Chinni Serial Today June 25th: చిన్ని సీరియల్: లాయర్‌ని చితక్కొట్టిన దేవా రౌడీలు.. చిన్ని, కావేరిల ప్రాణాల కోసం వేట.. ఊరు దాటేస్తారా!
Chinni Today Episode కావేరి, చిన్నిలకు మెమొరీ కార్డు దొరకడం లాయర్‌కి విషయం చెప్పడంతో దేవా మనుషులు లాయర్‌ని చితక్కొట్టి వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్ని గుడి దగ్గర నిమ్మ దీపాల గురించి తెలుసుకుంటుంది. రాహుకాలంలో తొమ్మిది మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ ఇలా నిమ్మ దీపాలు పెడితే కోరిక నెరవేరుతుంది అని అక్కడున్న ఒకామె చిన్నికి చెప్తుంది. ఆ మహిళ పెట్టిన దీపాలు కొండెక్కబోతే చిన్ని, కావేరి ఇద్దరూ చూసి ఆ దీపాలు ఆరకుండా చేతులు అడ్డుపెడతారు.
కావేరి, చిన్ని దగ్గరకు ఆ దంపతులు వచ్చి తమ బిడ్డ పురిటిలోనే చనిపోతుందని కానీ మీ ఈ సారి బిడ్డ బతకాలి అని ఇలా దీపాలు పెట్టాం మీ రూపంలో అమ్మవారు వచ్చి కాపాడిందని కావేరి, చిన్నిలకు కృతజ్ఞతలు చెప్తారు. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని కావేరి ఆమెకు చెప్తుంది. ఇక చిన్ని, కావేరిలు మెమొరీ కార్డు దొరకలేదు అని వెతుకుతారు. చిన్ని మంచితనానికి అంతా మంచే జరగాలి అని ఆ దంపతులు దేవుడికి కోరుకుంటారు.
చిన్ని మెమొరీ కార్డు వెతుక్కుంటూ వచ్చి నవగ్రహాల దగ్గర చూస్తుంది. అక్కడ చిన్నికి మెమొరీ కార్డు దొరుకుతుంది. చిన్ని కావేరికి చెప్తుంది. ఇద్దరూ అది చూసి చాలా సంతోషపడతారు. బాలని విడిపించుకోవచ్చని కావేరి చిన్నితో చెప్తుంది. ఇక లాయర్‌తో మాట్లాడటానికి కావేరి పక్కకు వెళ్తుంది. లాయర్‌కి విషయం చెప్తుంది. లాయర్ కావేరిని వెంటనే కోర్టుకి రమ్మని చెప్తాడు. తాను వస్తానని అంటాడు. దేవాకి ఎలా అయినా శిక్ష పడేలా చేయాలి అని లాయర్ హరి అనుకుంటాడు. కావేరి కాల్ మాట్లాడటం దేవా రౌడీ చూస్తాడు.
చిన్ని దగ్గరకు మహి వస్తాడు. ఇద్దరూ మాట్లాడుకుంటారు. మహి చిన్ని కోసం జున్ను తీసుకొచ్చి తిందామని చిన్నిని తీసుకెళ్తాడు. తానే చిన్నికి తినిపిస్తాడు. చిన్ని కూడా మహికి తినిపిస్తుంది. ఇద్దరూ జున్ను తింటారు. మహి చిన్నికి పెళ్లి కొడుకు బొమ్మ జాగ్రత్తగా ఉంది అని అంటే చిన్ని మహికి బొమ్మ చూపించి జాగ్రత్తగా ఉందని చెప్తుంది. ఈ పెళ్లి కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటున్నా దీనికి ఏమైనా అయితే నీకు అయినట్లు నాకు భయం వేస్తుంది అందుకే చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నా అని చిన్ని చెప్తుంది. ఇంతలో కావేరి వస్తుంది. మహి స్కూల్‌కి టైం అయిందని వెళ్లిపోతాడు. మహి వెళ్తూ వెళ్తూ చిన్నిని చూస్తాడు. చిన్ని కూడా మహినే చూస్తుంది. ఇద్దరూ బాయ్ చెప్పుకుంటారు.
దేవాకి రౌడీ కాల్ చేసి కావేరి గుడికి వచ్చిందని తనకు మెమొరీ కార్డు దొరికిందని ఎవరికో చెప్పిందని అంటాడు. దాంతో దేవా కావేరిని చంపేసి ఆ మెమొరీ కార్డు తీసుకొచ్చేయమని చెప్తాడు. తాను చంపాలి అనుకున్నానని కానీ మహి బాబు వచ్చి చిన్ని కావేరితో మాట్లాడాడని చెప్తారు. మహి ఎందుకు వచ్చాడు. మహి వెళ్లిపోయిన తర్వాత చిన్ని, కావేరిలను చంపేయమని అంటాడు. దేవా రౌడీలకు మళ్లీ కాల్ చేస్తాడు. కావేరి ఎటు వెళ్లిందో కనిపించడం లేదని రౌడీలు చెప్తే అది కచ్చితంగా ఆ లాయర్ హరి దగ్గరకు వెళ్లుంటుంది వాడి దగ్గరకు వెళ్లమని అంటాడు.
దేవా మెమొరీ కార్డు గురించి మాట్లాడటం నాగవల్లి వింటుంది. మెమొరీ కార్డు ఏంటి అని వల్లి అడిగితే దేవా తనకు తెలీదని కావేరి బాలరాజుని తప్పించడానికి ఏమైనా చేస్తుందేమో అని తన చేతిలో ఉన్న ఆ మెమొరీ కార్డు తీసుకురమ్మని చెప్పానని అంటాడు. వాళ్లంతా చనిపోవాలని నాగవల్లి అంటుంది. మహి సంతోషంగా ఇంటికి వచ్చి నాగవల్లిని అమ్మా అని హగ్ చేసుకొని చిన్నిని కలిసిన విషయం చెప్తాడు. మహి చిన్నికి బాగా దగ్గరైపోతున్నాడు. మహిని వేరే స్కూల్‌కి మార్చేయాలి అని నాగవల్లి అంటే అవసరం లేదు చిన్ని, కావేరి ఇద్దరూ గంటలో చనిపోతారు మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందని దేవా అంటాడు.
రౌడీలు లాయర్ హరి దగ్గరకు వెళ్లి లాయర్‌ని కొట్టి కావేరి గురించి అడుగుతారు. మెమొరీ కార్డు గురించి అడుగుతారు. హరి తెలీదు అనడంతో హరిని చితక్కొడతారు. రౌడీలు వెళ్లిపోయిన తర్వాత హరి కావేరికి కాల్ చేసి జరిగింది చెప్తాడు. చిన్ని, నువ్వు జాగ్రత్త అని వాళ్లకి మీరు కనిపిస్తే మిమల్ని చంపి అయినా సరే ఆ మెమొరీ కార్డు తీసుకునేలా ఉన్నారు. ముందు మీరు కోర్టుకి వెళ్లకుండా చిన్నిని తీసుకొని ఊరు నుంచి వెళ్లిపో అని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















