Chinni Serial Today August 5th: చిన్ని సీరియల్: కన్న తండ్రి గురించి పెంచిన తండ్రిని నిలదీసిన మధు.. సుబ్బు చెప్పిన సమాధానం ఏంటి?
Chinni Serial Today Episode మధు సుబ్బు, స్వరూపలతో తన తండ్రి బాలరాజు గురించి చెప్పి ఏడ్వడం, ఎలా అయినా అతన్ని పట్టుకుంటానని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode నాగవల్లి మహిని తీసుకెళ్తుంటే బాలరాజు హాస్పిటల్లోకి ఎంట్రీ ఇస్తాడు. ఒకర్ని ఒకరు చూసుకోరు. ఇక మధుకి తల్లి జూస్ తాగిస్తుంది. ఇక సుబ్బు, స్వరూపలు ఏడుస్తూ నీకేమైపోతుందో అని కంగారు పడ్డాం.. నీకు ఏమైనా అయితే కావేరి అమ్మకి ఇచ్చిన మాట ఏమైపోతుందో అని చాలా కంగారు పడ్డామని అంటారు. కావేరి అమ్మకి నువ్వు ప్రాణం అని చిన్నితో అంటారు.
మధు తల్లిదండ్రులతో అమ్మకే కాదు నాన్నకి నేను అంటే ప్రాణం.. ఆ రోజు నేను అమ్మ నాన్నని జైలులో వదిలి వచ్చాం ఆ తర్వాత ఎప్పుడూ చూడలేదు మళ్లీ ఎప్పుడు చూస్తానో అని మధు అనడంతో సుబ్బు, స్వరూప షాక్ అయిపోతారు. మధు ఆయన గురించి ఆలోచించకుండా పడుకోపెట్టేస్తారు. మరోవైపు దేవా జైలుకి వెళ్లింది చిన్నినే అనుకొని చిన్ని కోసం వెతికించే ప్రయత్నం చేస్తాడు. తన రౌడీలను తిడుతుంటాడు. ఇంతలో మహిని తీసుకొని నాగవల్లి ఇంటికి వస్తుంది. దేవా మహి నుదిటి మీద షర్ట్ మీద బ్లడ్ చూసి చాలా కంగారు పడతాడు. ఏమైంది అని అడిగితే తన ఫ్రెండ్‌కి సాయం చేస్తే చిన్న దెబ్బ తగిలిందని షర్ట్ మీద తన బ్లడ్ అని చెప్తాడు. దేవా మహిని హగ్ చేసుకొని లవ్ యూ చెప్తాడు. ఇక మహిని వల్లి పంపేసి చిన్ని గురించి తెలిసిందా అని దేవాని అడుగుతుంది. త్వరలోనే తెలుసుకొని దాన్ని చంపేస్తా అని దేవా అంటాడు.
మధుమితని డాక్టర్ చూసి ఇక ఏం ప్రాబ్లమ్ లేదని చెప్పి మందులు ఇస్తారు. రేపు ఉదయం ఇంటికి తీసుకెళ్లండి అని చెప్తారు. ఇక అదే హాస్పిటల్‌లో బాలరాజుతో డాక్టర్ మీకు బీపీ పెరిగింది అది కంట్రోల్ అయ్యే వరకు హాస్పిటల్లో ఉండాలి మీ వాళ్లకి కబురు చెప్పండి అంటుంది. చెప్పడానికి నాకు ఎవరూ లేరని అంటాడు. ఇక రాహుల్ పద్దూ, చంటిలతో మధుతో రౌడీలు గొడవ పడ్డారని.. మధు ఫోన్ ఇస్తాడు. ఇక నుంచి మధుని జాగ్రత్తగా చూసుకోమని అంటాడు.
మధు సబ్బుతో నాన్న మీకు ఒక మాట అడగొచ్చా అని అంటుంది. అడమని సబ్బు అంటే ఎందుకు నాన్న మీరు నాకు ఆరోజు అబద్ధం చెప్పారు. అదే నాన్న ఆ రోజు జైలుకి వెళ్లి వచ్చానని మా నాన్న అక్కడ లేరని నాకు ఎందుకు అబద్ధం చెప్పారు అని అడుగుతుంది. సుబ్బు, స్వరూప షాక్ అయిపోతారు. అబద్ధం కాదమ్మా నిజంగా మీ నాన్న అక్కడ లేరు అని సుబ్బు అంటే మధు ఏడుస్తూ మా నాన్న అక్కడే ఉన్నారు.. నెల రోజుల క్రితం వరకు అదే జైలులో ఉన్నారు.. నెల రోజుల క్రితమే జైలు నుంచి రిలీజ్ అయ్యారంట.. నాకు మీరంతా అబద్ధం చెప్పి నన్ను మోసం చేశారు.. అని ఏడుస్తుంది.
సుబ్బు మధు చేయి పట్టుకొని నిజమేనమ్మా.. ఆరోజు నేను అబద్ధమే చెప్పానమ్మా.. నేను జైలుకే వెళ్లలేదు.. కావేరమ్మకి ఇచ్చిన మాట కోసం నీకు అబద్ధం చెప్పానమ్మా అంతే కానీ నీకు మీ నాన్నని దూరం చేయాలి అన్న దురుద్దేశంతో అలా చెప్పలేదమ్మా అని ఏడుస్తాడు. చిన్ని కూడా చాలా ఏడుస్తుంది. సుబ్బు క్షమించమని ఏడుస్తాడు. నేను నిన్ను క్షమించడం ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావ్.. మా నాన్న ఎప్పటికీ తప్పు చేయడు.. ఏం చేసినా నా మంచి కోసమే చేస్తాడని నాకు తెలుసు.. కాకపోతే మీరలా చేయడం వల్ల పదేళ్ల పాటు మా నాన్నని నేను పట్టించుకోలేదనే బాధ ఉంది.. పర్లేదు దాని గురించి బాధ పడకండి నెల రోజుల క్రితమే కదా ఈ ఊరిలో ఎక్కడో ఉంటాడు.. కచ్చితంగా నాకు కనపడతాడు.. మీరు ఇక దాని కోసం ఎక్కువ ఆలోచించకండి అని ఏడుస్తుంది.
చందు, పద్దూలు వచ్చి నాన్న కూరగాయల వ్యాపారానికి వెళ్లినప్పుడు యాక్సిడెంట్ అయింది ఇప్పుడు నువ్వు కూరగాయలు అమ్ముతున్నప్పుడే రౌడీలతో గొడవ జరిగింది మనం ఆ కూరగాయలు వ్యాపారం మానేద్దాం అంటుంది. సుబ్బు కూడా మన మీద ఎవరైనా పగ పట్టారా అంటే అలా ఏం లేదు నాన్న అని చిన్ని అంటుంది. ఇప్పుడు మనం మా నాన్న కోసం ఆలోచించాలి నాన్నని అలా అనాథలా వదిలేస్తే ఆయన కూతిరిలా నేను బతికే ఉన్నా చనిపోయినట్లే అని అంటుంది. మరోవైపు మహి చిన్నిని తలచుకొని బాధ పడతాడు. మధుని గుర్తు చేసుకొని మధుకి ఎలా ఉందో ఫోన్ చేసి కనుక్కుందాం అని ఫోన్ చేస్తాడు. పద్దూ మధుకి మ్యాడీ కాల్ చేస్తున్నాడు అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















