఏంటా అని లోహిత గుండె పట్టుకొని కూర్చొంటుంది. మహి, మధులు లోహిత ఎదురు గానే కూర్చొంటారు. స్వప్న ప్రపోజ్ చేయమని చెప్తుంది. లోహిత బేరర్‌తో డ్రింక్ మధు డ్రస్ మీద పడేయమని చెప్తుంది. మధు డ్రస్ వాష్ చేసి వస్తానని చెప్పి వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















