Brahmamudi Serial Today September 19th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కోడలిగా నటించడానికి ఎంత తీసుకుంటావన్న రాజ్ - రుద్రాణిపై విరుచుకుపడ్డ స్వప్న
Brahmamudi Today Episode: కావ్యను కోడలిగా నటించడానికి ఎంత తీసుకుంటావు అని రాజ్ అడగడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
![Brahmamudi Serial Today September 19th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కోడలిగా నటించడానికి ఎంత తీసుకుంటావన్న రాజ్ - రుద్రాణిపై విరుచుకుపడ్డ స్వప్న brahmamudi serial today episode September 19th written update Brahmamudi Serial Today September 19th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కోడలిగా నటించడానికి ఎంత తీసుకుంటావన్న రాజ్ - రుద్రాణిపై విరుచుకుపడ్డ స్వప్న](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/19/199c2b691d4068b963a4c2fb08c8b7331726711557012879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Brahmamudi Serial Today Episode: అది మీ ప్రాబ్లమ్, నాకు మీకు ఎలాంటి రిలేషన్ లేదు. అని కావ్య చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. అయితే ఏ సంబంధం లేదా? అని రాజ్ అడగడంతో అవి నువ్వు అన్న మాటలే మహాశయా అంటుంది. ఇంతలో లోపలి నుంచి కనకం, మూర్తి బయటకు వస్తారు. వాళ్లతో రాజ్ మీ అమ్మాయికి చెప్పండి ఇక జీవితంలో ఈ గడప తొక్కను అని వార్నింగ్ ఇవ్వడంతో.. నువ్వు కూడా మీ అమ్మకు చెప్పు నేను ఇక జన్మలో ఆ ఇంటి గడపే తొక్కనని అని చెప్తుంది. దీంతో రాజ్ కోపంగా వెళ్లిపోతాడు. కారు దగ్గరకు వెళ్లిన రాజ్ అపర్ణ మాటలు గుర్తు చేసుకుని చెక్ బుక్ తీసుకుని మళ్లీ రిటర్న్ వస్తాడు.
కావ్య: మీర అనాల్సిన మాటలు ఇంకా ఏమైనా మిగిలిపోయాయా?
రాజ్: నువ్వు వదలాల్సిన తూటాలు ఏమైనా మిగిలిపోతే పక్కన పెట్టు
కావ్య: పెట్టి..
రాజ్: నేను ఒక అద్భుతమైన ఆఫర్ ఇవ్వడానికే వచ్చాను. ఇది ఎవ్వరూ ఎవ్వరికీ ఇవ్వని ఆఫర్.
కావ్య: ముందు అదేంటో చెప్పండి. అది అద్భుతమో.. చెండాలమో నేను డిసైడ్ చేస్తాను.
రాజ్: ఇదే ఈ పొగరే తగ్గించుకోమనేది.
కావ్య: మామూలుగా అయితే తగ్గేదాన్నేమో.. కానీ ఈ గడప తొక్కనని శపథం చేసిన రెండు నిమిషాల్లోనే మళ్లీ గడప తొక్కారు కదా? నేను గెలిచాను కదా? తగ్గను.
రాజ్: నాకు మా అమ్మ ముఖ్యం. మా అమ్మకు నువ్వు ఆ ఇంట్లో కోడలిగా ఉండటం ముఖ్యం. కాబట్టి ఒక సెన్సెషన్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాను.
కావ్య: అదేంటో చెప్పనే లేదు.
రాజ్: నువ్వు మా ఇంట్లో నటించడానికి నీకెంత కావాలి.. ? ఫ్యాకేజీ కావాలా? జీతం కావాలా? ఎలా కావాలంటే అంత ఇస్తా.. ఇదిగో చెక్ బుక్ తెచ్చా..?
కావ్య: ఎంత కావాలిస్తే అంత ఇస్తారా..?
రాజ్: ఎంతైనా తీసుకో ఇదిగో చెక్ మీద సంతకం పెట్టాను.
కావ్య: ఒక్క నిమిషం సర్దుకుని వస్తాను.
అని లోపలికి వెళ్లి బంగారం తీసుకుని వచ్చి నీ జీతం కన్నా ఇది ఎక్కువే.. ఇది తీసుకుని ఒక నెల రోజులు మాఇంట్లో అల్లుడిగా నటించండి అని చెప్తుంది. దీంతో రాజ్ షాక్ అవుతాడు. దుగ్గిరాల వారసుణ్నే కొనాలనుకుంటావా? అంటూ రాజ్ ప్రశ్నంచడంతో ఎవరికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. సిపుల్ గా ఐ డోంట్ కేర్ అని కావ్య చెప్పడంతో రాజ్ సీరియస్ గా వెళ్లిపోతాడు. ఇంటికి ఒక్కడే వచ్చిన రాజ్ ను చూసి రాహుల్, రుద్రాణి హ్యాపీగా ఫీలవుతారు. మిగతా వాళ్లందరూ ఏమైందని ప్రశ్నిస్తారు. కావ్య ఎక్కడని అడుగుతారు. దీంతో రాజ్ సింపుల్ గా రాలేదని చెప్తాడు. దీంతో ఇందిరాదేవి, అపర్ణ కోపంగా రాజ్ ను తిడతారు. నీకు తీసుకురావాలని లేకుంటే అదేం చేస్తుంది. అని అపర్ణ అనగానే అవును నాకు తీసుకురావాలని లేదు అని పైకి వెళ్లిపోతాడు.
ఇందిరాదేవి: ఏం చేస్తే వాళ్లిద్దరూ కలిపిపోతారు.
రుద్రాణి: వాళ్లకు కలవడం ఇష్టం లేకపోతే మనమేం చేస్తాం చెప్పండి.
స్వప్న: అందరూ నిన్ను ఆదర్శంగా తీసుకుని మొగుణ్ని వదిలేయాలంటే ఎలా చెప్పండి. ఇప్పుడు మీ బోడి సలహాలు ఎవరు అడిగారు. గమ్మున ఉండు.
అపర్ణ: ఇప్పుడేం చేయాలి.. ఎలా అత్తయ్యా..
స్వప్న: ఒక పని చేద్దాం ఆంటీ..కావ్యను ఇంట్లోంచి వెళ్లగొట్టమని వెయ్యి సార్లు చెప్పింది మా అత్తే.. కాబట్టి మా అత్తనే పంపిద్దాం. కాళ్ల కాళ్ల మీద తల పెట్టి రాకపోతే నన్ను ఇంట్లోంచి గెంటివేస్తారని చెప్పిద్దాం.
ప్రకాష్: ఇది కాళ్ల మీద పడితే కాళ్లు లాగేసే రకం అని కావ్య చచ్చినా నమ్మదు.
అని చెప్పగానే అపర్ణ బాధపడుతుంది. ఏదో ఒకటి చేసి కావ్యను ఇంటికి తీసుకురావాలని అంటుంది. మరోవైపు అప్పు తినడానికి రెడీ చేస్తుంటే.. కళ్యాణ్ వచ్చి పొట్టి నీకో గుడ్ న్యూస్ అని కళ్యాణ్, కనకం ఇంటికి వెళ్లి వచ్చిన విషయం చెప్తాడు. అప్పు సంతోషిస్తుంది. కానీ కావ్యను ఇంటికి తీసుకెళ్లలేదని బాధపడుతుంది. మరోవైపు రాజ్ ఆత్మ వచ్చి రాజ్ ను తిడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్: పెళ్లికి ఓకే చెప్పిన గగన్ – శోభ కలలోకి వచ్చి నిజం చెప్పిందన్న శరత్‌చంద్ర
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)