Brahmamudi Serial Today October 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కనకం ఇంటికి వచ్చిన రాజ్ – యాక్టింగ్ ఇరగదీసిన కనకం
Brahmamudi Today Episode: నిజం తెలుసుకున్న రాజ్ కనకం ఇంటికి వచ్చి తన ఆఖరి కోరిక తీరుస్తాననడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: రాజ్ లోపలికి రాగానే లోపల అపర్ణ, ఇందిరాదేవి తన నాటకం మొదలుపెడతారు. డైనింగ్ టేబుల్ దగ్గర తింటున్న ప్రకాశం కావ్యకు అలా ఉంటే నా వల్ల కావడ లేదని చెప్తాడు. దీంతో ఇందిరాదేవి కావ్యకు అలా ఉంటే మనం కడుపునిండా ఎలా తినగలం అనుకుంటూ ముగ్గరు కలిసి తినకుండా వెళ్లిపోతారు. దీంతో రాజ్ ఎవ్వరూ ఏమీ చెప్పడం లేదు. ఇక ఇగో పక్కన పెట్టి అసలు విషయం తెలుసుకోవాలి అనుకుంటాడు. గార్డెన్ లో కూర్చున్న అపర్ణ, ఇందిరాదేవి దగ్గరకు వెళ్తాడు రాజ్.
రాజ్: ఏమైంది మమ్మీ.. ఏం జరుగుతుంది ఇక్కడ..?
అపర్ణ: ఏ విషయం గురించి అడుగుతున్నావురా?
రాజ్: అదే ఆ కళావతి విషయం.. ఆవిడ గారికి ఏమైందట.
అపర్ణ: ఏమైతే నీకెందుకురా? నువ్వే కదా పిల్ల గురించి చెప్పొద్దు..పిల్ల తల్లి గురించి చెప్పొద్దు అన్నావు.
ఇందిరాదేవి: మమ్మల్ని ఏమీ అడగొద్దు.
రాజ్: ఏమైందో చెప్తేనే కదా తెలిసేది. సాటి మనిషిగా ఆమాత్రం తెలుసుకోకూడదా?
అపర్ణ: ఆ మాట కొస్తే ఈ ప్రపంచంలో నీ ఒక్కడికే హక్కు లేదు. అవసరం లేదు. ఆ దేవుడే ఉన్నాడు. ఆయనే అంతా చూసుకుంటారు.
రాజ్: ఏమీ చెప్పనప్పుడు మీరంతా ఎందుకు పాపం కావ్య అంటూ ఎందుకు ఆలోచిస్తున్నారు.
అని రాజ్ అడగ్గానే మేము చెప్పలేము అని వెళ్లిపోతుంటే మీరు చెప్పకపోతే నేను కళ్యాణ్‌ను అడుగుతాను అనగానే ఇక తెగేవరకు లాగోద్దని అపర్ణ, ఇందిరాదేవి ఇద్దరూ కలిసి కనకానికి క్యాన్సర్ అంటా నెల రోజుల కంటే ఎక్కువ బతకదట అని చెప్పగానే రాజ్ షాక్ అవుతాడు. ఈ విషయం కావ్యకు తెలుసా? అని అడుగుతాడు. చెప్పలేదు అంటారు. చెప్పకండి తట్టుకోలేదు అని రాజ్ కనకం ఇంటికి వెళ్తాను అని వెళ్లిపోతాడు. మరోవైపు కనకం శాలువా కప్పుకుని తూలుతూ కింద పడుతూ ఏడుస్తూ ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ లో సాంగ్ వస్తుంది. తర్వాత కనకం లాయర్ ను పిలిచించి ఇంటిని ముగ్గురు అల్లుళ్ల పేరు మీద రాయమని చెప్తుంది. ఇంతలో రాజ్ వస్తాడు.
రాజ్: అయ్యో అత్తయ్యా.. మీరు ఇక్కడ కూర్చోండి.
కనకం: అల్లుడు గారు మీరా?
రాజ్: అవును నేనే.. ఏంటిదంతా..
కనకం: నా తదనంతరం ఈ ఇల్లు నా కూతుళ్లకే చెందాలని వీలునామా రాయిస్తున్నాను బాబు.
రాజ్: మరి మామయ్యాగారు వాకిట్లో ఉంటారా? చూడండి లాయర్ గారు ఇక్కడ ఇల్లు ముక్కలు చేయడం లేదు. వీలునామా రాయడం లేదు. మీరు వెళ్లండి.
లాయర్: ఆఖరి క్షణంలో అవసరం అయితే కబురు చేయండి.
కనకం: అయ్యయ్యో అంత మాట అన్నారు. మా అల్లుడు గారికి ఏమీ తెలియదు.
రాజ్: నాకు అంతా తెలుసు మా అమ్మా నాన్నమ్మా నాకు అంతా చెప్పారు. నిజం విని తట్టుకోలేకపోతున్నాను మీ ఆఖరి కోరిక ఏంటో చెప్పండి.
కనకం: వద్దు బాబు వదిలేయండి.
రాజ్: నన్ను మీ కొడుకు అనుకోండి.
కనకం: బాబు..
రాజ్: అవునండి నన్నే మీ కొడుకు అనుకోండి. నాతో చెప్పండి మీ చివరి కోరిక తీర్చకపోతే నేను బతికే చివరి క్షణం దాకా బాధపడాలి.
కనకం: నువ్వు కొడుకులా అడుగుతున్నావు కాబట్టి అడుగుతున్నాను.
అంటూ ముగ్గురు కూతుళ్లు, ముగ్గురు అల్లుళ్లతో కలిసి నా చివరి పెళ్లి రోజు వేడుక జరుపుకోవాలని ఆశగా ఉంది. అని చెప్పగానే రాజ్ ఆలోచనలో పడిపోతాడు. దీంతో కనకం మరింత బాధపడుతుంది. దీంతో రాజ్ మీ ఆఖరి కోరిక తీరుస్తాను అనగానే కనకం చాలా హ్యాపీగా ఫీలవుతుంది. రాజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రాజ్ కారులో వెళ్తుంటే కావ్య వస్తుంది. రాజ్ ను చూస్తుంది. లోపలికి వెళ్లి కనకాన్ని రాజ్ ఎందుకు వచ్చాడని అడుగుతుంది. ఏమో ఎందుకో నాకేం తెలుసు అంటుంది కనకం దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.