అన్వేషించండి

Bramhamudi October 28th: కావ్యపై నిందారోపణలు వేసి కొత్త డ్రామాకి తెర తీసిన రుద్రాణి

బ్రహ్మముడి సీరియల్‌ లో సరికొత్త మలుపులు జరుగుతున్నాయి. రుద్రాణి కొత్త నాటకానికి శ్రీకారం చుట్టింది. కావ్యపై నిందారోపణలు వేసి అపర్ణకు కోపం వచ్చేలా చేసింది.

స్వప్నకు టాబ్లెట్‌ ఇచ్చినా ఇంకా ఏం జరగడంలేదని రాహుల్‌ ఆలోచిస్తూ.. నిద్రపోతున్న స్వప్నను బలవంతంగా నిద్రలేపుతాడు.

స్వప్న : విసిగించకు రాహుల్‌ నోరు మూసుకుని పడుకో..

రాహుల్‌ : నీకేం  అవుతుందే.. నీవల్లే ఎవరికైనా ఏదైనా అవుతుంది.

స్వప్న : అర్థమైంది కదా.. నువ్విచ్చిన జూస్‌ నాకు నచ్చకపోయినా తాగాను.. ప్రశాంతంగా నిద్ర పట్టింది. నువ్వు కూడా నన్ను పట్టించుకోవడం ఆపేసి పడుకో..

రాహుల్‌ : ఈ మనిషిని దేవుడు ఏ పదార్థంతో తయారు చేశాడో అర్థం కావడం లేదు. ఇది విషాన్ని కూడా జూస్‌ లా తాగి పడుకునే పాములా ఉంది. అబార్షన్‌ మందు కూడా డైజెస్ట్‌ చేసుకుందా.. ఏమి  అర్థం కావడం లేదు.

అనుకుని రాహుల్‌ పడుకుంటాడు. రాహుల్‌ బెడ్‌ రూం దగ్గర రుద్రాణి నిలబడి లోపల ఏమైనా జరుగుతుందా? అని తొంగి తొంగి చూస్తుంటుంది. ఇంతలో అక్కడికి కనకం వస్తుంది.

కనకం: ఏమైనా వినిపిస్తుందా?

రుద్రాణి: ఏం వినిపించడం లేదు.

కనకం: ఇదేం పాడు బుద్ది మీకు

రుద్రాణి : ఏమనుకుంటున్నావ్‌ నువ్వు

కనకం : ఇదేం అలవాటు మీకు అని అడుగుతున్నాను.

రుద్రాణి : ఇందాక వాళ్లు పోట్లాడుకుంటుంటే చూశాను. లోపల వాళ్లు గొడవపడుతున్నారు అనుకున్న

కనకం : అంతే లేండి దొరికిపోయాక కవర్‌ చేసుకోకపోతే ఎలా?

రుద్రాణి: ఏయ్‌ ఏంటి నువ్వనుకున్నదేమి కాదు.

కనకం: మీరు చెప్పేది కాదు.

రుద్రాణి: నాకు అంత దరిద్రపుగొట్టు బుద్ది లేదు అంటున్నాను.

కనకం: ఇందాక వాళ్లు కొట్లాడుకోలేదు. స్వప్న జూస్‌ తాగనంటే అల్లుడు గారు బతిమిలాడారు. నేనే బెదిరించి తాగించాను. ఈ లోపు ఎప్పుడు పోట్లాడుకున్నారు.

రుద్రాణి: ఏయ్‌ నీతో వాదించినంత బుద్ది తక్కువ పని లేదు.

కనకం: నేనే అదే అంటున్నాను. నీతో వాదించినంత బుద్ది తక్కువ పని లేదు. రండి పడుకుందాం

అంటూ రుద్రాణిని అక్కడి నుంచి తీసుకుని వెళ్తుంది కనకం.

