Illu Illalu Pillalu Serial Today August 5th: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్: రామరాజు ఇంట్లో దొంగతనానికి వల్లి తండ్రి ప్లాన్! వేదవతి కన్నీటికి కారణమెవరు?
Illu Illalu Pillalu Serial Today Episode August 5th రామరాజు ఇంట్లో శ్రీ వల్లి తండ్రి దొంగతనం చేయాలని నిర్ణయించుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode ధీరజ్ ప్రేమని సైకిల్ మీద పెట్టుకొని తోసుకుంటూ తీసుకెళ్తాడు. సాగర్ చూసి ప్రేమ నిన్ను అల్లాడిస్తుందని అర్థమైపోతుందని అనుకుంటాడు. ఇక సాగర్ నర్మద కోసం వెళ్లి హాయ్ డార్లింగ్ అని నర్మదతో మాట్లాడితే నర్మద పట్టించుకోదు. కోపంగా చూస్తుంటుంది.
నర్మదని సాగర్ పట్టుకొని వెంట పడటం చూసి ఒకామె వచ్చి దగ్గరకు వచ్చి ఏంటమ్మా ఏడిపిస్తున్నాడా అంటే అవును అంటుంది. ఆవిడ సాగర్ కాలర్ పట్టుకొని ఎవడ్రా నువ్వు అమ్మాయి కనిపిస్త ఇంతేనా అంటూ తిడుతూ ఉంటుంది. సాగర్ తను అలాంటి వాడు కాదని నేను ఆమె భర్త అని చెప్తాడు. నర్మదని ఆ పెద్దావిడ అడిగితే నర్మద సైలెంట్‌గా ఉంటుంది. దాంతో సాగర్ నర్మదని భర్త అని చెప్పవే నీకు పట్టుకుంటానే అని బతిమాలుతాడు. సాగర్ని ఆమె నానా మాటలు అంటుంటే నర్మద నవ్వుకుంటుంది. తర్వాత భర్తే అని తలూపుతుంది.
సాగర్ ఆమెతో చిన్న గొడవ అయింది మేం మాట్లాడుకోవడం లేదని అందుకే ఇలా బతిమాలుతున్నాను అని అంటాడు. నోరు జారి మాటలు అనేసి తర్వాత ఇలా కాళ్ల బేరానికి రావడం మీ మగవాళ్లకి వెన్నతో పెట్టిన విద్యనే అని అంటుంది. నర్మద వెళ్లిపోతుంది. ఇంతలో ధీరజ్ వచ్చి పాపం.. నేను అంతా చూశానురా.. అంటే నేను చూశానురా ప్రేమని నిన్ను పట్ట పగలే చుక్కలు కనిపించాయేమో అంటే కాదురా దాని మమ్మీ మూన్ కనిపించింది అని ధీరజ్ అంటాడు. మన ఇద్దరి పరిస్థితి ఒక్కటే అని ఇద్దరూ అనుకుంటారు.
సాగర్ ధీరజ్‌తో నా పని కాస్త పర్లేదురా నీకు మాత్రం ప్రేమ పెన్సిల్ చెక్కినట్లు చెక్కేస్తుంది కదరా అంటే అవును అని ధీరజ్ చెప్పి పెళ్లాన్ని ఢీల్ చేయడం కష్టం అని అనుకుంటారు. ఇక మరోవైపు ఆనంద్ రావు తలుపు తీయడానికి భయపడుతుంది. తలుపు చాటుగా చూస్తుంటే భాగ్యం ఒక్కటిచ్చి ఏంటి అమ్మాయిల్ని చూస్తున్నారా అని ఒక్కటిస్తుంది. నన్ను ఎవరు చూస్తారండీ భార్యగారండీ అని నర్మద, ప్రేమలు ఎక్కడ మనల్ని చూసేస్తారేమో అని భయంతో చస్తున్నా అంటాడు. ఇంతలో డోర్ తీస్తే ఎదురుగా శ్రీవల్లి ఉంటుంది. శ్రీవల్లిని చూసి ఆనంద్రావు చిన్న పిల్లాడిలా ఏడ్చి మన బండారం అంతా బయట పడిపోయిందా మెడ పట్టుకొని గెంటేశారా అని ఏడుస్తాడు.
