Chinni Serial Today April 11th: చిన్ని సీరియల్: కల్యాణంలో రాజు, ఉషలు.. భార్యతో స్నేహం చేయాలన్నా రాజు ఆశ నెరవేరుతుందా!
Chinni Today Episode చిన్ని తల్లీదండ్రుల్ని కలపాలి అని కల్యాణంలో పాల్గొనే వాళ్ల పేర్లతో తల్లిదండ్రుల పేర్లు రాయడం లాటరీలో రాజు, ఉషల పేర్లు రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్ని ఆంజనేయ స్వామి దగ్గరకు వెళ్లి తల్లిదండ్రులు కలుసుకోవాలని కోరుకుంటుంది. ఇంతలో ఒక స్వామీజీ వచ్చి ముందు మానవ సంకల్పం దృఢంగా ఉండాలి తర్వాత దేవుడు సాయం చేస్తాడని అంటారు. నీ సంకల్పం దేవుడి అనుగ్రహంతో తప్పకుండా నువ్వు అనుకున్నది జరుగుతుందని చెప్తారు.
పంతులు అందరితో సీతారాముల సేవ చేయడానికి ఇద్దరు భక్తులను ఎన్నుకుంటాం వాళ్లని లాటరీలో ఎన్నుకుంటాం. మీకు ఇష్టమైన వాళ్లు మీ పేర్లను ఇవ్వమని చెప్తారు. చిన్ని అమ్మానాన్నల పేర్లు ఇవ్వాలని అనుకుంటుంది. సరళ తమ పేర్లు ఇస్తామని అంటుంది. చిన్ని వెళ్లి పంతులుని అడిగితే ఎవరు పేరు వస్తే వాళ్లే చేస్తారు అని ఇద్దరు దంపతులు అవసరం లేదని ఒకరు అమ్మవారి తరఫున మరొకరు స్వామి వారి తరఫున సేవ చేస్తారని చెప్తారు. అందరూ తమ తమ పేర్లు లాటరీ బాక్స్‌లో వేస్తారు. ఇక చిన్ని వెళ్లి బాలరాజు, ఉషల పేర్లు రాస్తుంది. లాటరీలో వాళ్లు పేర్లు వచ్చేలా ఆశీర్వదించమని కోరుకుంటుంది.
సరళ వెళ్లి అందరి పేర్లు రాశానని చెప్తుంది. చిన్ని, ఉషల పేర్లు రాశావా అని సత్యం అడిగితే మర్చిపోయాను అంటుంది. ఇక ఉష వాళ్ల దగ్గరకు చందు ఫ్రెండ్ మహి దేవా వాళ్లు వస్తారు. అందరూ ఒకర్ని ఒకరు చూసుకొని షాక్ అయిపోతారు. సత్యంబాబుకి దేవా తనని తాను పరిచయం చేసుకుంటాడు. నాగవల్లి ఫ్రెండ్‌కి చిన్నికి గొడవ ఉంది అందుకే నాగవల్లి అలా చేసింది చిన్నిని బాధ పెట్టినందుకు వల్లి చాలా బాధ పడింది అని దేవా చెప్తాడు. జరిగింది మర్చిపోయి మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోదాం అని చేయి ఇస్తాడు. సత్యంబాబు సరే అని చేయి అందిస్తాడు. ఉషని చూసి మీరేంటి ఇలా వీళ్లతో వచ్చారు మీరు ఫ్యామిలీనా అంటే కాదు అద్దెకు ఉంటున్నామని అంటుంది.
దేవా వాళ్లు వెళ్లిపోయిన తర్వాత చిన్ని వస్తుంది. లోహిత చిన్నీతో ఇంకాసేపు మాట్లాడుకొని రావాల్సింది అంటుంది. ఇక కల్యాణం ప్రారంభానికి లాటరీ తీస్తున్నామని అందరూ రావాలని పంతులు పిలుస్తారు. సత్యంబాబు వాళ్లు కంగారుగా వెళ్తారు. ఇక రాజు దేవా వాళ్లని చూసి తన ఆఫ్ టికెట్‌తో వాడు వచ్చాడంటే ఏదో ప్లాన్ చేసుంటాడు కాబట్టి వాళ్లని గమనిస్తూ ఉండు అంటాడు. ఇక దేవా స్వామి వారి సేవ చేయాలని మా ఫ్యామిలీ కోరుతుంది అంటే లాటరీలో వచ్చిన వాళ్లే కల్యాణం చేస్తారని అంటారు. దాంతో దేవా మనం కూడా పేర్లు రాద్దమని అంటాడు.
పంతులు లాటరీ తీస్తారు. చివరిలో మనమే పేర్లు రాశాం కదా మనవే వస్తాయని నాగవల్లి అంటుంది. ఇంతలో పంతులు లాటరీ బాక్స్ నుంచి రెండు పేర్లు తీసి స్వామి వారి కల్యాణంలో పాల్గొనేది ఉష, బాలరాజు అని చెప్తారు. అందరూ క్లాప్స్ కొడతారు. ఉష, బాలరాజుని పంతులు పిలుస్తారు. ఇద్దరిని పక్క పక్కన చూసి సత్యం, ఉష చిరాకు పడతారు. బాలరాజు దాని పక్కన తిరుగుతున్నాడు అంటే అది కావేరి అయింటుందా అని దేవా అనుకుంటాడు. పంతులు ఇద్దరినీ కాళ్లు చేతులు కడుక్కొని రమ్మని చెప్తారు. ఉష చిరాకుగా ఫేస్ పెడుతుంది. ఇద్దరూ కోనేటి దగ్గరకు వెళ్తారు. ఇక చిన్ని తండ్రికి సైగ చేయడంతో రాజు ఉషతో నీతో ఫ్రెండ్ షిప్ ఎలా చేయాలి అని అనుకుంటున్నా మేడం అని అడుగుతాడు. ఉష కోపంగా చూస్తుంది. నా ఆశ చూసి దేవుడు మన ఫ్రెండ్‌షిప్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అందుకే లాటరీలో మన పేర్లు వచ్చాయని రాజు చెప్పి ఫ్రెండ్స్ అంటూ చేయిస్తాడు. ఉష చేయి తోసేసి వెళ్లబోతూ జారిపోతుంది. దాంతో రాజు పట్టుకుంటాడు. ఇద్దరి మీద పూల వాన పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రాధికని కాపాడి జీవన్‌ని బెదిరించిన తల్లీకొడుకులు.. ఆస్తి రాసిచ్చేసిన రూప!





















