(Source: ECI/ABP News/ABP Majha)
Brahmamudi Serial Today October 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్ కు వార్నింగ్ ఇచ్చిన సీతారామయ్య - తాతయ్యపై యుద్దం ప్రకటించిన రాజ్
Brahmamudi Today Episode: ఆఫీసులో కావ్యతో గొడవ పడ్డ రాజ్ కోపంగా ఇంటికి వచ్చి తాతయ్యను పిలిచి నాకు మీరు అన్యాయం చేశారు అనడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: కావ్య తన అపాయింట్ మెంట్ ఆర్డర్ ను రాజ్ కు ఇస్తుంది. అది చదుకుకుని రాజ్ షాక్ అవుతారు. తాతయ్యగారే నన్ను సీఈవోగా అపాయింట్ చేశారు అంటుంది.
కావ్య: ఇక నుంచి మీరు నన్ను కలవాలంటే నా అపాయింట్ తీసుకుని రావాలి. అండర్‌స్టాండ్.
రాజ్: అప్పర్ స్టాండ్‌లో ఉండి అండర్‌స్టాండ్ అంటే సైకిల్ స్టాండ్ వేసినట్టు అలాగే ఉండిపోతాను అనుకున్నావా? ఇది ఇంతటితో అయిపోతు.
కావ్య: ఇదిగోండి ఇదిగో తాతయ్యగారు ఫోన్ చేస్తున్నారు.. ఐ మీన్ ఛైర్మన్ గారు ఫోన్ చేస్తున్నారు. మాట్లాడతారా మేనేజర్‌గారు.
రాజ్: నేను ఇంటికి వెళ్లి తేల్చుకుంటాను. ఫోన్ లో మాట్లాడే కర్మ నాకు లేదు.
సీతారామయ్య: ఏంటి వాగుతున్నాడు.
కావ్య: ఇంటికి వచ్చి తేల్చుకుంటారట..
సీతారామయ్య: రమ్మను గడ్డి పెట్టడానికి సిద్దంగా ఉన్నాము. ఇది నా ఆర్డర్.. నా ఆర్డర్ ను దిక్కరించడానికి హక్కు ఎవరికీ లేదు.
రాజ్: ఈ గూడు పుఠాణీకి చైర్మన్ ఎవరు.? ఈ డెస్టినేషన్ డిజైన్ చేసిన పౌండర్ ఎవరు..? ఆ కాన్సర్ నాటకం ఆడిన కనకమేనా..? మా ఇంట్లో ఇవాళ కురుక్షేత్ర సంగ్రామం మొదలు కాబోతుందే..
కావ్య: విజయోత్సు షియోధన..
అంటూ ఇద్దరూ గొడవ పడతారు. శృతి బోకె తీసుకొచ్చి కొత్త సీఈవోకు వెల్‌కం చెప్పండి సార్ అని రాజ్‌కు ఇస్తుంది. రాజ్ బొకే కింద పడేసి తొక్కి వెళ్లిపోతాడు. తర్వాత రాజ్ కోపంగా ఇంటికి వెళ్లి తాతయ్యా అని గట్టిగా పిలుస్తుంటాడు.
అపర్ణ: ఏమైంది నాన్నా..
రాజ్: తాతయ్యా ఎక్కడ మమ్మీ..
ఇందిరాదేవి: ఏంట్రా అరుస్తున్నావు..
రాజ్: అరిచినట్టు ఉందా? ఆక్రోషించినట్టుగా ఉందా?
ప్రకాష్: ఉక్రోషం అంటే తెలుసు.. ఆక్రోషం అంటే ఏ క్రోషంరా..
రాజ్: ఇప్పుడు నానా అర్థాలు అవసరమా..? బాబాయ్..
సీతారామయ్య: ఏంటి చెప్పరా..
రాజ్: మీరు నన్ను అవమానించారు.
సీతారామయ్య: ఏ విషయంలో..
రాజ్: ఆ కళావతిని సీఈవోను చేసి..
సీతారామయ్య: అది కావ్యలోని కళకు జరిగిన సన్మానం. అది నీకెలా అవమానం అవుతుందిరా..
రాజ్: అసలు మా ఇద్దరి మధ్య ఎంత దూరం ఉందో మీకు తెలుసు కదా.
సీతారామయ్య: మీ ఇద్దరి మధ్య దూరం ఉండొచ్చు. కానీ మా ఇద్దరి మధ్య బంధం ఉది. తాత మనవరాలు అనే వాత్సల్యం ఉంది.
అని చెప్పగానే రాజ్ కోప్పడతాడు నన్ను అవమానించడానికే ఇలా చేశారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు నాకు ఒక్కమాటైన చెప్పాలి కదా? అంటాడు. దీంత సీతారామయ్యా కోపంగా నువ్వు నీ భార్యను ఇంట్లోంచి పంపించివేసినప్పుడు మాకు చెప్పావా..? నువ్వు ఎవరి మాట వింటున్నావు అంటూ తిడతాడు. దీంతో రుద్రాణి, ధాన్యలక్ష్మీ ఇద్దరూ రాజ్‌కు సపోర్టుగా మాట్లాడతారు. దీంతో ఎవ్వరు ఏం మాట్లాడినా ఇది ఈ ఇంటి పెద్దగా నేను తీసుకున్న నిర్ణయం.. ఈ నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు అంటూ వెళ్లిపోతాడు సీతారామయ్య. ఇద్దరు కాలేజీ అమ్మాయిలు కళ్యాణ్ ఆటో ఎక్కుతారు. కళ్యాన్ రాసిన సాంగ్ పెట్టుకుని వింటుంటారు. సాంగ్ చాలా బాగుందని ఫీలవుతుంటారు. కళ్యాణ్ హ్యాపీగా ఫీలవుతాడు. లక్ష్మీకాంత్ దగ్గరకు వెళ్లి అసిస్టెంట్ గా అవకాశం ఇవ్వమని అడగాలి అనుకుంటాడు. మరోవైపు అనామిక.. కావ్య ఆఫీసులో ఉద్యోగికి ఫోన్ చేస్తుంది.
అనామిక: ఏమంటుంది నీ కొత్త బాస్.
ఉద్యోగి: పాత బాస్ ను పంపంచేసింది మేడం.
అనామిక: కావ్య పంపించడం ఏంటి? పాత బాసే ఒళ్లు మండి వెళ్లిపోయి ఉంటాడు. ఇప్పుడు ఈ బాస్ ను కూడా పంపించేద్దామనుకుంటున్నాను. అక్కడి సీక్రెట్స్ అన్ని నాకు పంపించాలి.
ఉద్యోగి: మేడం రాజ్ సార్ అంటే మేము పాత స్టాఫ్ అని బాగా నమ్మారు. అందువల్ల ఆఫీసు విషయాలు మీకు పంపించగలిగాను కానీ ఇప్పుడు అలా కాదు కావ్య మేడం చాలా స్టిక్టుగా ఉంది మేడం. ప్రతి విషయంలో వేలు పెడుతుంది.
కావ్య వచ్చి ఉద్యోగి మాట్లాడేది మొత్తం వింటుంది. ఫోన్ తీసుకుని అనామికకు వార్నింగ్ ఇస్తుంది. మొదటిసారి నువ్వు నన్ను దెబ్బ కొట్టావు.. ఈసారి నేను కొడతా.. కోలుకోలేని దెబ్బ అంటూ ఫోన్ కట్ చేస్తుంది. నిన్ను సెక్షన్ మేనేజర్ నుంచి సెక్యూరిటీ గార్డు గా డిమోట్ చేస్తున్నాను అని కావ్య చెప్తుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!