Chinni Serial Today April 8th: చిన్ని సీరియల్: నాగవల్లిని దొంగని చేసిన ఉష.. చెల్లికి చీర గిఫ్ట్ ఇచ్చిన సత్యంబాబు!
Chinni Today Episode చిన్నిని దొంగని చేయాలని నాగవల్లి చైన్ బ్యాగ్‌లో వేసేయడం ఉష వల్లి ప్లాన్ తిప్పి కొట్టి వల్లినే దొంగని చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode సత్యం బాబు చెల్లి కోసం చీర సెలక్ట్ చేస్తాడు. టీచరమ్మ ఈ చీర మీ కోసమే తీసుకోండి అంటాడు. మీరు నాకు చీర తీసుకోవడం ఎందుకు అంటుంది. దానికి చిన్ని చెల్లి కాని చెల్లి మా అందరి కోసం బట్టలు తీసుకుంటే మామయ్య మీ కోసం తీసుకోకూడదా అని అంటుంది. దాంతో కావేరి చీర తీసుకుంటుంది. దాంతో పాటు కుంకుమ భరిణి కూడా వస్తుంది. దాన్ని సారెలా సత్యంబాబు చెల్లికి ఇస్తాడు. కావేరి ఎమోషనల్ అయి తీసుకుంటుంది. దూరం నుంచి నాగవల్లి అది చూస్తుంది.
చిన్ని బ్యాగ్‌లో చైన్ వేసేసిన వల్లి..
తన ఫ్రెండ్‌తో నేను ఇప్పుడు ఆ చిన్నీకి ఆ టీచర్‌కి ఎలా స్ట్రోక్ ఇస్తానో చూడు అని నగల షాప్‌లోని ఒక చైన్ కొట్టేసి బయల్దేరుతుంది. చీరలు చూస్తున్నట్లు వెళ్లి చిన్ని పట్టుకున్న హ్యాండ్ బ్యాగ్‌లో ఆ చైన్ వేసేస్తుంది. మరోవైపు బాలరాజు చిన్నికీ గోల్డ్ చైన్ ఇద్దామని ఎదురు చూస్తుంటాడు. చిన్నికి ఇవ్వాలి అనుకున్నప్పుడు వెనకాలే సత్యంబాబు వాళ్లు ఉండటంతో రాజు ఆగిపోతాడు. దాంతో రాజు వాళ్లు దాక్కుంటారు. సత్యంబాబు, ఉష వాళ్లు బిల్లింగ్‌కి వస్తారు.
చిన్ని మీద నింద.. బ్యాగ్ చెకింగ్..
ఉష వాళ్లు బిల్ కడుతుంటారు. ఇక నాగవల్లి కౌంటర్ దగ్గర అబ్బాయితో చిన్ని చైన్ తీసుకెళ్లిందని అంటాడు. దాంతో అతను వచ్చి చిన్ని బ్యాగ్ చెక్ చేస్తానని అంటాడు. ఎందుకు అని ఉష అడిగితే చిన్ని దొంగతనం చేసిందని చూసిన వాళ్లు చెప్పారని అంటాడు. సత్యంబాబు, ఉష అతనితో గొడవ పడతారు. హ్యాండ్ బ్యాగ్ వెతుకుతామని మేనేజర్ అంటాడు. బలవంతంగా చిన్ని బ్యాగ్ తీసుకొని చెక్ చేస్తారు. రాజు చాలా టెన్షన్ పడతాడు. చిన్ని బ్యాగ్‌లో ఏం దొరకదు. దాంతో గోల్డ్ చైన్ ఏది అని వాళ్లని పిలవమని ఉష గొడవ చేస్తుంది. నాగవల్లిని చూసి అందరూ షాక్ అవుతారు.
నాగవల్లి బ్యాగ్‌లో చైన్..
