Chinni Serial Today April 15th: చిన్ని సీరియల్: ఆ నీచుడే ఇదంతా చేసుకుంటాడు.. భర్తని దారుణంగా తిట్టిన కావేరి!
Chinni Today Episode ఉష కోనేటిలో పడి చనిపోలేదని రాజు కాపాడాడని వల్లి, దేవాలకు తెలీయడం ఉష కావేరినే అని వాళ్లు ఫిక్స్ అయి ఈ సారి కచ్చితంగా చంపేస్తాం అని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode కోనేటిలో పడిపోయిన ఉషని రాజు కాపాడాడని అక్కడున్న ఆడవాళ్లు చెప్తారు. దాంతో చిన్ని రాజుని హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్తుంది. సత్యంబాబు ఉషని తీసుకెళ్లిపోతారు. రాజు రాములవారి దగ్గరకు వెళ్లి చిన్నికి ఇస్తాను అనుకున్న చైన్ పట్టుకొని ఏడు కన్నీరుపెట్టుకుంటాడు. స్వామి వారికి దండం పెట్టి దాన్ని హుండీలో వేయబోతే ఆఫ్ టికెట్ వచ్చి ఆపుతాడు.
బంగారు గొలుసు హుండీలో వేసేసిన రాజు..
ఇది చిన్నీకి ఇచ్చే అదృష్టం నాకు లేదురా. చిన్నికి ఇలా ఏదో ఒకటి ఇవ్వాలి అనుకున్న ప్రతీ సారి ఏదో ఒకటి జరుగుతుంది. దీపావళి రోజు ఏం జరిగిందో చూశావ్ కదా. మొన్న షాపింగ్ మాల్‌లో ఇవ్వాలి అనుకుంటే ఆ నాగవల్లి చిన్ని మీద దొంగతనం మోపిందిరా. ఇవాళ గుడిలో ఇద్దాం అనుకుంటే అనుకోకుండా కావేరికి అలా జరిగింది. అందుకేరా ఈ చైన్‌ని హుండీలోనే వేయడం కరెక్ట్ అనిపిస్తుంది. అని చిన్ని కోసం కొన్న చైన్ రాజు హుండీలో వేసేస్తాడు.
దేవా, వల్లిలకు పెద్ద షాక్..
నాగవల్లి కావేరి చనిపోయిందని అనుకొని సంతోషంతో కిచెన్‌లో వెళ్లి పాయసం చేస్తుంది. దేవా దగ్గరకు తీసుకెళ్లి దేవాకి తినిపిస్తుంది. దేవా కూడా నాగవల్లికి తినిపిస్తాడు. ఇప్పుడు నాకు తృప్తిగా ఉందని అంటుంది. దేవా మనసులో భార్య ఫొటో చూస్తూ నీ ఫ్రెండ్ కావేరిని నీ దగ్గరకే పంపించేశాను ఇద్దరూ ముచ్చట్లు పెట్టుకున్నారా అనుకుంటాడు. ఇంతలో నాగవల్లికి గుడిలో తాను ఏర్పాటు చేసిన మనిషి నుంచి ఫోన్ వస్తుంది. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతుంది. మీరు అనుకున్న అమ్మాయి చనిపోలేదని రాజు కాపాడాడని చెప్తుంది. దాంతో దేవా ఆ బాలరాజు కాపాడాడు అంటే అది కచ్చితంగా కావేరినే అని అంటాడు. నాగవల్లి దేవాతో అది ఎవరైనా సరే కచ్చితంగా చంపేయాలి అంటుంది. దాన్ని ఎలా చంపాలో నేను ప్లాన్ చేస్తా నువ్వు కూల్‌గా ఉండు అని దేవా మరదలితో చెప్తాడు.
ఎవరైనా తోసేసుంటారా..
కావేరికి ఇలా జరిగింది ఏంటి అని అందరూ కావేరి దగ్గరకు వచ్చి మాట్లాడుతారు. సత్యంబాబు హోళీ రోజు జరిగిన దాడి గుర్తు చేసుకొని ఇది ప్రమాదమా లేక ఎవరైనా తనని కోనేటిలోకి తోసేసుంటారా అని అంటాడు. గుడిలో ఎవరి మీద అనుమానం ఉందా అని సత్యంబాబు అడుగుతాడు. దానికి ఉష మనసులో నాకు ఏమైనా అవుతుందేమోఅని అన్నయ్య కంగారు పడుతున్నాడని అనుకుంటుంది. తానే కోనేటిలో పడిపోయాను అంటుంది. సరళ ఉషతో నిన్ను ఎవరైనా చంపాలి అనుకుంటే వాళ్లు నీతో పాటు మమల్ని చంపాలి అనుకుంటే కష్టం కదా అంటుంది.
చిన్ని ఎమోషనల్..
