Chinni Serial Today June 19th: బాలరాజు కేసుని ఊహించని మలుపు తిప్పేసిన కానిస్టేబుల్.. బాలకి 14 ఏళ్ల జైలుశిక్ష!
Chinni Today Episode కానిస్టేబుల్ శంకరం బాలరాజు నేరం చేశాడని కోర్టులో చెప్పడంతో బాలరాజుకి శిక్ష పడటంతో చిన్ని కావేరి కుమిలిపోతారు. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Chinni Serial Today Episode కోర్ట్ సీన్ కంటిన్యూ అవుతుంది. బాలరాజు తరపున లాయర్ హరి బలమైన సాక్ష్యం ఉందని ఒక ఐదు నిమిషాలు టైం అడిగితే జడ్జి ఒకే చెప్తారు. ఇక స్కూల్‌లో మహి చిన్ని రాలేదని బాధగా ఉంటాడు. లంచ్ చేయకుండా కూర్చొంటాడు. చందు, లోహిత వచ్చి తినమంటే చిన్నికి ఇష్టమైన స్వీట్ తీసుకొచ్చా చిన్ని రాకపోయే సరికి నాకు ఏదోలా ఉంది.
లోహిత చిన్ని గురించి తనకు తెలీదు అని అంటే చిన్ని మీ ఇంట్లో ఉంది కదా నీకు తెలీకపోవడం ఏంటి అని అడుగుతాడు. లోహిత చిన్ని తన ఇంట్లో లేదని చెప్పబోతే చందు ఆపి పెళ్లి పనుల్లో బిజీ అయి చిన్ని రెస్ట్ తీసుకుందని అంటాడు. మహి చిన్నికి ఇవ్వమని స్వీట్ చందుకి ఇస్తాడు. కావేరి కానిస్టేబుల్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పీపీ కానిస్టేబుల్‌ని చూసి ఈ కానిస్టేబులా వీళ్ల సాక్షి దేవా సారే దీని అంతటికి కారణం అని ఈయనకు తెలుసు కదా అని టెన్షన్ పడతాడు. కానిస్టేబుల్ బోనులోకి వెళ్లి సత్యంబాబుని బాలరాజు చంపాడు అంటే నేను నమ్మను సార్ అని చెప్తాడు. ఆ వేలి ముద్రల ఆధారంగా బాలరాజు సత్యంబాబుని చంపాడు అంటే నేను నమ్మను సార్ అని అంటాడు.
కావేరి, చిన్ని, లాయర్ హరికి కాస్త ఊరట లభిస్తుంది. ఇంతలో కానిస్టేబుల్ బాలరాజు సత్యంబాబుని చంపడం కల్లారా చూశానని ప్లేట్ ఫిరాయిస్తాడు. అందరూ షాక్ అయిపోతారు. కావేరి లేచి నాతో మీరు చెప్పింది ఏంటి ఇప్పుడు చెప్తుంది ఏంటి శంకరం గారు అని అంటుంది. బాలరాజు సత్యంబాబుని పొడవటం తాను కల్లారా చూసి తను సెలవులో ఉండటం వల్ల స్టేషన్‌కి ఫోన్ చేస్తే వాళ్లు వచ్చి అరెస్ట్ చేశారని చెప్తారు. ఈ రోజు ఉదయం పీటీ టీచర్ తనకు దొంగ సాక్ష్యం చెప్పమన్నారు అని తాను చెప్తాను అని నమ్మించానని అంటాడు. బాలరాజుని కఠినంగా శిక్షించాలని శంకరం అంటారు. కావేరి, బాలరాజు కానిస్టేబుల్ నమ్మక ద్రోహం చేశాడని చాలా బాధ పడతారు.
సత్యంబాబుని బాలరాజు దారుణంగా చంపాడని కోర్టు నమ్ముతుందని బాలరాజుకి 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. చిన్ని ఏడుస్తుంది. బాలరాజుని పోలీసులు తీసుకొని వెళ్తుంటే చిన్ని నాన్నని పట్టుకొని ఏడుస్తుంది. కానిస్టేబుల్ శంకరం మనల్ని ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు బాల అని కావేరి ఏడుస్తుంది. బాలని పోలీసులు తీసుకెళ్తేంటే చిన్ని తండ్రిని వదలకుండా ఏడుస్తుంది. చిన్ని కింద కూలబడి ఏడుస్తుంది. లాయర్ చిన్నిని ఏడ్వొద్దని అంటారు.
కావేరి కానిస్టేబుల్ దగ్గరకు వెళ్లి నిలదీస్తుంది. దాంతో కానిస్టేబుల్ తాను నిజం చెప్పాలి అనుకోవడం దేవేంద్ర వర్మ వాళ్లకి తెలిసి తన కూతుర్ని కిడ్నాప్ చేసి దొంగ సాక్ష్యం చెప్పాలని లేదంటే తన కూతుర్ని చంపేస్తానని బెదిరించారని తనని క్షమించమని కానిస్టేబుల్ అంటారు. నువ్వు నీ కూతురు ఈ ఊరిలో ఉండటం మంచిది కాదమ్మా ఆ దేవా తనని ప్రాణాలతో ఉంచరని చెప్తారు. కావేరి షాక్ అయిపోతుంది. చిన్ని కావేరి దగ్గరకు వచ్చి అమ్మ 14 ఏళ్లు నాన్న మనం లేకుండా ఎలా ఉంటాడమ్మా అని ఏడుస్తుంది. రాత్రి కావేరి చిన్నిని తీసుకొని సరళ దగ్గరకు వెళ్తుంది. మీ కోరిక ప్రకారం బాలరాజుకి శిక్ష పడింది అని అంటుంది. దానికి సరళ తెలుసు నువ్వు పీటీ ఉష కాదు కావేరి అని కూడా తెలుసు నీలాంటి మోసగత్తె మా దరిదాపుల్లో కూడా ఉండకూడదు వెళ్లిపోండి అని చెప్తుంది.
కావేరి సరళ చేతులు పట్టుకొని వదిన అలా మాట్లాడకు వదిన అని ఏడుస్తుంది. ఎవరే నీకు వదిన కన్న తండ్రిని అన్నని కాదని నీ దారిన వెళ్లిపోయావ్. నీ వల్ల మా మామయ్య గారు పోయారు సమాజంలో మర్యాద పరువు పోయాయి.. ఆస్తులు పోయావి. అయినా సంతోషంగా ఉన్నాం. ఉష పేరుతో వచ్చి నా భర్తని పొట్టన పెట్టుకున్నావ్ అని సరళ ఏడుస్తుంది. మా అమ్మ ఏం చేయలేదు మమల్ని ఇక్కడ ఉండనివ్వు అని చిన్ని బతిమాలు తుంది. మా ముగ్గుర్ని కూడా చంపుకుతినే వరకు మీరు ప్రశాంతంగా ఉండరే అని సరళ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: రాఘవని కలిసి ఎమోషనలైన ఆనంద్.. లొకేషన్‌కి చేరుకున్న రాజు, రూపలు.. ఏం జరుగుతుంది?





