నాగవల్లి వెళ్లిపోతుంటే దొంగలా పారిపోతున్నావ్ ఏంటి అని ఉష అడుగుతుంది. చిన్ని మీద నింద వేసి నువ్వే వెళ్లిపోతున్నావ్ అంటే నువ్వే దొంగ అని ఉష అంటుంది. ఆవిడ బ్యాగ్ కూడా చెక్ చేయమని అంటుంది. నాగవల్లి చెక్ చేసుకోమని ధైర్యంగా ఇచ్చేస్తుంది. నాగవల్లి బ్యాగ్ చెక్ చేస్తుంటే అందులో గోల్డ్ చైన్ కనిపిస్తుంది. నాగవల్లితో పాటు అందరూ షాక్ అయిపోతారు. ఫ్లాష్ బ్యాక్‌లో ఉష నాగవల్లి చైన్ వేయడం చూసి మళ్లీ తాను తీసుకెళ్లి నాగవల్లి బ్యాగ్‌లో ఆ చైన్ వేసేస్తుంది. ఎదుటి వాళ్లని దొంగని చేయాలి అనుకుంటే ఆ దొంగతనం తిరిగి తిరిగి మీ దగ్గరకే వస్తుంది అని స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. ఇలాంటి వాళ్లతో మనకేంటి ఛీ ఛీ అని సత్యంబాబు అసహ్యించుకొని వెళ్లిపోతాడు. అందరూ నాగవల్లిని తడతారు. దొంగ అని అవమానిస్తారు. పోలీసుల్ని పట్టించాలని ప్రయత్నిస్తారు. దాంతో నాగవల్లి ఫ్రెండ్ దేవాకి కాల్ చేసి విషయం చెప్తుంది. దేవా వచ్చేలోపు వల్లి పందెం కోడి సినిమాలో రౌడీ చెల్లిలా నేల మీద కూర్చొంటుంది.
వల్లి కాలు పట్టుకున్న మ్యానేజర్..
దేవా వచ్చి మ్యానేజర్‌ని లాగిపెట్టి కొడతాడు. ఈ దేవేంద్ర మరదల్నే దొంగని చేస్తావా అని కొడతాడు. మ్యానేజర్ నాగవల్లి కాళ్ల మీద పడి క్షమాపణ అడుగుతాడు. వల్లి వదిలేస్తుంది. కోపంతో రగిలిపోతుంది. నీ బాధ తగ్గాలి అంటే ఏం చేయాలి నాగవల్లి నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మ్యానేజర్‌ని చంపేయాలా.. షాప్ కూలగొట్టేయాలా అని అడుగుతాడు. దాంతో వల్లి నన్ను అవమానించిన వాళ్లని చంపేయాలి అంటుంది. కావేరి నేను చంపేశాను ఉషని నువ్వు చంపాలి నీ మంచితనం పక్కన పెట్టి దాన్ని లేపేయ్ అంటుంది. సరే అని దేవా నాగవల్లిని తీసుకెళ్తాడు.
చెల్లికి ఐస్‌క్రీమ్ గిఫ్ట్..
ఉష వాళ్లు షాపింగ్ తర్వాత డిన్నర్ చేసి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే పిల్లలు ఐస్‌క్రీమ్ అడుగుతారు. చిన్ని కొనిపిస్తుంది. చందు, లోహిత ఒకరి ఐస్‌క్రీమ్ ఒకరు షేర్ చేసుకుంటారు. అందరూ మురిసిపోతారు. సరళ భర్తతో ఇంటి దగ్గర ఎప్పుడూ కొట్టుకుంటూ ఇక్కడ ఎంత చక్కగా తినిపించుకుంటున్నారో చూడు అని అంటుంది. అన్నాచెల్లెలి ప్రేమ అలాగే ఉంటుందని అంటాడు. ఉషని చూస్తాడు. నేను చిన్నప్పుడు అలాగే తినిపించుకునే వాళ్లు అంటాడు. ఇక తాము కూడా ఐస్‌క్రీమ్ తీసుకుందాం అని అంటాడు. కావేరికి కూడా ఐస్‌క్రీమ్ ఇస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: నువ్వు ఎవర్నినైనా ఉద్దరించుకో ఉద్యమాలు చేసుకో నా జోలికి రాకు.. దీపకు గౌతమ్ వార్నింగ్!





















