Chinni Serial Today April 14th: చిన్ని సీరియల్: కోనేటిలో పడిపోయిన ఉష.. చూపుల్లోనే అదిరిపోయే ఎమోషన్స్..!!
Chinni Today Episode నాగవల్లి మనుషుల్ని పెట్టి ఉషని కోనేటిలో తోసేయడం రాజు ఉషని కాపాడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode బాలరాజు, ఉషల చేతులు మీద కల్యాణం జరుగుతుంది. తర్వాత పంతులు రాజు, ఉషలకు స్వామి వారి శేష వస్త్రాలు ఇస్తారు. మీ ఇద్దరికి స్వామి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. అందుకే మీ ఇద్దరి చేతులు మీదగా స్వామి వారు కల్యాణం చేయించుకున్నారు అని చెప్పి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోమని పంతులు చెప్తారు. దానికి రాజు తల్లిదండ్రులు లేరు అని చెప్తాడు.
పంతులు: తల్లిదండ్రుల సమానులైన అన్నావదినల ఆశీర్వాదం తీసుకోండి.
రాజు: నాకు ఎవరూ లేరు పంతులుగారు. ఒక విధంగా నేను అనాథని
పంతులు: అంటే ఈ అమ్మాయి లా మీకు వివాహం కాలేదా బాబు.
రాజు: అయింది పంతులు గారు కానీ ఆ దేవుడు నా భార్యని నాకు దూరం చేశాడు. భౌతికంగా తను నాకు దూరమైన మానసికంగా తనెప్పుడూ నా పక్కనే ఉంటుంది.
ఉషని కూడా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోమంటే తన తల్లిదండ్రులు డెహ్రాడూన్‌లో ఉన్నారని ఇక్కడ అద్దెకు ఉన్న సత్యంబాబు, సరళల ఆశీర్వాదం తీసుకుంటే తల్లిదండ్రుల ఆశీర్వాద తీసుకున్నట్లు ఉంటుందని అంటుంది. దాంతో సత్యంబాబు, సరళలు ఉషని ఆశీర్వదిస్తారు. పూజ తర్వాత సత్యంబాబు ప్రసాదం ఇస్తారు. తర్వాత ఉషని పంతులు పిలుస్తారు. చిన్ని, ఉష పంతులు దగ్గరకు వెళ్తారు. పంతులు రాజు, ఉషలను ఆశీర్వదిస్తారు. తర్వాత పెద్ద గాలి వచ్చి ఉష, రాజు, చిన్నిల మెడలో పూల దండ పడుతుంది. చిన్ని చాలా సంతోష పడుతుంది. దేవుడికి దండం పెట్టుకుంటుంది. బాలరాజు ఉషలు ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఉష దండ తీసేస్తుంది. చిరాకుగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. చిన్ని నాన్నతో బాధపడొద్దని నీతో మాట్లాడటం కూడా ఇష్టం లేని అమ్మ నీతో ఇంత సేపు దేవుడికి సేవ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్తుంది.
చిన్నికి చైన్ ఇవ్వడం కుదరలేదని రాజు ఫీలవుతాడు. ఇక ఉష చిన్ని కోసం వెళ్తుంది. ఇంతలో చిన్ని సత్యంబాబు వాళ్ల దగ్గరకు వెళ్లి ఉష గురించి అడుగుతుంది. నీ కోసమే వెళ్లారని చెప్పడంతో చిన్ని వెళ్తుంది. రాజు చైన్ పట్టుకొని తిరుగుతుంటే దేవా ఎదురెళ్లి కావేరి కోసం వెతుకుతున్నావా అని అడుగుతాడు. తను కావేరి కాదని నీకు ఎన్ని సార్లు చెప్పాలి అన రాజు అంటాడు. నా జోలికి వస్తే బాగోదు అని దేవాకి వార్నింగ్ ఇస్తాడు. నాగవల్లి మనిషి ఓ బామ్మని కలిసి చెప్పింది చేయమని డబ్బులు, బిందె బామ్మకి ఇస్తుంది. ఉష చిన్ని కోసం వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతూ కోనేటికి వెళ్తుంది. దాంతో నాగవల్లి మనిషి పురమాయించిన బామ్మ కావేరిని అడ్డుకొని ఒక బిందెడు నీరు తీసుకురమ్మని చెప్తుంది. దాంతో కావేరి వెళ్తుంది. బామ్మ నాగవల్లికి సైగ చేస్తుంది. నాగ వల్లి మనిషి ఎవరూ చూడకుండా ఉష వెనకాలే వెళ్లి ఉషని నీటితో తోసేస్తుంది. ఉష నీటిలో పడి కొట్టుకుంటుంది.
రాజు దగ్గరకు ఒకామె పరుగున వచ్చి మీతో కల్యాణం చేసిన అమ్మాయి కోనేటిలో పడిపోయిందని చెప్తుంది. దాంతో రాజు కావేరి దగ్గరకు పరుగులు తీస్తాడు. కోనేటిలో దూకి ఉషని బయటకు తీసుకొని వస్తాడు. సత్యంబాబు వాళ్లకి విషయం చెప్పడంతో సత్యం, సరళ పరుగున వస్తారు. వాళ్లని చూసి రాజు పక్కకి తప్పుకుంటాడు. సరళ ఉష కడుపు మీద అణచి నీరు కక్కేలా చేస్తుంది.ఉష లేచి కూర్చొంటుంది. సత్యంబాబు చాలా కంగారు పడతాడు. చిన్ని స్వామి వారి శేష వస్త్రం ఇవ్వడంతో సరళ చిన్నికి కప్పుతుంది. సమయానికి రాజునే కాపాడాడని అందరూ వాళ్లకి రాజుని చూపిస్తారు. రాజు కన్నీరు పెట్టుకుంటుంటాడు. చిన్ని రాజుని హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్తుంది. సత్యంబాబు చిన్నిని పిలిచేస్తాడు. ఉషని తీసుకొని ఇంటికి వెళ్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: "అత్యాచారయత్నం కేసులో సీఎం అరెస్ట్.. పదవికి రాజీనామా"!





