శ్రీవల్లి కోపంగా ఇంట్లోకి వెళ్లి కుండ పగల గొట్టేసి మీరు ఇచ్చిన దొంగ చెక్ గురించి చెప్తుంది. ఒక వైపు నర్మద మన బండారం బయట పెట్టాలని ప్రయత్నిస్తుంది.. మరోవైపు ఈ పది లక్షల టెన్షన్.. రేపో మాపో నా భర్త ఇక్కడికి వచ్చేస్తాడు.. మన బాగోతం తెలిసిపోతుంది. నా కాపురం కూలిపోతుంది అని ప్రేమ ఏడుస్తుంది. నట్టింట్లో కూర్చొని పది లక్షలు ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్తా లేదంటే మీ ఇద్దరూ నన్ను ఎందులోనే తోసేసి చంపేయండి అని వల్లి అంటుంది. ఏంటో అమ్మడు మన తలరాతలు దరిద్రంగా తగలడ్డాయి. నీకు ఇంటి పెత్తనం బీరువా తాళాలు వచ్చిన తర్వాత కూడా మన బతుకులు ఇలాగే ఉన్నాయని అంటుంది.
ఆనంద్ రావు కూతురి దగ్గర తాళాలు చూసి పది లక్షల ఇంట్లో టెన్షన్ పోవాలంటే రామరాజు ఇంట్లో దొంగతనం చేయడమే మార్గం అంటాడు. వల్లి, భాగ్యం షాక్ అవుతారు. ఇంత కంటే మంచి మార్గం నీ దగ్గర ఉందా అని అడుగుతారు. ఇప్పటికిప్పుడు పది లక్షలు తేవడం మన వల్ల కాని పని.. రేపు ఒక్క రోజే గడువు మనం రేపటిలో పది లక్షలు ఇవ్వకపోతే నీ కాపురం రోడ్డున పడుతుంది. అందుకే నేను దొంగలా మీ ఇంటికి వస్తాను నువ్వు నాకు తాళాలు ఇచ్చేయ్ నేను పది లక్షలు తీసుకుంటా ఇదే అద్భుతమైన ఐడియా ఇంకే మాట్లాడకు అని ఆనంద్ రావు అంటాడు.
వేదవతి మధ్యాహ్నం భోజనం రెడీ చేసి భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రామరాజు రాగానే మీ కోసం ఎదురు చూస్తున్నా.. రండి భోజనం పెడతా అని అంటే రామరాజు వల్లి కోసం చూస్తాడు. వల్లి పని మీద వెళ్లిందని అంటుంది. రామరాజు కూర్చొంటాడు. వేదవతి వడ్డిస్తూ మాట్లాడితే రామరాజు ఉలకడు పలకడు అయినా వేదవతి మాట్లాడుతూనే ఉంటుంది. నర్మద, ప్రేమ అప్పుడే వస్తారు. నేను ఇన్ని మాట్లాడిన మీరు ఒక్క మాట మాట్లాడటం లేదని వేదవతి అంటే మన మధ్య మాట్లాడటానికి ఏం ఉంటాయని రామరాజు అంటాడు. దాంతో వేదవతి ఏడుస్తూ గతంలో ఎలా మాట్లాడేవారు ఇప్పుడు మాటలు కరువైపోయావా అని అంటుంది. మనుషులు మారిపోతే మాటలు కరువైపోతాయని అంటాడు.
వేదవతి చాలా ఏడుస్తుంది. ఏంటో మాటలు కరువైపోయావంట అని ఏడుస్తుంది. నర్మద, ప్రేమ చూసి అత్తయ్య చాలా బాధ పడుతుంది మనసుకి చాలా కష్టంగా దీనంతటికి మనమే కారణం అని అనుకుంటారు. ఇద్దరి మనస్పర్థలు మనమే దూరం చేయాలి.. వల్లికి పెత్తనం ఇవ్వడం కూడా అత్తయ్య గారికి దూరం చేయాలి.. అత్తకి మళ్లీ పెత్తనం దొరకాలి అన్నా వల్లీ బండారం బయట పెట్టాలి అనుకుంటారు. అత్తయ్య మనతో మాట్లాడుతుంది కాబట్టి వల్లి కుటుంబం బండారం బయట పెట్టడానికి మనకి ఏదో ఒక దారి దొరుకుతుంది అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















