Brahmamudi Serial Today November 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్: అనామిక ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చిన అప్పు – దుగ్గిరాల ఇంటికి వచ్చిన కావ్య
Brahmamudi Today Episode: తమ సక్సెస్ అనామికకు తెలియాలని కళ్యాణ్‌ను తీసుకుని అనామిక దగ్గరకు వెళ్తుంది అప్పు. దీంతో ఇవాల్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: సీతారామయ్య కోసం వంట చేస్తున్న ఇందిరాదేవికి స్వప్న హెల్ప్ చేస్తుంది. అయితే స్వప్నకు ఆవాలు ఏవో జీలకర్ర ఏదో తెలియకపోవడంతో ఇందిరాదేవి నవ్వుకుంటుంది. నువ్వు నాకు హెల్ప్ చేసినట్టు లేదు. నేను నీకు వంట నేర్పినట్టు ఉందని అంటుంది. రాజ్ వచ్చి చూసి నాన్నమ్మ ఏంటి వంట చేస్తుంది అనుకుంటాడు. ఇంతలో ఇందిరాదేవి చేయి కాలడంతో బాధపడుతుంటే రాజ్ పరుగెత్తుకొచ్చి ఎందుకు నాన్నమ్మ నేను బయట నుంచి ఫుడ్ తెప్పిస్తాను అన్నాను కదా..? మళ్లీ ఎందుకు వంట చేస్తున్నావు అని అడుగుతాడు రాజ్.
ఇందిర: బయటి ఫుడ్ తెప్పిస్తావు కానీ మీ తాతయ్య కొద్ది రోజులుగా బయటి ఫుడ్ తినడం లేదు కదా..? అందుకే వంట చేయడానికి వెళ్లాను.
అక్కడికి వచ్చిన రుద్రాణి, ధాన్యలక్ష్మీ లు వస్తారు. వాళ్లను రాజ్ కోపంగా తిడతాడు.
రాజ్: ఇంట్లో ఇంత మంది ఉన్నారు ఎవరైనా సాయం చేయోచ్చుగా కడుపుతో ఉన్న స్వప్న హెల్ప్ చేస్తుంది. మీలో కొంచెమైనా మానవత్వం ఉందా?
రుద్రాణి: నన్ను అడుగుతావేంటిరా.. నేను ఎప్పుడైనా కిచెన్ వైపు చూశానా..?
ధాన్యలక్ష్మీ: రాజ్ నీకు ఇప్పుడు మానవత్వం గుర్తుకు వచ్చిందా..? ఒకప్పుడు అందరి కోసం నేను ఈ పనులు చేశాను. అప్పుడు ఎవ్వరూ నా కష్టాన్ని గుర్తించలేదు. ఈ క్షణం వరకు నా కొడుకు కోసం ఏడుస్తున్నాను. ఆ ఏడుపును ఎవ్వరూ గుర్తించలేదు. ఇంత మందిలో ఉంటూ ఒంటిరిగానే బతుకుతున్నాను. నా ఒంటరి తనాన్ని ఎవ్వరూ గుర్తించలేదు.
రాజ్: పిన్ని నేను అందరిని ఒక్కలాగే చూస్తాను.
ధాన్యలక్ష్మీ: కానీ నీ తమ్ముడు మాత్రం నిన్ను రాముడి కంటే ఎక్కువగా చూశాడు. లక్ష్మణుడిలా నీ వెంటే తిరిగాడు. కానీ వాడి గురించి ఆలోచించావా..? అవన్నీ వదిలేసి ఇవాళ సడెన్ గా వచ్చి మానవత్వం లేదా..? అని అడిగేస్తున్నావు. ఇన్నాళ్లు మీ అమ్మ, కావ్య నిన్ను బాగా చూసుకున్నారు అందుకే మేము కనిపించలేదు.
సుభాష్: ఇప్పుడు అర్థమైందా..? ఇంట్లో ఆడదిక్కు లేకపోతే ఇల్లు ఎలా తయారవుతుందో అర్థమైందా..? ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకుని మీ అమ్మను కావ్యను ఇంటికి తీసుకురా
రుద్రాణి: ఈ ముసలిదాని కష్టం చూసి రాజ్ వాళ్ల అమ్మను తీసుకొస్తాడేమో అనుకుంటే మా అన్నయ్య ఇద్దరిని తీసుకురమ్మని చెప్తున్నాడు. కొంపదీసి రాజ్ కరిగిపోయి ఇద్దరినీ తీసుకొస్తాడా..? ఏంటి..?
అని రుద్రాణి మనసులో అనుకుంటుంది. తర్వాత రాజ్, కావ్యకు ఫోన్ చేస్తాడు. కావ్య ఆశ్చర్యంగా చూస్తుంది. అపర్ణ వచ్చి ఎవరు అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు అని అడుగుతుంది. మీ అబ్బాయి.. అత్తయ్య అంటుంది. ఒకవేళ మనసు మార్చుకుని ఫోన్ చేస్తున్నాడేమో లిఫ్ట్ చేయ్ అని చెప్తుంది. కావ్య లిప్ట్ చేయగానే ఇంట్లో జరిగిన విషయం చెప్పి నాన్నమ్మ, తాతయ్య ఫుడ్ లేక అల్లాడిపోతున్నారు నాన్నమ్మ చేయి కాల్చుకుంది అని కావ్యను తిడతాడు. రాజ్‌న అపర్ణ తిడుతుంది. అప్పు, కళ్యాణ్, ఆనామక ఇంటికి వెళ్తారు.
అప్పు: ఎవరిని ముంచాలని ఆలోచిస్తున్నావు.
అనామిక: ఏయ్ ఎవరు మిమ్మల్ని లోపలికి రానిచ్చారు.
అప్పు: ఆవేశపడకండి అనాముకురాలు గారు.
అనామిక: నేను అనామకురాలా…? నా సంగతి పక్కనపెట్టు ప్రస్తుతం మీరు అనామకులుగా బతుకుతున్నారు కదా..? అడుక్కుతినే పరిస్థితి రావాలని ఆరాటపడుతున్నట్టు ఉన్నారు.
అప్పు: అయ్యయ్యో చాలా ఆశలు పెట్టుకున్నట్టు ఉన్నావు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే నీ కళ్లు కుళ్లుకుంటాయి. నీ చెవులు చిల్లులు పడతాయి. చూడు
అంటూ రైటర్ ఇచ్చిన చెక్ అనామికకు చూపిస్తుంది అప్పు. నీలాగా అడ్డదారిలో నక్క తెలివి తేటలతో వచ్చిన డబ్బు కాదు ఇది. మా శ్రీవారు స్వశక్తితో సంపాదించిన డబ్బు ఇది. సక్సెస్ మా దగ్గరకు రావడానికి సిద్దంగా ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. కావ్య భోజనం రెడీ చేస్తుంది ఎవరికి అని అపర్ణ అడిగితే అమ్మమ్మ తాతయ్యలకు అని చెప్తుంది. వద్దని అపర్ణ, కనకం ఎంత చెప్పినా వినకుండా భోజనం తీసుకుని దుగ్గిరాల ఇంటికి వెళ్తుంది కావ్య. కావ్యను చూసిన రాజ్ ఎందుకొచ్చావని అడుగుతాడు. మా అమ్మమ్మ తాతయ్యలకు భోజనం తీసుకొచ్చానని చెప్తుంది కావ్య. రాజ్ కోపంగా కావ్యను తిడతాడు. సీతారామయ్య, ఇందిరాదేవి వచ్చి రాజ్ ను తిడతారు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!