Chinni Serial Today April 23rd: చిన్ని సీరియల్: తల్లిదండ్రుల్ని ఒకటి చేయాలన్న చిన్ని సంకల్పం నెరవేరుతుందా.. సత్యం దేవా అడ్రస్ కనిపెడతాడా!
Chinni Today Episode రాజు, కావేరిలను మాట్లాడుకోవడానికి చిన్ని గుడికి తీసుకురావడం సత్యం దేవా అడ్రస్ కోసం వెతకడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode సత్యంబాబు దగ్గరకు లాయర్ హరి కంగారుగా సైకిల్ మీద వస్తుంటాడు. సత్యంబాబు కంగారు పడుతూ హరికి కాల్ చేస్తే కాల్ కలవదు. ఇంతలో దేవా సత్యంబాబు దగ్గరకు వస్తాడు. తన కొడుకు మహి భర్త్‌డే పార్టీకి రమ్మని పిలుస్తాడు. దేవా వెళ్లగానే హరి సత్యం దగ్గరకు వస్తాడు. ఇద్దరూ కలిసి దేవా అడ్రస్ కోసం క్లర్స్ ఇచ్చిన పేపర్లలో వెతుకుతారు.
దేవేంద్ర వర్మ అడ్రస్ దొరికితే నా చెల్లి కష్టాలు తొలగిపోయినట్లే అని సత్యంబాబు అంటాడు. ఇక చిన్ని తల్లికి గుడికి వెళ్లడం కోసం చీర సెలక్ట్ చేసి కట్టుకోమని చెప్తుంది. ఆ చీర రంగు నాన్నకి కూడా ఇష్టం అని చెప్తుంది. కావేరి కోపంగా చూడటంతో అది నాకు ఇష్టం అమ్మ కట్టుకో అని అంటుంది. సరే అని కావేరి చీర కట్టుకుంటుంది. ఇక చిన్ని కావేరి ఫోన్ నుంచి రాజుకి కాల్ చేస్తుంది. కావేరి గారు చెప్పండి అని రాజు అంటే చిన్ని తండ్రితో నేను కావేరి గారి కూతురు గారు చిన్ని గారు అని అంటుంది. మేం గుడికి వస్తున్నాం నువ్వు వస్తున్నావా నాన్న అని అడుగుతుంది. ఇక కావేరి వచ్చి చిన్ని వెనకాలే నిల్చొంటుంది. తల్లిని చీరలో చూసిన చిన్నీ అమ్మ చాలా బాగుంది అని అంటుంది.
తల్లీకూతుళ్లు గుడికి వెళ్లడానికి కిందకి వస్తారు. సరళ చూసి తోడు దొంగలు ఇద్దరూ ఎక్కడికీ వెళ్తున్నారు అంటే స్పోర్ట్స్ ఐటెమ్స్ కొనడానికి వెళ్తున్నా అని ఉష అంటే మహి కోసం కూడా గిఫ్ట్ కొనమని అంటుంది. ఉష సరే అంటుంది. చిన్న స్కూటీ ఎక్కి తల్లిని గట్టిగా హగ్ చేసుకుంటుంది. సత్యంబాబు దేవేంద్ర వర్మ పేరుతో ఉన్న అడ్రస్‌లు అన్నీ వెతకడానికి ఫిక్స్ అవుతారు. వాడిని పట్టుకొని నిజం కక్కిస్తే బాలరాజుకి కూడా శిక్ష పడుతుందని అనుకుంటారు. రాజు గుడికి వచ్చేస్తాడు. చిన్ని, కావేరిలు కూడా గుడికి వస్తారు. రాజు దేవుడిని దండం పెట్టుకొని ఈ రోజు జీవితంలో మర్చిపోలేని రోజు అని కూతురే క్షమించదు అంటే భార్యతో కూడా మాట్లాడే అవకాశం వచ్చిందని అనుకుంటాడు.
చిన్ని నాన్నని చూసి ఎగ్జైట్ అవుతుంది. కావేరి చిన్నీతో ముందు దర్శనం చేసుకుందామని తీసుకెళ్తుంది. బయట వెయిట్ చేస్తున్న రాజు కావేరి తనతో ఏం మాట్లాడుతుందో అని కంగారు పడతాడు. దర్శనం తర్వాత కావేరిని తీసుకొని చిన్ని రాజు దగ్గరకు వెళ్తుంది. చిన్ని ఇద్దరి చేతులు పట్టుకొని ఎవరూ లేని చోటుకి వెళ్తుంది. శ్రీరామనవమి రోజు మీ పేర్లు రాసింది నేనే అని చెప్తుంది. మీ ఇద్దరిని కలపాలి అని నాతో పాటు దేవుడు కూడా అనుకున్నాడు కాబట్టి ఆ రోజు మీ పేర్లు వచ్చాయి ఈ రోజు మీరు గుడికి వచ్చారు. ఏంటి అలా ఒకర్ని ఒకరు చూసుకుంటారు మాట్లాడుకోండి అంటుంది. ఇక తాను వెళ్లిపోతాను అని చెప్పి గొడవ పడొద్దని ఇద్దరికీ చెప్పి చిన్ని పక్కకు వెళ్లిపోతుంది. మరోవైపు దేవా ప్రమీలతో మహిని తీసుకొని షాపింగ్‌కి వెళ్లమని చెప్తాడు. ప్రమీలకు కార్డు ఇచ్చి మహికి ఏం కావాలి అంటే అది కొనండి అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ఇక నుంచి నువ్వు దేవా భార్యవి.. ఈ ఇంటి చిన్న కోడలివి.. ఓర్నీ ఇదంతా కలా!





