అందరూ వెళ్లిపోయిన తర్వాత చిన్ని కావేరిని హగ్ చేసుకొని అమ్మ నీకు ఏమైనా అవుతుందని కంగారు పడ్డాను అంటుంది. దానికి కావేరి నేను కూడా నిన్ను మళ్లీ చూస్తాను అనుకోలేదు అమ్మ ఆ సీతారాములే నన్ను బతికించారని అంటుంది. ఇక చిన్నమ్మ కావేరి దగ్గరకు వచ్చినప్పటికి కావేరి, చిన్ని హగ్ చేసుకోవడం భారతి చూడటంతో నన్ను అలా చూసి భయపడింది అని కావేరి చెప్తుంది. కావేరి చిన్నిని పంపిన ఆలోచనలో పడిపోతుంది.
ఆ రాక్షసుడు మారడు..
భారతి ఉషతో ఆ బాలరాజు గురించి ఆలోచిస్తున్నావ్ కదా వాడే నిన్ను అంత ప్రమాదం నుంచి కాపాడాడు అని అంటుంది. ఆ రాక్షసుడు మారాడు అంటే నమ్మను ఆంటీ నన్ను కాపాడినట్లు నా కూతురి దగ్గర మార్కులు కొట్టేయాలి అనుకుంటున్నాడని అంటుంది. తనకు ఆ ప్రమాదం జరగడానికి వాడే కారణం అయింటాడని అంటుంది. వాడు ఎంత నీచానికి అయినా దిగజారగలడు అని ఉష అంటుంది. కావేరి బాలరాజు గురించి చాలా తప్పుగా అనుకుంటుంది. తనని ఎప్పటికి అర్థం చేసుకుంటుందో అని భారతి అనుకుంటుంది.
నువ్వు మాతో ఉంటేనే అసలైన సంతోషం నాన్న..
రాజు చిన్నిని కలవడానికి రాత్రి వస్తాడు. ఆటో హారన్ కొట్టి చిన్నికి సిగ్నల్ ఇస్తాడు. నాన్న వచ్చాడని చిన్ని పరుగున వస్తుంది. ఏంటి నాన్న ఈ టైంలో వచ్చావ్ అని అడుగుతుంది. మీ అమ్మకి ఎలా ఉంది అని అడుగుతాడు. ఆ దేవుడి దయ వల్ల తనకు ఏం కాలేదు అని రాజు అంటే దానికి చిన్ని ఆ దేవుడి దయ వల్ల కాదు ఈ దేవుడి దయ వల్ల అని తండ్రితో అంటుంది. సమయానికి నువ్వు అక్కడ లేకపోయి ఉంటే అమ్మ బతికేదు కాదు నాన్న అని ఏడుస్తుంది. రాజు చిన్నిని ఊరుకోపెడతాడు. నీకు మీ అమ్మకి ఎలాంటి ప్రమాదం వచ్చినా నా ప్రాణాలు అడ్డేసి కాపాడుకుంటాను అని అంటాడు. నువ్వు మాతో కలిసి ఉంటేనే అసలైన సంతోషం అని చిన్ని ఏడుస్తుంది. రాజు చిన్నిని హగ్ చేసుకుంటాడు. ఇక చిన్నిని రాజు వెళ్లి పడుకోమని చెప్తాడు. చిన్ని వెళ్లిపోతుంది.
ఆ దేవా మీద అనుమానంగా ఉందిరా..
తన భార్య కోనేటిలో పడిపోవడం రాజు గుర్తు చేసుకొని కావేరి మీద గుడిలో హోళీ రోజు అటాక్ చేసింది ఎవరో తెలుసుకోవాలి అంటాడు. దానికి హాఫ్ టికెట్ ఆ దేవా అయింటాడు అని అంటాడు. నాకు ఆ అనుమానం ఉంది కానీ కచ్చితంగా తెలిస్తేనే ఏమైనా చేయొచ్చు అంటాడు. ఇక కల్యాణం వీడియో తీసిన వ్యక్తి నుంచి ఆ ఫుటేజ్ తీసుకోవాలి అనుకుంటాడు. ఇక ఉదయం పిల్లలు స్కూల్‌కి రెడీ అయి రాజు కోసం ఎదురు చూస్తారు. ఇంతలో రాజు వస్తాడు. చిన్న రాజుతో తనకు అవార్డు ఇస్తారని చెప్పాలని అనుకుంటుంది. ఉష రావడంతో ఆగిపోతుంది. చిన్నిని ఉష తనతో రమ్మని అంటుంది. కారణం చెప్పి తీసుకెళ్లు లేదు అంటే చిన్నిని తీసుకెళ్లనివ్వను అంటాడు. దాంతో ఉష, రాజు గొడవ పడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















