Chinni Serial Today March 27th: చిన్ని సీరియల్: కావేరి కేసులో కీలక మలుపు.. సత్యాన్ని చెల్లి ముందే చితక్కొట్టిన పోలీసులు.. విజయ్‌కి దొరికిన లీడ్!
Chinni Today Episode కావేరి పార్వతిని చంపి జైలుకి వెళ్లిందని దేవాకి కూడా ఈ కేసులో సంబంధం ఉందని విజయ్ తెలుసుకొని ఇంటరాగేషన్ మొదలు పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode ఉష చిన్నిని తీసుకొని పోలీస్ స్టేషన్‌కి వెళ్తుంది. సరళతో పిల్లలు కూడా వెళ్తామని అంటారు. దాంతో సరళ వాళ్లు కూడా వెళ్తారు. విజయ్ సత్యంబాబుని కావేరి గురించి ప్రశ్నిస్తాడు. మీ చెల్లిని చూశారా అంటే లేదని తాము వెళ్లినప్పటికే తన చెల్లి చనిపోయిందని బాడీ మొత్తం కాలిపోయిందని చెప్తారని సత్యం చెప్తాడు.
విజయ్: మీరు మీ చెల్లిని చూడలేదన్నమాట. ఇది మీ చెల్లి డెడ్ బాడీ అని ఇస్తే తీసుకొచ్చారు అంతే కదా అది మీ చెల్లి బాడీ కాకపోవచ్చు కదా.
సత్యం: అవకాశం లేదు సార్ డాక్టర్లు, పోలీసులు అది కావేరి అనే చెప్తారు. అందరూ తను కావేరి అనే చూపించారు. పోలీసులు డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం అంతే కదా సార్. పోలీస్ స్టేషన్‌కి ఉష, సరళ, రాజు అందరూ వస్తారు.
విజయ్: సత్యం బాబు మీరేం చేస్తుంటారు.
సత్యం: టైలరింగ్ సార్ ఏదో చిన్న షాప్ పెట్టుకున్నా.
విజయ్: టైలరింగ్ చేసే కోట్లు సంపాదించారా.
సత్యం: ఏం మాట్లాడుతున్నారు సార్ టైలరింగ్ చేస్తే కోట్లు ఎలా వస్తాయి సార్.
విజయ్: మరి అయితే మీ చెల్లి చనిపోయిన తర్వాత ఇచ్చిన 25 లక్షల చెక్ ఎందుకు బ్యాంక్‌లో వేయలేదు. అంటే మీ చెల్లి చనిపోలేదని మీరే నమ్మడం లేదు. మీ ఇంట్లో అద్దెకు ఉన్న ఉషే కావేరి అని మీకు తెలుసు. నిజం చెప్తే కావేరికి మాత్రమే శిక్ష పడుతుంది కాదని మీరు చెప్పకపోతే మీకు కూడా శిక్ష పడుతుంది. చిన్నితో పాటు మీ ఫ్యామిలీ కూడా అనాథ అయిపోతారు.
ముఖ్యమైన వ్యక్తిని కలవాలి అని విజయ్ బయటకు వెళ్తాడు. మరో అధికారి తాను నిజం చెప్పిస్తా అంటాడు. విజయ్ వెళ్తుంటే చిన్ని మా మామయ్య విజ్జు అంటే విజయ్ ఏం కాదని సమాధానం చెప్తే వదిలేస్తామని అంటారు. అందరూ విజయ్‌ని బతిమాలుతారు. విజయ్ పరశురాం అనే వ్యక్తిని కలవడానికి వెళ్తాడు. ఆపేరు విని కావేరి అతను ఎవరు అని అనుకుంటుంది. విజయ్ పరశురాంని కలవగానే అతను కావేరి చంపిన పార్వతి ఫొటో చూపించి ఈ కేసులో కావేరి జైలుకి వెళ్లిందని చెప్తాడు. దేవా ఫొటో కూడా ఉండటంతో కావేరి చంపిన పార్వతి భర్తే ఈ దేవా అని చెప్తారు. దేవా చాలా సార్లు కావేరిని కలవడానికి స్టేషన్‌కి వచ్చారని తెలియగానే విజయ్ షాక్ అవుతాడు. తన భార్యని చంపిన వ్యక్తిని అతను కలవడం ఏంటి అనుకుంటాడు. హెళీలో కావేరి మీద అటాక్ గుర్తు చేసుకొని దేవానే చేయించుంటాడని అనుకుంటాడు. ఇక విజయ్ దేవాతో మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్తాడు. పై అధికారి ఎస్‌ఐకి తమ స్టైల్‌లో ఇంటరాగేషన్ చేయమని అంటే శివరామకృష్ణ సత్యంబాబుని ప్రశ్నించి కొడతాడు. బయట నుంచి అందరూ లోపలికి వెళ్తారు. పిల్లలు, ఉష, సరళ అందరూ ఏడుస్తారు. సత్యంబాబుని ఎస్ఐ చితక్కొడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఎన్ని సార్లు మనసు ముక్కలు చేసుకోవాలి.. నేను ఓ ఆడపిల్లనే.. జ్యోత్స్న డైలాగ్స్ పీక్స్!





