కావ్య స్నానం చేసి వచ్చి నిద్రపోతున్న రాజ్‌తో ఒక సెల్పీ దిగి వెళ్లి తల దువ్వుకుంటుంది. మెలుకువ వచ్చిన రాజ్‌ నిద్ర లేచి కావ్యను రొమాంటిక్‌ గా చూస్తుంటాడు. ఇంతలో రాజ్‌ ఆత్మ బయటకు వచ్చి కావ్యను హగ్‌ చేసుకోవడానికి వెళ్తుంటే..  

రాజ్‌ : రేయ్‌ మర్యాదగా చెప్తున్నాను. అంతరాత్మవి అంతరాత్మలా ఉండు.. అంతేకానీ అసలు బాడీని పక్కన పెట్టి ఓవరాక్షన్‌ చేశావంటే బాగోదు.

రాజ్‌ ఆత్మ: జలసీగా ఉందా? ఏ పీలింగ్‌ లేనప్పుడు ఎందుకురా అడ్డుపడతావ్‌..

రాజ్‌: రేయ్‌ అది నా భార్యరా..

రాజ్‌ ఆత్మ: నీ బొంద నేను నువ్వు ఒకటేరా.. పిచ్చి బాడీ ఫెలో..

రాజ్‌: అయినా సరే నా కళ్ల ముందు నువ్వు ఇలా పిచ్చి వెషాలు వేశావంటే పర్మినెంట్‌గా నిన్ను నా బాడీలోనే బంధించేస్తాను.

రాజ్‌ ఆత్మ: ఆత్మను ఆపగలిగే అసలు బాడీ ఈ ప్రపంచంలోనే లేదురా పిచ్చి..

అనుకుంటూ ఆత్మ కావ్యను హగ్‌ చేసుకోవడానికి వెళ్తుంటే... ఆత్మను ఆపే ప్రయత్నంలో రాజ్‌ వెళ్లి కావ్యను గట్టిగా హగ్‌ చేసుకుంటాడు. ఇంతలో బయటి నుంచి ధానలక్ష్మీ   కావ్యను పిలుచుకుంటూ బెడ్‌ రూంలోకి వస్తూనే రాజ్‌ కావ్యను చూస్తుంది. అత్తను గమనించిన రాజ్‌ సిగ్గుపడుతూ పక్కకు వెళ్లి దాక్కుంటాడు.  

ధాన్యలక్ష్మీ: ఏం జాతమకో నాది ఎప్పుడూ ఇలాంటి సందర్భాలే ఎదురవుతున్నాయి. అయినా డోర్‌ వేసుకోవచ్చు కదా..  ఏయ్‌ పిల్లా నువ్వు కిందకొచ్చి సీమంతానికి ఏర్పాట్లు చూడు.

అని చెప్పి ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది. కావ్య కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రాజ్‌ ఆత్మ మల్ళీ తిరిగి వస్తుంది.

రాజ్‌ ఆత్మ: ఇద్దరూ జంప్‌ అయిపోయారులే కానీ ఇక నువ్వు కళ్లు తెరిచి ఇటు రావొచ్చు. నువ్వు ప్రపంచంలో ఎవ్వరినైనా బురిడీ కొట్టించుచొచ్చు కానీ అంతరాత్మను కాదురా. కచ్చితంగా నువ్వు కావ్యతో ప్రేమలో పడ్డావు.

రాజ్‌: లేదు..లేదు...లేదు..

ఆత్మ: అవును..అవును..అవును..

ఆత్మ గొంతు నొక్కబోతుంటే మాయమైపోతుంది. రాద్రాణి టెన్షన్‌ పడుతూ ఆలోచిస్తుంది..

రుద్రాణి: ఏంటి రాత్రి నేను ఇచ్చిన టాబ్లెట్‌ పని చేయలేదా? ఏం అర్థం కావడం లేదు. ఈ రాహుల్‌ కూడా మొద్దులాగా నిద్ర పోతున్నాడు. అనుకుంటుండగా కనకం రావడం చూసి వెళ్లి బూజు దులిపినట్లు నటిస్తుంది రుద్రాణి.

కనకం: రుద్రాణి ఇది కలా నిజమా..?

