Chinni Serial Today June 12th: చిన్ని సీరియల్: 2 రోజుల్లో దేవా, నాగవల్లిల పెళ్లి.. దేవా ఇంట్లోనే ఉన్న కావేరి, బాల పెళ్లి ఆపడానికి ఏం చేయనున్నారు?
Chinni Today Episode దేవా, నాగవల్లికి పెళ్లి ఫిక్స్ చేయడం కావేరి, బాలరాజు, చిన్నిలను తన ఇంట్లోనే ఉండమని మహి ఒప్పించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్ని మహితో మీ డాడీ పిన్నిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించు అని మహిని పంపిస్తుంది. మహి దేవా దగ్గరకు వెళ్లి నాకు అర్జెంటుగా ఒకటి కావాలి తెచ్చి ఇస్తావా డాడీ అని అడుగుతాడు. ప్రామిస్ వేయించుకుంటాడు. ఏం కావాలి అని దేవా అంటే నాకు అమ్మ కావాలి అని అడుగుతాడు. అందరూ షాక్ అయిపోతారు.
మహి దేవాతో అమ్మ కావాలి అంటే ఆ అమ్మ కాదు ఈ అమ్మ. నువ్వు పిన్నిని పెళ్లి చేసుకొని నాకు అమ్మని చేయాలి అని నాకు ప్రామిస్ చేశావు కదా అని దేవా, నాగవల్లి చేతులు కలుపుతాడు. దేవా సరే అని అంటాడు. ప్రమీల ముహూర్తాలు పెట్టించడానికి పంతుల్ని పిలుస్తుంది. పంతులు దేవా, వల్లి జాతకాలు బాగా కలిశాయని రెండు రోజుల్లో మంచి మంచి ముహూర్తం ఉందని అంటారు. రెండు రోజుల్లో ఇద్దరి పెళ్లి ఫిక్స్ చేస్తారు. ఇంతలో కావేరి, బాలరాజు అక్కడికి వస్తారు. చిన్నిని చూసి కావేరి ఎమోషనల్ అయిపోతుంది. మహి దేవుడిలా వచ్చి కాపాడాడని చిన్ని చెప్తుంది. ఇక మహి కావేరి వాళ్లతో గుడ్ న్యూస్ అని తన తండ్రి, పిన్నికి రెండు రోజుల్లో పెళ్లి అని చెప్తాడు.
కావేరి, బాలరాజు షాక్ అయిపోతారు. కావేరిని చూసి నాగవల్లి కోపంగా ఉంటుంది. దేవా వల్లితో అందరికీ స్వీట్స్ ఇవ్వమని చెప్తాడు. కావేరి, బాలరాజుకి ముఖం చూడకుండా స్వీట్ ఇస్తుంది. ప్రమీల కావేరి వాళ్లతో సడెన్‌గా పెళ్లి ఫిక్స్ అయింది మీరు ఈ రెండు రోజులు మా ఇంట్లోనే ఉండాలి అని అంటుంది. మహి కూడా అదే చెప్తాడు. దేవా వైపు బాలరాజు చూడటంతో మహి దేవాకి వాళ్లని ఉండమని చెప్తాడు. దేవా బాలరాజుతో నువ్వు, టీచర్, చిన్ని రెండు రోజులు మా ఇంట్లోనే ఉండాలి అని అంటాడు. వాళ్లని బలవంతం చేయొద్దని నాగవల్లి అంటే మహి పట్టు పడతాడు. వాళ్లు ఉండకపోతే అన్నం తినను అని మారాం చేస్తాడు. దాంతో బాలరాజు ఉండటానికి ఒప్పుకుంటాడు.
మహి బాలరాజుకి థ్యాంక్స్ చెప్తాడు. దేవా బయట ఫోన్ మాట్లాడుతుంటే బాలరాజు అక్కడికి వెళ్తాడు. రెండు రోజుల్లో పెళ్లి అనగానే హ్యాపీగా ఉన్నావ్ ఈ పెళ్లి జరగదు నువ్వు పెళ్లి కాకుండానే అత్తారింటికి వెళ్తావ్.. అదే జైలుకి వెళ్తావ్.. అని బాలరాజు అంటాడు. నా దగ్గర ఉన్న సాక్ష్యాలతో పాటు మరి కొన్ని సాక్ష్యాలు సంపాదించి జడ్జి దగ్గరకు వెళ్తానని దేవాతో చెప్తాడు. బాలరాజుని ఎలా ఆపాలని దేవా అనుకుంటూ మహిని పిలిచి పెళ్లి అయిన వరకు బాలరాజు అంకుల్ ఇక్కడే ఉంటాను అని చెప్పి వెళ్లిపోతున్నాడని మహితో చెప్పి బాలరాజుని వెళ్లకుండా ఆపుతాడు. బాలరాజు దేవేంద్ర వర్మని కోపంగా చూసి ఇంట్లోకివెళ్తాడు. దేవా మనసులో నా పెళ్లి అయిన వరకు నువ్వు ఈ ఇళ్లు దాటి బయటకు వెళ్లలేవురా అలా ఏర్పాటు చేశాను అనుకుంటాడు.
దేవేంద్ర వర్మ, నాగవల్లి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతాయి. చందు తన ఫ్రెండ్స్ అందర్ని తీసుకొని వస్తాడు. చెప్పగానే అందర్ని తీసుకొచ్చినందుకు మహి చందుకి థ్యాంక్స్ చెప్తాడు. మెహెందీ ఫంక్షన్‌కి ఏర్పాట్లు చేసుకుందా అని చిన్ని అంటే లోహిత ఏర్పాట్లు చేసిందని మహి చెప్తాడు. కోన్స్ బయట ఉన్నాయని లోహిత చెప్పడంతో చిన్ని తీసుకొస్తానని వెళ్తుంది. ఇక నాగవల్లి వాళ్ల స్నేహితులతో మాట్లాడుతుంది. చిన్ని కోన్స్ తీసుకొస్తుంటే నాగవల్లికి తగికి కోన్స్ నాగవల్లి మీద పడిపోతాయి. నాగవల్లి చిన్నిని తిట్టి కొట్టడానికి చేయి ఎత్తుతుంది. ఇంతలో కావేరి వచ్చి నాగవల్లి చేయి పట్టుకుంటుంది.
చిన్ని నాగవల్లికి సారీ చెప్తుంది. చిన్న పిల్ల కదా వదిలేయ్ అని నాగవల్లి ఫ్రెండ్స్ అనడంతో నాగవల్లి సరే అంటుంది. చిన్ని కోన్స్ తీసుకొని వెళ్లిపోతుంది. తర్వాత నాగవల్లి కావేరితో నీ కూతురి మీద చేయి ఎత్తగానే ఆవేశం తన్నుకొచ్చిందా.. పదేళ్లు జైలు శిక్ష అనుభవించినా నీకు ఆవేశం తగ్గలేదు.. అన్న చనిపోయినా ఆవేశం తగ్గలేదు.. అని అంటుంది. నేను నా భర్త ఏం తప్పు చేయలేదు కాబట్టి ఇలా ఉన్నాం.. ఇది ఆవేశం కాదు ఆత్మ విశ్వాసం అంటుంది. దేవా మంచి వాడు కాదని కావేరి చెప్పబోతే నాగవల్లి వినదు. మా అక్కని చంపినందుకు నీ మీద నాకు పీకల వరకు కోపం ఉంది నా జోలికి రాకు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రాజు, కీర్తిలకు పెళ్లి చేస్తానని మాటిచ్చేసిన సీఎం.. భర్తపై విరూపాక్షి ఫైర్!





















