Chinni Serial Today March 28th: చిన్ని సీరియల్: 24 గంటల్లో విజయ్ కావేరి కేసు క్లోజ్ చేయగలడా.. అన్నకి ఉష ఎందుకు క్షమాపణ చెప్పింది!!
Chinni Today Episode సత్యంబాబుని కొడుతున్నారని చిన్ని విజయ్తో చెప్పడం విజయ్ అడ్డుకొని సత్యంని వదిలేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Today Episode సత్యంబాబుని పోలీసులు కొడుతుంటే రాజు వెళ్లి అడ్డుకోవడానికి లాఠీ పట్టుకుంటాడు. ఇంట్రాగేషన్‌కి పిలిచి ఇలా కొడతారా అని రాజు అడిగితే అడ్డుకోవడానికి నువ్వు ఎవడ్రా అని పోలీస్ అంటాడు. దానికి రాజు నేను కావేరి భర్తని అని రాజు చెప్తాడు. కావేరి ఫైర్ యాక్సిడెంట్‌లో చనిపోయింది ఇప్పుడు సత్యంబాబుని కొట్టడం తప్పు అని అంటాడు. నిన్నూ కొట్టాలిరా అయితే అని ఎస్ఐ అంటే కానిస్టేబుల్ వీడు పెళ్లాం పిల్లని వదిలేసి తిరుగుతూ ఉంటాడు అని అనగానే వాళ్లని గెంటేయమని చెప్తారు. కానిస్టేబుల్ వాళ్లని గెంటేస్తాడు.
ఉష తన శ్రేయాభిలాషి కాల్ చేయాలని అని కాల్ చేస్తుంది. అక్కడే ఉన్న రాజు( శ్రేయాభిలాషి) దూరంగా వెళ్లి మాట్లాడుతాడు. కావేరి నిజం చెప్పేస్తా అంటే రాజు వద్దని కొంచెం టైం ఇస్తే నేనే ఏం చేయాలో చెప్తానని అంటాడు. విజయ్ సార్ వస్తేనే మామయ్యని కొట్టడం ఆపుతారని చిన్ని పరుగులు తీస్తుంది. విజయ్ కారు వస్తుండగా చిన్నికి ఓ కారు ఢీ కొడుతుంది. విజయ్ పరుగున వచ్చి చిన్నిని పట్టుకొని ఏం కాలేదు కదా అని అడుగుతాడు. దాంతో చిన్ని మామయ్యని స్టేషన్‌లో కొడుతున్నారని విజ్జుతో చెప్తుంది. మీ మామయ్యని ఇంకెవరూ కొట్టరు అని చిన్నిని తీసుకొని వెళ్తాడు. గౌతమ్‌తో స్టేషన్‌కి కాల్ చేసి ఇంటరాగేషన్ ఆపమని చెప్పమని అంటాడు. గాయాలతో ఉన్న మామయ్యని చూసి చిన్ని ఏడుస్తుంది. విజ్జు సార్ మామయ్యని ఎలా కొట్టారో చూశారా అని అడుగుతుంది. విజయ్ ఎందుకు అలా కొట్టారని అడిగితే డీసీపీ సార్ చెప్పారని అంటారు. వాళ్ల మీద విజయ్ సీరియస్ అవుతాడు. సత్యంబాబుకి విజయ్ సారీ చెప్తాడు.
ఇంతలో స్టేషన్‌కి లాయర్ హరిశ్చంద్ర వస్తాడు. అతన్ని రాజునే ఏర్పాటు చేస్తాడు. చనిపోయిన కావేరి గురించి ఇప్పుడు ఇలా ఇంటరాగేషన్ చేయడం ఏంటి అని ప్రశ్నిస్తాడు. కావేరి చనిపోయిందని చెప్పింది గవర్నమెంట్.. డెత్ సర్టిఫికేట్ ఇచ్చింది గవర్నమెంట్ అని పేపర్లు విజయ్ చేతిలో పెడతారు. మేం కూడా మీ మీద కేసు పెట్టగలం సత్యంబాబుని వదిలేయండి అని చెప్తారు. విజయ్ వాళ్లు సత్యంని వదిలేస్తారు. కేసు మాత్రం వదలను అని విజయ్ అంటాడు. ఇక విజయ్ ఉషతో ఇప్పటికైనా ఒప్పుకోండి అంటే నేను ఉషనే కావేరిని కాదు అని అంటుంది. దాంతో విజయ్ 24 గంటల్లో మీ నోటితో మీరే కావేరి అనేలా చేస్తానని మిమల్ని ఇక ఎవరూ కాపాడలేరని విజయ్ అంటాడు. దానికి చిన్ని విజ్జు సార్ నేను మీ కూతురిలా ఉంటాను కదా నేను మీ కూతురిలా అబద్ధాలు చెప్పను సార్ తను మా అమ్మ కాదు సార్ తనని ఇబ్బంది పెట్టొద్దు అని విజయ్ కాళ్లు పట్టుకుంటుంది. దాంతో విజయ్ ఇంకో 24 గంటలు ఆగమ్మా నిజానిజాలు అందరికీ తెలుస్తాయని అంటాడు.
ఉష వచ్చిన తర్వాత రాజు సత్యంబాబుని ఆటో ఎక్కమంటే ఎక్కడు. దాంతో రాజు పంతాలకు పట్టింపులకు ఇది సమయం కాదు రా అని పిలుస్తాడు. లాయర్ కూడా వెళ్లమని చెప్పడంతో సత్యం ఆటో ఎక్కుతాడు. చిన్ని, ఉషలు స్యూటీ మీద వస్తారు. సత్యంబాబుని రాజు జాగ్రత్తగా పట్టుకుంటే సత్యం చూడటంతో రాజు వదిలేస్తాడు. సత్యం పరిస్థితి చూసి సరళ ఏడుస్తుంది. గాయాలకు వేడి నీటితో కాపడం పెడుతుంది. ఉష మళ్లీ ఇంటికి రావడంతో సరళ ఆవేశంగా లోపలికి వెళ్లి కావేరి ఫొటోకి దండ తీసేసి ఆ ఫొటో తులసి కోట దగ్గరకు విసిరేస్తుంది. తులసి కోట దీపానికి ఫొటో కాలిపోతుంటే సత్యం వెళ్లి పట్టుకుంటాడు. ఉష ఇంట్లోకి వస్తుంటే సరళ ఆపేస్తుంది. ఇంట్లోకి రాకు నువ్వు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇబ్బందులే అని ఏడుస్తుంది. అప్పుడు కావేరి ఇప్పుడు ఈ ఉష వల్ల ప్రశాంతత లేదని నా ఆడపడుచు చచ్చి కూడా నన్ను సాధిస్తుందని అంటుంది. ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండటానికి వీల్లేదని సరళ అంటే సత్యంబాబు అలా అనొద్దని వారిస్తాడు. ఇక లాయర్ తను కావేరి కాదు ఉష అని తేలే వరకు పంపొద్దని అంటారు. నా భర్త ఈవిడలో తన చెల్లిని చూసుకుంటున్నారు కాబట్టి వదిలేస్తున్నా అంటుంది. ఉష సత్యంబాబుకి సారీ చెప్తుంది. సరళ మాటలు పట్టించుకోకుండా లోపలికి వెళ్లమని అంటాడు. ఉష సత్యంబాబుకి దండం పెడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: సూర్య ఇంటికి ఫైల్‌తో విరూపాక్షి.. జీవన్, మాధవిల ప్లాన్ ఫలిస్తుందా!





















