Meghasandesham Serial Today October 9th: ‘మేఘసందేశం’ సీరియల్: భూమి గురించి ఫీల్ అయిన గగన్ – అపూర్వకు నిజం చెప్పిన భూమి
Meghasandesham Today Episode: భూమి, శోభాచంద్ర కూతురేనన్న నిజం కృష్ణ ప్రసాద్ కు తెలియడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Meghasandesham Serial Today Episode: నువ్వు దొంగతనం చేశావంటే నేను నమ్మాలా? అది నా బ్యాగులో పెట్టావంటే ఎలా నమ్మాలి అంటూ భూమి ప్రశ్నిస్తుంది. ఎటు వెళ్లాలో తెలియక రోడ్డు మీద ఉన్న తీసుకెళ్లి జాగ్రత్తగా మీ అన్నయ్య గారింట్లో పెట్టావు అంటూ భూమి ఎమోషనల్ అవుతుంది. నీలాంటి మంచి స్నేహితుడు కష్టంలో సాయం చేస్తాడేమో కానీ కష్టాల్లోకి నెట్టడు. ఇప్పుడు నిజం చెప్పు ఎందుకు అలా చేశావు అని అడుగుతుంది. ఫ్లీజ్ చెర్రి నిజం చెప్పు అంటుంది భూమి.
చెర్రి: ఆ తప్పు నువ్వు చేయలేదని నాకు తెలుసు. చేయని తప్పుకు నిన్ను అందరూ అన్ని మాటలు అంటుంటే నేను తట్టుకోలేకపోయాను.
భూమి: దాని వల్ల నువ్వు చెడ్డవాడివి అయ్యావు కదా? చెర్రి.
చెర్రి : నేను అయినా పర్వాలేదు భూమి నువ్వు కాకూడదు.
భూమి: ఏ.. ఎందుకు..?
చెర్రి: నువ్వుంటే…
భూమి: నేనంటే..
చెర్రి: నువ్వుంటే ఇంట్లో అందరికీ అభిమానం పెరుగుతుంది. ఈ టైంలో నువ్వు చెడ్డదానివి కాకూడదు భూమి.
భూమి: లేదు ఇంకేదో కారణం ఉంది. అందుకే నీ ఇంట్లో నువ్వు దొంగ అనిపించుకోవడానికి కూడా సిద్దపడ్డావు. చెప్పు చెర్రి ఎందుకిలా చేశావు. అసలే పెద్దమ్మని అన్నయ్యని ఎప్పుడు ఏమందామని చూస్తుంటారు. నువ్వు దొంగతనం చేశావంటే ఇంటికి వెళ్లి వాళ్ల మీద గొడవ చేస్తారు.
భూమి: ఆయనన్నా .. ఆంటీ అన్నా ఎంత అభిమానం చెర్రి నీకు. నీలాంటి తమ్ముడు దొరకడం ఆయన అదృష్టం.
చెర్రి: అన్నయ్య విషయంలో నేను అదృష్టవంతుడినే.. కానీ నీ విషయంలోనే నా ప్రేమ విషయం చెప్పలేక తల్లాడిపోతున్నాను ( అని మనసులో అనుకుంటాడు)
చెర్రికి థాంక్స్ చెప్తుంది భూమి. చెర్రి వెళ్లిపోతాడు. నువ్వు అలాంటి పని చేయవని నాకు తెలుసు చెర్రి. చేసింది ఎవరో కూడా తెలుసు అనుకుంటుంది భూమి. మరోవైపు స్నానం చేస్తున్న గగన్ భూమిని తనకు సోప్ పెడుతున్నట్లు కలగంటాడు. తర్వాత చెర్రిని ప్రసాద్ నిలదీస్తాడు. నువ్వు దొంగతనం చేయకపోయినా ఎందుకు నీ మీద వేసుకున్నావని అడుగుతాడు. తన మన మనిషే కదా నాన్నా అంటాడు చెర్రి. మరి నువ్వు చేయలేదు. ఆ అమ్మాయి చేయలేదు మరి ఆ దొంగతనం ఎవరు చేసినట్టు అని డౌట్ పడతాడు ప్రసాద్. మరోవైపు అపూర్వ దగ్గర భూమి మాట్లాడుతుంది.
భూమి: పాపం నువ్వు అనుకున్నది జరగలేదన్న బాధ కదూ. సంగీత్ బాగా జరిగింది అందరూ హ్యాపీగా ఉన్నారు. అందుకు నేనే కారణం అని అంకుల్ మెచ్చుకున్నారు. ఇవన్నీ నువ్వు తట్టుకోలేకపోయావు. అందుకే నన్ను ఇంట్లోంచి బయటకు పంపించాలని చాలా పెద్ద ప్లానే వేశావు. కానీ అది రివర్స్ అయింది. అంతేగా..? అయినా నేను అంకుల్‌కు దగ్గర అయితే నీకేంటి ప్రాబ్లమ్. నీకేమీ కానీ నా మీద ఎందుకంత కోపం. ఎందుకు నన్ను అంకుల్ వి దూరం చేయాలని చూస్తున్నావు.
అపూర్వ: నువ్వు ఆ శోభాచంద్ర కూతురువి అని నాకు తెలుసు కాబట్టి.
భూమి: ఓ తెలుసా..?
అపూర్వ: తెలుసు.. తన కూతురివి అని తెలుసు. నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చావని తెలుసు. నాన్నా అంటూ నా బావని దగ్గర చేసుకోవాలని చూస్తున్నావని తెలుసు. కానీ నాకు తెలియంది ఒక్కటే.. మా బావతో నేనే నీ కూతుర్ని అని ఎందుక చెప్పలేదా? అని
భూమి: ఎందుకంటే నేనే అని చెప్పడానికి ఏ ఆధారం లేదు కాబట్టి. ఉన్న గజ్జెలు శాలువా నీ దగ్గరే ఉన్నాయి కాబట్టి. నేనే శోభాచంద్ర కూతుర్ని అని చెప్పగలిగే వ్యక్తి చనిపోయాడు కాబట్టి. అన్ని ప్రశ్నలే సమాధానాలు లేవు కాబట్టి. కోమాలోంచి బయటకు వచ్చి నాతో మాట్లాడిన నిమిషాల్లో అతను ఎందుకు చనిపోయాడో తెలియదు. ముఖ్యంగా మా అమ్మా ఫ్యాక్టరీలో ఎందుకు కాలి పోయింది.
అపూర్వ: అక్కడ ఉంది కాబట్టి కాలిపోయింది.
భూమి: ఉండాల్సింది హాస్పిటల్ లో కదా? ఈ ప్రశ్నలు సమాధానాలు వెతికే పనిలోనే ఉన్నాను. దొరికన రోజు నాన్నకు నేనెవరో చెప్తాను. ఆరోజు కోసం నేను ఎదురుచూస్తున్నాను
అని చెప్పి భూమి వెళ్లిపోతుంది. చాటు నుంచి అన్ని విషయాలు కృష్ణప్రసాద్ విని షాక్ అవుతాడు. అపూర్వ తాను శోభాచంద్రను ఎలా చంపింది గుర్తు చేసుకుంటుంది. కృష్ణప్రసాద్ కూడా ఫ్యాక్టరీని తాను ఎలా తగులబెట్టింది గుర్తు చేసుకుని ఏడుస్తుంటాడు. మరోవైపు గగన్, భూమి గురించి ఆలోచిస్తుంటే నక్షత్ర, గగన్ కు కాల్ చేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: మనోహరిని కిందపడేసిన ఆరు – భాగీ గురించి ఫీల్ అయిన అమర్