అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today October 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరుకు నిజం చెప్పిన గుప్త – తీన్మార్‌ డాన్స్‌ చేసిన అక్కాచెల్లెలు

Nindu Noorella Saavasam Today Episode :   ఆరుకు వచ్చిన శక్తుల గురించి గుప్త కూడా చెప్పడంతో ఆరు ఆనందంతో తీన్మార్‌ డాన్స్‌ చేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:   ఆరుకు స్పర్శ వచ్చిందనే విషయం తెలియకుండా చేయాలని గుప్త ఆలోచిస్తుంటాడు. ఇంతలో ఆరు అక్కడకు వచ్చి వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. ఏం లేదని ఇవాళ ఉదయం నుంచి నేను అనుకున్నవి జరిగిపోతున్నాయి. నాకు స్పర్శ శక్తి వచ్చింది ఎందుకు అని అడుగుతుంది. దీంతో గుప్త తనకేం తెలియదని చెప్తాడు. అయితే నేనే వెళ్లి తేల్చుకుంటాను అని లోపలికి వెళ్తుంటే నువ్వనుకున్నది నిజమే బాలిక అంటాడు గుప్త.

గుప్త: నాలుగు మండలముల పాటు ఆత్మ భూలోకంలో ఉన్నచో ఆ ఆత్మకు శక్తులు లభించును. నీవు దేనినైననూ తాకవచ్చును. నీ మనసును ఏదైనా సంకల్పించుకున్నచో అది కచ్చితంగా జరుగును. కానీ ఒక్కమాట నీ శక్తులను నువ్వు దుర్వినియోగ పరిచినచో ఆ వరమే నీకు శాపం అగును.

అని గుప్త చెప్పగానే ఆరు పలకకుండా గుప్తకు దూరంగా వెళ్లి అటూ ఇటూ చూసి తీన్మార్‌ డాన్స్‌ చేస్తుంది. ఇంతలో స్కూల్‌ నుంచి వచ్చిన భాగీ కూడా ఆరుతో కలిసి డాన్స్‌ చేస్తుంది.

గుప్త: ఊ… బాగున్నది బాగున్నది..

భాగీ: అక్కా ఇప్పుడు చెప్పండి ఎందుకక్కా ఇంత ఆనందంగా ఉన్నారు.

ఆరు: మిస్సమ్మ ఈ కథలో ఎవ్వరూ ఊహించలేని ఒక అధ్బుతమైన ట్విస్ట్‌  ఒకటి జరిగింది. అంటే దొరికింది. ఆ ట్విస్టు వల్ల నాకైతే చాలా మేలు జరగనుంది. అందుకే ఇంత ఆనందంగా ఉన్నాను.

గుప్త: చిన్నారుల వల్లే ఒకరి సంతోషాన్ని ఒకరు ఎటుల పంచుకుంటున్నారు. ఇటువంటి వారిని ఎటుల విడదీయాలనిపించింది స్వామి. ఈ పరిచయం. ఈ కలయిక, ఈ స్నేహము, ఈ బంధము ఎటులకు దారి తీయునో.. ఎంతటి ప్రమాదం తెచ్చిపెట్టునో అని భయంగా ఉంది. జగన్నాథ నువ్వే రక్ష.

అనుకంటూ వెళ్లిపోతాడు. మరోవైపు మనోహరి ఘోరను కలవడానికి వెళ్తుంది.

మనోహరి: ఘోర ఏంటి ఇక్కడికి రమ్మన్నారు. ఈ ప్లేస్‌ ఏంటి ఇంత భయంకరంగా ఉంది.  నువ్వా పిలవొచ్చు కదా ఘెర. ప్రాణం పోయింది తెలుసా?

ఘోర: మనల్ని చూసి జనాలు భయపడాలి మనం భయపడకూడదు మనోహరి.

మనోహరి: అయినా నువ్వేంటి ఇక్కడికి మకాం మార్చావు.

ఘోర: తమరి ప్రేమ వల్లనా..

మనోహరి: సరే ఏంటి అర్జెంట్‌ గా కలవాలని ఫోన్ చేశావు.

ఘోర: ఆత్మ భూమి మీద ఉండబట్టి 4 మండలాలు దాటింది.

మనోహరి: అయితే రేపు జిల్లాలు కూడా దాటమని చెప్తానులే.

ఘోర: మనోహరి.. ఆ ఆత్మలో ఏవైనా మార్పులు గమనించావా?

మనోమరి: అది నాకు రోజు కనబడి హాయ్‌ చెప్తుంది. కలర్ తగ్గిందా? బరువు పెరిగిందా? అని చూడటానికి.

ఘోర: మనోహరి ఏంటలా మాట్లాడుతున్నావు. దయచేసి నేను అడిగిన వాటికే సమాధానం చెప్పు.

మనోహరి: నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఎలా చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు ఘోర. మార్పులు అంటే ఏంటి?

ఘోర: అనుమానాస్పదం లాంటివి.

మనోహరి: పొద్దున నేను దానితో మాట్లాడుతుంటే ఒక కొబ్బరి బొండం నీ మీద పడబోయింది.

ఘోర: ఇంకేం జరిగింది.

మనోహరి: ఇంతకు ముందు వస్తుంటే అక్కడ ఏమీ లేదు. కానీ ఏదో తగిలినట్టు కిందపడిపోయాను.

ఘోర: అయితే నా అనుమానం నిజం అయింది. నాలుగు మండలాలు ఆత్మ భూమ్మీద ఉంటే ఆత్మకు శక్తులు వచ్చాయి.

మనోహరి: ఏంటి ఘోర అసలు ఏం మాట్లాడుతున్నావు.. శక్తులు రావడం ఏంటి. అసలు ఏం శక్తులు వచ్చాయి ఘోర.  

అని మనోహరి అడగ్గానే ఘోర, ఆత్మకు స్పర్శ వచ్చిందని చెప్పగానే మనోహరి భయపడుతుంది. అది కచ్చితంగా నన్ను చంపేస్తుంది అనగానే ఆ ఆత్మ నిన్నేం చేయదు మనోహరి అంటూ ఆత్మను బంధించడం చాలా ఈజీ అవుతుంది అని చెప్తాడు ఘోర. మరోవైపు ఇంటికి వచ్చిన అమర్‌, మిస్సమ్మను పిలిచి అంజుకు బట్టలు కొనడానికి షాపింగ్‌కు వెళ్లాలని రమ్మని పిలుస్తాడు. సరే రెడీ అయి వస్తానని భాగీ లోపలికి వెళ్తుంది.

శివరాం: నిర్మల అబ్బాయికి నాకు టీ తీసుకుని రా..

నిర్మల: అలాగే నండి.

ఆరు: మీ మౌనం. ఆ మౌనం వల్ల మీరు పడుతున్న బాధ ఎవ్వరికీ చెప్పలేరు. ఎవరితోనూ పంచుకోలేరు.

 అంటూ అంజలి గురించి ఆలోచిస్తుంది ఆరు. తర్వాత గార్డెన్‌ లోకి వెళ్లి నిర్మల, శివరాం మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ బాధగా కూర్చుని ఉంటుంది ఆరు. ఇంతలో అక్కడికి గుప్త వచ్చి ఏమైందని అడుగుతడు. అంజలి గురించి అందరి దగ్గర అబద్దం చెప్పినందుకు ఆయన చాలా బాధపడుతున్నారు గుప్త గారు అని చెప్తుంది ఆరు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమి గురించి ఫీల్‌ అయిన గగన్‌ – అపూర్వకు నిజం చెప్పిన భూమి

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Nindu Manasulu Serial Today August 18th: నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!
నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget