Chinni Serial Today july 4th: చిన్ని సీరియల్: మధుని ర్యాగింగ్ చేసిన మహి.. లొహితతో గొడవ.. మినిస్టర్‌కి చుక్కలు చూపించిన నాగవల్లి!
Chinni Today Episode చిన్ని లోహిత గొడవ పడటం మహి చిన్నిని సీనియర్ అని రాగింగ్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధుమిత రాజమండ్రిలో అడుగుపెట్టగానే అన్ని జ్ఞాపకాలు గుర్తు చేసుకొని అమ్మని తలచుకొని ఏడుస్తుంది. మధుని తన ఫ్రెండ్ ఓదార్చుతుంది. మధుని నవ్విస్తుంది. ఇద్దరూ కాలేజ్‌కి బయల్దేరుతారు. లోహిత తన ఫ్రెండ్ కారు స్పీడ్‌గా నడుపుతూ ఉంటుంది. తన ఫ్రెండ్ స్లోగా వెళ్లు అని చెప్పినా వినదు.
మధు వాళ్లు మందు వెళ్తుంటే స్పీడ్‌గా కారు నడిపి హారన్ కొట్టి విసిగిస్తారు. వాళ్ల తాట తీస్తా అంటూ మధు ఓవర్ టేక్ చేస్తుంది. తర్వాత లోహిత మధుమిత స్కూటీని ఢీ కొడుతుంది. మధు లోహితతో గొడవకు దిగుతుంది. కార్ ఎక్కే సరికి కళ్లు నెత్తికెక్కాయా.. గులకరాయి తీసుకొని గురి చూసి కొట్టుంటే అద్దం బద్ధలైపోయేది అని గొడవ పడుతుంది. లోహిత హై రేంజ్ మేం ఇది మా పార్కింగ్ అని గొడవ పెడుతుంది. ఇద్దరూ ఒకరి మీద ఒకరు చేయి ఎత్తుకుంటారు. ఫస్ట్‌డే కాలేజ్ గొడవలు వద్దు బేబీ అని లోహితను తన ఫ్రెండ్ అంటుంది. ఇక మధుమిత కారు కీస్ తీసుకొని పార్కింగ్ చేసి లోహిత పొగరు అణుస్తుంది. లోహిత మధుని వదిలిపెట్టను అనుకుంటుంది.
సెంట్రల్ మినిస్టర్ వెంకట్రావు దేవేంద్రవర్మ ఇంటికి వస్తారు. ఆయన పర్సనల్‌గా మాట్లాడాలి అంటే అందరూ వెళ్లిపోతారు. నాగవల్లి వచ్చి దేవా పక్కనే కాళ్ల మీద కాలు వేసుకొని కూర్చొంటుంది. సెంట్రల్ మినిస్టర్‌కి కాలుతుంది. మీతో పర్సనల్‌గా మాట్లాడాలి అనుకుంటే ఆవిడ ఏంటి కాళ్లమీద కాలు వేసుకొని ఇలా నా ముందు కూర్చొంది అంటే దేవా ఆయనతో తన నా భార్య నాలో సగం పర్సనల్ అయినా ఏమైనా తన ముందే మాట్లాడుతా అంటారు. వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ మీరు తీసుకుంటున్నారు కదా అది వేరే వాళ్లకి ఇద్దామని అనుకున్నాం అది వదిలేయండి అంటే దేవా కుదరదు అంటాడు. రెండు ఏళ్లలో ఎలక్షన్ ఉంది ఇలా చేస్తే ఎలా అంటే దానికి నాగవల్లి పార్టీ ఆఫీస్‌కి కాల్ చేసి 10 కోట్లు ఇవ్వమని చెప్తామని అంటుంది. ప్రతిపక్ష పార్టీలో చేరిపోదాం అని చెప్తే మినిస్టర్ భయపడతాడు.
లాయర్ దేవాకి కాల్ చేసి బాలరాజు రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందని అంటాడు. అది వాడి రిలీజ్ డేట్ కాదు చావు డేట్ గుడ్ న్యూస్ చెప్పావని అంటాడు. నాగవల్లితో దేవా విషయం చెప్తే వాడు ఈ జైలు శిక్ష కంటే ఇప్పుడు మనం చంపబోయే నరకం ఇంకా ఎక్కువగా ఉండాలని అనుకుంటారు. కాలేజ్‌లో మహిని తన ఫ్రెండ్ మిగతా ఫ్రెండ్స్‌కి మ్యాడీగా పరిచయం చేస్తాడు. మధుమిత తన ఫ్రెండ్ కాలేజ్లోకి ఎంట్రీ ఇస్తారు. మహిని తన ఫ్రెండ్స్ గిటారు వాయించమని అంటారు. మహి గిటారు వాయిస్తూ నాలోనే పొంగెను నర్మదా అని పాట పాడుతాడు. మధుమిత ఆ పాట విని క్కడ నుంచి వస్తుందా అని వెతుకుతుంది.
మహి పాటకు అందరూ ఫిదా అయిపోతారు. మహి మధుని చూస్తాడు. మధు తన కారు మీద కూరగాయలు పెట్టి అమ్మిన సీన్ గుర్తు చేసుకుంటాడు. తన ఫ్రెండ్స్‌తో ఈ విజిటేబుల్స్ ఇక్కడికి వచ్చిందేంటా అని తన ఫ్రెండ్స్‌తో 10 నిమిషాలు మనం సీనియర్స్ అని అంటుంది. మధు మహిని చూసి ఈ పిల్లిగడ్డం గాడు ఇక్కడేంటి అనుకుంటుంది. తన ఫ్రెండ్ నీకు తెలుసా అని అంటే ఒకసారి చుక్కలు చూపించా అంటుంది. మహిని వెజిటేబుల్స్ అని పిలుస్తాడు. పిల్లిగడ్డం అని మధు పిలుస్తుంది. సీనియర్స్ మీద సెటైర్లా అని సినియర్స్ మీద సెటైర్లు వేసినందుకు మీరు మీ పుస్తకాలను తల మీద పెట్టుకొని క్యాంపస్ మొత్తం తిరగాలని అంటాడు. ఇది టూ మచ్ సీనియర్ అని మధు అంటుంది. దానికి మహి ఆ రోజు నువ్వు నీకు నచ్చినట్లు నన్ను తిప్పావ్ ఈ రోజు ఇది ఈ కాలేజ్‌లో నేను సీనియర్ నేను చెప్పినట్లు నువ్వు చేయాలి అంటాడు.
మధుకి సారీ చెప్పమని అంటాడు. మధు ఎన్ని రౌండ్స్ అయినా తిరుగుతా కానీ సారీ చెప్పను అంటుంది. ఇక పుస్తకాలు తల మీద పెట్టుకొని వెనక్కి నడుస్తుంది. మహి తన ఫ్రెండ్స్ పెద్దగా నువ్వుతూ మధుని వాళ్లని ఆటపట్టిస్తారు. ఇక మధు తల్లి కావేరిని ఆమె మాటను గుర్తు చేసుకొని బాధ పడుతుంది. ఆయన భర్త దగ్గరకు వచ్చి కావేరి మధుని రాజమండ్రి పంపొద్దు అని చెప్పింది కానీ పంపాల్సి వచ్చిందని ఇప్పటి వరకు కంటికి రెప్పలా చూసుకున్నాం ఇప్పుడేమైనా అయితే అని స్వరూపా అంటే దానికి ఆయన భర్త మధు పళ్లెటూరిలో పెరిగినా ప్రపంచం చదివేసింది. తను మొత్తం నెట్టుకొస్తుందని అంటాడు.
లోహిత తన ఫ్రెండ్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి లైబ్రరీకి వెళ్తారు. అక్కడ చందు చిన్నప్పుడు చిన్ని చందుల ఫొటో చూస్తూ ఉంటాడు. లోహిత అన్నయ్య దగ్గరకు వెళ్లి ఇంకా ఆ దరిద్రం వదలవా అంటే దరిద్రం తను కాదు అంత మంచివాళ్లని వదులుకున్న మనదే అంటాడు. ఇక లోహిత వేసిన డ్రస్ గురించి ప్రశ్నిస్తే మనం అన్నాచెల్లెళ్ల అని ఎవరికీ తెలీకూడదు అంటుంది. చందు షాక్ అయిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్ ప్రోమో: విరూపాక్షి గ్యాంగ్ గెలిచిందోచ్.. ఈ సారి తల్లిదండ్రుల చేతుల మీదగా 'రూపాకల్యాణం'





