రుద్రాణి : కలకి నిజానికి తేడా తెలియనంత ఊహలో బతుకుతున్నావా?

కనకం: ఆ పని చేసేది మీరు కదా..? ఎప్పుడైనా మీరు వేరే వాళ్లతో పని చేయిస్తారు కానీ మీరు పనిచేయడం నేను ఎప్పుడూ చూడలేదండి. అందుకే ఆశ్చర్యపోతున్నాను.

రుద్రాణి : నువ్వేమైనా మొదటి నుంచి ఇంట్లో ఉన్నావా?

కనకం: మరి ఇంట్లో వాళ్లు అలా అంటున్నారు.. మీరు మరీ సోమరిపోతు అంటున్నారు. తినడం పడుకోవడం తప్ప ఏమీ తెలియదన్నారు. అంటూ కనకం వెళ్లిపోతుంది. ఇంతలో  రాహుల్‌ అక్కడి వస్తాడు..

రుద్రాణి : ఏంట్రా నీకోసం ఎంతసేపు వెయిట్‌ చేయాలి? రాత్రి నీకో పని అప్పజెప్పాను అదేమైందో చెప్పాలి కదా..?

రాహుల్‌ : ఎంటి చెప్పేది నువ్వు చెప్పినట్లు అక్కడేమీ జరగలేదు. దున్నపోతులా రాత్రంతా గురుకపోట్టి నిద్రపోయింది.

అని చెప్తుండగానే బెడ్‌ రూంలోంచి స్వప్న కేకలు వినిపిస్తాయి. రాహుల్‌ రుద్రాణి లోపలికి వెళ్లి ఏమైందో చెప్పమని అడుగుతారు స్వప్నను. లోపల బల్లి ఉందని స్వప్న చెబుతుంది. ఎద్దులా పెరిగావు బల్లికి బయపడతావా? అంటూ లోపలకి  వెళ్లి ప్రెష్ అవు అని చెప్తారు. స్వప్న లోపలికి వెళ్తుంది.

రుద్రాణి : ఇదేంటి దీనికేం కాలేదు..?

రాహుల్‌: ఆ విషయం నన్ను కాదు నీ డాక్టర్‌ను అడుగు.. చీప్‌ మందులు ఇచ్చిందో.. తప్పుడు టాబ్లెట్‌ ఇచ్చిందో.. ప్లాన్‌ ప్లాన్‌ అంటూ మొత్తం చెడగొట్టావు.. ఇప్పుడు చచ్చిన్నట్లు ఆ సీమంతంలో నవ్వుతూ నట్టించాలి. అని రాహుల్‌ వెళ్లిపోతాడు.  రాజ్‌కు కావ్య కాపీ తీసుకొస్తుంది.

రాజ్‌: అదేంటి నువ్వు కాపీ తీసుకొచ్చావ్‌

కావ్య: ప్రతిరోజు నేనే కదా మీకు కాఫీ ఇచ్చేది.

రాజ్‌: కానీ నీకు ఈరోజు ఇంట్లో చాలా పని ఉంటుంది కదా..?

కావ్య: ఇప్పుడు కూడా నీతో పని ఉండే వచ్చాను. పనంటే పని కాదు మీకొకటి ఇద్దామని.. ఇదుగోండి వేసుకోండి అని కొత్త డ్రెస్‌ ఇస్తుంది.

రాజ్‌ : నాకు చాలా ఉన్నాయి కదా..?

కావ్య: మనిద్దరికీ ఒకే కలర్‌ డ్రెస్‌ లేదు కదా అందుకే తీసుకున్నాను. ఒకసారి ఓపెన్‌ చేసి చూడండి.

బలవంతం ఎమీ లేదు మీకు నచ్చితేనే వేసుకోండి. అని చెప్పి వెళ్లిపోతుంది కావ్య.

రుద్రాణి డాక్టర్‌కు ఫోన్ చేసి తిడుతుంది.

