Chinni Serial Today June 17th: చిన్ని సీరియల్: దేవా, నాగవల్లిల పెళ్లి ఆపలేకపోయిన కావేరి, బాల.. దేవా కావేరికి ఇస్తానన్న ఊహించని గిఫ్ట్ ఏంటి?
Chinni Today Episode బాలరాజు అరెస్ట్ కావడంతో నాగవల్లి, దేవాల పెళ్లి జరిగిపోవడం కావేరి బాలరాజుకి శిక్ష పడకుండా సాక్ష్యాలు కోసం పరుగులు తీయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్నిని క్షేమంగా తీసుకొచ్చిన మహి చిన్నిని ఎవరో స్టోర్‌రూంలో పెట్టేశారని మహి చెప్తాడు. కావేరి చాలా కంగారు పడుతుంది. దేవానే చేసుంటాడని కోపంగా చూస్తుంది. దేవా మాత్రం తనకు ఏం తెలీనట్లు ఇలా మాట్లాడుతాడు. ఇక దేవా, వల్లిల పెళ్లి తంతు ప్రారంభమవుతుంది. బాలా ఇంకా రాలేదేంటి అని కావేరి కంగారు పడుతుంది.
బాలరాజుని పోలీసులు సెల్‌లో వేస్తారు. బాలరాజు ఎంత బతిమాలినా పోలీసులు వదలరు. నీ బెయిల్ క్యాన్సిల్ అయింది అని చెప్తారు. ముహూర్తం టైం దగ్గర పడింది ఇంకా బాల రాలేదు ఇప్పుడేం చేయాలి అని కావేరి చాలా కంగారు పడుతుంది. దేవా, నాగవల్లి ఒకరి తల మీద ఒకరు జీలకర్రా బెల్లం పెట్టుకుంటారు. అసలేం జరుగుంటుంది అని కావేరి టెన్షన్ పడుతుంది. బాలరాజు కానిస్టేబుల్‌కి విషయం చెప్పి అది బాబాయ్ జరిగింది వెంటనే ఆఫ్ టికెట్‌కి కాల్ చేసి పోలీస్ స్టేషన్‌కి రమ్మని చెప్పమని అంటాడు. అతను సరే అంటారు. ఇక దేవా, నాగవల్లిల పెళ్లి అయిపోతుంది.
ఆఫ్ టికెట్ కంగారుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్తాడు. కావేరికి కాల్ చేసి బాల విషయం చెప్పమని బాల చెప్తాడు. ఆఫ్ టికెట్ చాలా సార్లు కాల్ చేస్తాడు. అప్పుడే కావేరి దగ్గరకు దేవా, వల్లి వస్తారు. దేవా కావేరితో మాకు ఏం గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నావ్ సరే నువ్వు ఇవ్వొద్దు మేమే నీకు ఊహించని గిఫ్ట్ ఇస్తామని అంటాడు. తర్వాత కావేరి ఆఫ్ టికెట్‌కి కాల్ చేస్తే రాజన్న పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడని బెయిల్ క్యాన్సిల్ అయిందని ఆఫ్ టికెట్ చెప్తాడు. కావేరి షాక్ అయిపోతుంది. నేను వస్తున్నా అని కావేరి అంటే ఆఫ్ టికెట్ వద్దని చెప్తాడు. ఏం జరిగిందో మొత్తం ఆఫ్ టికెట్ కావేరికి చెప్తాడు. ఇదంతా కచ్చితంగా దేవా పనే వాడే బెయిల్ క్యాన్సిల్ చేయించాలని ఇలా చేసుకుంటాడని కావేరి అనుకుంటుంది.
కావేరి దగ్గరకు చిన్ని వచ్చి నాన్న ఇంకా రాలేదు ఏంటి అని అడుగుతుంది. పనిలో బిజీగా ఉన్నారని చెప్తుంది. ఇక మహి, చందు, లోహిత మిగతా పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు. లోహిత పెళ్లి బొమ్మలు బాగున్నాయని అంటే చిన్నికి నచ్చాయి చిన్నికి ఇస్తానని మహి అంటాడు. ఇక కావేరి, చిన్నిలు మహితో ఇక ఇంటికి వెళ్తాం అని చెప్తే మహి రెండు రోజులు ఉన్నందుకు థ్యాంక్స్ చెప్తాడు. ఇక బొమ్మలు చిన్నికి ఇస్తానని మహి అంటే చిన్ని వద్దు నీకు నచ్చాయి కదా నువ్వే ఉంచుకో అని అంటుంది. ఇద్దరికీ నచ్చాయి కదా ఇద్దరూ చెరో బొమ్మ తీసుకొండి అని చందు అనడంతో మహి చిన్నికి పెళ్లి కొడుకు బొమ్మ ఇచ్చి తాను పెళ్లి కూతురి బొమ్మ ఉంచుకుంటాడు. తర్వాత చిన్ని వాళ్ల వెళ్లిపోతారు.
చిన్ని బొమ్మని చూసి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. అదంతా చూసిన నాగవల్లి మహి చిన్నికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు వీలైనంత త్వరగా వాళ్ల మధ్య స్నేహం కట్ చేయాలని నాగవల్లి అనుకుంటుంది. కావేరి బాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కావేరి దగ్గరకు చిన్ని వచ్చి ఏమైంది అమ్మ ఎందుకు అలా ఉన్నావ్ అడుగుతుంది. ఏం ఆలోచిస్తున్నావ్ అంటుంది. కావేరి ఏం చెప్పకపోయే సరికి చిన్ని తన మీద ఒట్టు పెట్టుకొని నిజం అడుగుతుంది. దాంతో కావేరి చిన్నితో మీ నాన్నకి బెయిల్ క్యాన్సిల్ అయింది ప్రస్తుతం జైలులో ఉన్నారని చెప్తుంది. చిన్ని ఏడుస్తుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు నాన్నని బయటకు తీసుకురా అని ఏడుస్తుంది.
కావేరి సరే అంటుంది. ఉదయం కావేరి చాలా ఆలోచించి లాయర్ హరికి కాల్ చేస్తుంది. బాలరాజు అరెస్ట్ గురించి చెప్తుంది. హరి కావేరితో బాలని కోర్టుకి తీసుకెళ్లే లోపు ఏదో సాక్ష్యం తీసుకురావాలి లేదంటే శిక్ష పడుతుందని అంటాడు. కావేరి కానిస్టేబుల్‌ని కలుస్తానని అంటుంది. చిన్నికి విషయం చెప్తే చిన్ని గుడికి వెళ్తాను అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: రాఘవని కలిసి ఎమోషనలైన ఆనంద్.. లొకేషన్‌కి చేరుకున్న రాజు, రూపలు.. ఏం జరుగుతుంది?





















