Brahmamudi Serial Today: ‘బ్రహ్మముడి’ సీరియల్: గత వారం జరిగిన బ్రహ్మముడి సీరియల్ ఏపిసోడ్స్ హైలెట్స్ ఓసారి చూద్దాం.
Brahmamudi serial Weekly episode September 8th to 13th: బ్రహ్మముడి సీరియల్ గత వారం చాలా ఆసక్తికరంగా జరిగింది. సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Brahmamudi Serial Weekly Episode: రేవతిని ఎలాగైనా ఇంటికి తీసుకురావాలనుకున్న రాజ్ ముసుగు వేయించి తీసుకొస్తాడు. రేవతిని రాధగా ఇంట్లో వాళ్లకు పరిచయం చేస్తాడు. ఆమె స్వరాజ్ వాళ్ల అమ్మ అని చెప్తాడు. అయితే ముసుగులో ఉందేంటని అందరూ అడిగితే అది వాళ్ల ఆచారం అని చెప్తాడు రాజ్. అయితే రేవతిని ముసుగులో చూసిన రుద్రాణి అనుమానిస్తుంది. వీళ్లేంటి ఈమెకు ఇంత ప్రాదాన్యత ఇస్తున్నారు అనుకుంటూ ఇదేదో తేల్చుకోవాలని అనుకుంటుంది. తర్వాత కావ్య, అప్పుల కడుపు పోగోట్టేందుకు తీర్థంలో పాయిజన్ కలుపుతుంది రుద్రాణి.
పూజ అయిపోయాక పంతులు తీర్థం ఇస్తుంటే.. స్వరాజ్ పరుగెత్తుకుంటూ వచ్చి పంతులుకు డాష్ ఇస్తాడు. దీంతో పంతులు చేతిలో ఉన్న తీర్థం కింద పడిపోతుంది. రుద్రాణి కోపంగా స్వరాజ్‌ను తిడుతుంది. రేవతికి కూడా తిడుతుంది. ఇంట్లో వాళ్లు అందరూ రుద్రాణిని తిడతారు.
తర్వాత స్వరాజ్‌ను తీసుకుని బయటకు వెళ్లిన రాజ్, కావ్యలను కనకం చూస్తుంది. వెళ్లి అసలు ఈ అబ్బాయి ఎవరు అని నిలదీస్తుంది. దీంతో రాజ్, స్వరాజ్ గురించి నిజం చెప్తాడు. దీంతో కనకం షాక్ అవుతుంది. ఇంకో విషయం కూడా ఉంది అని ఆ ముసుగులో ఉన్నది ఎవరో కాదు మా రేవతి అక్క అని చెప్తాడు రాజ్. దీంతో కనకం భయపడుతుంది. మీ అమ్మకు నిజం తెలిస్తే ఇంట్లో భూకంపం వస్తుంది అని చెప్తుంది. అదంతా ఏమీ జరగదులే అని సర్ధి చెప్తాడు రాజ్.
తర్వాత రేవతి బయటకు వెళ్లి ఫోన్ మాట్లాడుతుంటే.. రుద్రాణి చూస్తుంది. రాహుల్‌ను పిలిచి నిజం చెప్తుంది. ఎలాగైనా దీని ముసుగు తీసి బండారం బయటపెట్టాలని అంటుంది. తర్వాత అందరూ భోజనం చేస్తుంటారు. రుద్రాణి కావాలని రేవతి దగ్గరకు వెళ్లి నీళ్లు పడేలా చేస్తుంది. అయ్యో మీ డ్రెస్ మొత్తం తడిసిపోయింది ముసుగు తీసేయండి అంటూ ముసుగు తీయడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో అపర్ణ కోపంగా రుద్రాణిని తిడుతుంది. అమ్మా రాధ నువ్వు వెళ్లి నా రూంలో డ్రెస్ చేంజ్ చేసుకో అని చెప్తుంది. సరే అంటూ రేవతి వెళ్లిపోతుంది. ఇప్పుడు తప్పించుకున్నావు .. తర్వాత ఎలా తప్పించుకుంటావో చూస్తాను అని మనసులో అనుకుంటుంది రుద్రాణి.
తర్వాత కావ్య రూంలోకి వెళ్లి నెక్లెస్ దొంగతనం చేసి ఆ నెక్లెస్ రేవతి బ్యాగులో వేస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కనకం, స్వరాజ్ ఇక్కడేం చేస్తున్నావని అడుగుతారు. దీంతో ఏం లేదు.. రాధ గారి డ్రెస్ బాగుంది ఎక్కడ తీసుకున్నారో తెలుసుకుందామని వచ్చాను అంటుంది. దీంతో స్వరాజ్ కోపంగా నా చాక్లెట్స్ కొట్టేయడానికి వచ్చావా రూంలోకి అని అడుగుతాడు. రుద్రాణి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత కిందకు వెళ్లిన రుద్రాణి.. కావ్యను పిలిచి మీ అత్త గారు ప్రేమగా ఇచ్చిన నెక్లెస్ ఎందుకు వేసుకోలేదని అడుగుతుంది. కావ్యను రెచ్చగొడుతుంది.
దీంతో కావ్య నెక్లెస్ కోసం రూంలోకి వెళ్తుంది. రూంలో నెక్లెస్ ఉండదు. బయటకు వచ్చిన కావ్య నెక్లెస్ పోయిందని చెప్తుంది. రుద్రాణి బయటి నుంచి వచ్చిన వారే కొట్టేసి ఉంటారు అంటుంది. రేవతి బ్యాగ్ చెక్ చేయాలని చెప్తుంది. అందరూ వద్దంటున్నా వెళ్లి బ్యాగ్ తీసుకొచ్చి చెక్ చేస్తుంది రుద్రాణి. కానీ బ్యాగ్‌లో నెక్లెస్ ఉండదు. దీంతో స్వరాజ్ వచ్చి నెక్లెస్ ఎక్కడ ఉందో నాకు తెలుసు అంటాడు. ఎక్కడ ఉంది చూపించమని అపర్ణ అడగ్గానే.. రుద్రాణి రూంలోకి తీసుకెళ్లి నెక్లెస్ చూపిస్తాడు. నెక్లెస్ తీసుకుని కిందకు వచ్చిన అపర్ణ. రద్రాణిని తిడుతుంది. నెక్లెస్ నువ్వు దొంగిలించి ఇంటికి వచ్చిన అతిథిని దొంగను చేస్తావా…? అంటూ తిడుతుంది.
తర్వాత అందరూ భోజనం చేస్తుంటే.. అపర్ణ, స్వరాజ్ ను తన ఒడిలో కూర్చోబెట్టుకుని అన్నం తినిపిస్తుంది. దీంతో రేవతి అక్కడి నుంచి ఏడుస్తూ బయటకు వెళ్లిపోతుంది. రాజ్, కావ్య వెనకే వెళ్లి ఓదారుస్తుంటారు. ఇంతటితో గడిచిన వారం బ్రహ్మముడి అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