రుద్రాణి: అసలు నువ్వు డాక్టరువేనా.. లేక దొంగ సర్టిఫికెట్‌ పెట్టి డాక్టర్‌ అయ్యావా..?

డాక్టర్‌ : ఇప్పుడు ఏమైందని అంత ప్రెస్టెట్‌ అవుతున్నావ్‌.. అంత పెద్ద తప్పు నేనేం చేశాను.

రుద్రాణి : నిన్న అబార్షన్‌ అవ్వాలని టాబ్లెట్‌ అడిగాను కదా.. మరి నువ్వేం ఇచ్చావ్‌

డాక్టర్‌: నేను అదే ఇచ్చాను.

రుద్రాణి : మరి అబార్షన్‌ అవ్వలేదు కదా..

డాక్టర్‌ : వాట్‌ అవ్వలేదా..? ఇంపాజబుల్‌ అవ్వకుండా ఉండే చాన్సె లేదు. మీరు నేను చెప్పిన టాబ్లెట్‌ కాకుండా వేరే ఏదైనా వాడుండాలి. లేకపోతే ఆమెకు కడుపైనా లేకపోయి ఉండాలి. నిజంగా మీరు చెప్పిన పర్సన్‌ ప్రెగ్నెంటా..?

రుద్రాణి : ప్రెగ్నెంటా అని అడుగుతావేంది.. కళ్ల ముందు అంత పెద్ద కడుపు పెట్టుకుని తిరుగుతుంటే..?

డాక్టర్‌: లేదు ఎక్కడో ఏదో తప్పు జరిగింది. తను ప్రగ్నెంట్‌ అయ్యే అవకాశమే లేదు. నేనిచ్చిన టాబ్లెట్స్‌ చాలా పవర్‌ పుల్‌ అబార్షన్‌ అయ్యి తీరాలి.

అని డాక్టర్‌ చెప్పగానే రుద్రాణి కోపంగా అలోచించుకుంటూ లోపలికి వెళ్తుంది. మరోపక్క సీమంతానికి ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఇంతలో అప్పు వాళ్ల నాన్నతో కలిసి ఇంటికి వస్తుంది. అందరూ సీమంతానికి ఎలా రెడీ అవ్వాలో ఆలోచిస్తుంటారు. కావ్య అప్పుకు కొన్ని పనులు అప్పజెబుతుంది. ఇంతలో కళ్యాణ్ అక్కడికి వచ్చి వదిన అప్పు మాత్రమే కాదు పనులు చేయడానికి నేను కూడా ఉన్నానని చెప్తాడు. ఇంతలో రాజ్‌కు వాళ్ల అమ్మ తీసుకొచ్చిన కొత్త డ్రెస్‌ ఇస్తుంది. ఈ డ్రెస్‌ పంక్షన్‌లో వేసుకోమని చెప్తుంది. దీంతో రాజ్‌ డైలమాలో పడతాడు. ఇంతలో రుద్రాణిని పిలిచి గుడికి వెళ్లి అమ్మవారి కుంకుమ తీసుకురామని చెప్పను ఇంకా వెల్లలేదా? అని అడుతుంది అపర్ణ.

రుద్రాణి: అడుగుతుంటే ఏం చెప్పవేంటి కావ్య నేను నీకు ఇందాకే చెప్పాను కదా..?

కావ్య: ఏం చెప్పారు

రుద్రాణి: నేను గుడికి వెళ్లడానికి వీలు కావడం లేదు. నువ్వు వెళ్లి అమ్మవారి కుంకుమ తీసుకురామని చెప్పాను కదా..?

కావ్య: అదేంటి నాకెప్పుడు చెప్పారు. మీరు నిజంగా నాకు చెప్పలేదు..

రుద్రాణి: ఆ తెలుస్తుందిలే నీ మాటల్లో ఎంత నిజం ఉందో

అనగానే అపర్ణ కావ్య వైపు సీరియస్‌ గా చూస్తుంది. దీంతో ఇవాళ్టి ఏపిసోడ్‌ పూర్తి అవుతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget