Brahmamudi Serial Today November 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్: నిజం తెలుసుకున్న స్వప్న – ఒక్కటైన రుద్రాణి, స్వప్న
Brahmamudi serial today episode November 25th: స్వప్న, రుద్రాణి ఒక్కటై రాజ్, కావ్యలను తిట్టడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode: రాజ్ ఫోన్ తీసుకుని రాహుల్ దగ్గరకు వెళ్తుంది స్వప్న. ఎలా తీసుకొచ్చావని రాహుల్ అడగ్గానే.. కాల్ చేసుకుంటానని తీసుకొచ్చాను ముందు ఫోన్ ఓపెన్ చేసి చూడు అని చెప్తుంది. ఫోన్ చూసిన రాహుల్ షాక్ అయినట్టు నటిస్తాడు. ఆర్ ప్యాక్టరీ నిజంగా పెడుతున్నారు అని చెప్తాడు.
రాహుల్: నా అనుమానం నిజమే స్వప్న ఆర్ అనే పేరుతో కొత్త కంపెనీ పెడుతున్నారు.. త్వరలోనే ఓపెన్ చేయబోతున్నారు. దాని కోసం మన కంపెనీ నుంచి చాలా గోల్డ్‌ను లెక్కల్లో చూపించకుండా ఆ కంపెనీకి ట్రాన్స్‌ఫర్ కూడా చేస్తున్నారు.
స్వప్న: అంటే స్వరాజ్ కంపెనీలో గోల్డ్ మిస్ అయిందంటే అందరూ నిన్నే కదా తప్పు పడతారు
రాహుల్: అసలు ఆర్ ఫ్యాక్టరీ అంటే ఏంటి..? ఒకవేళ ఆర్ అంటే రాజ్ అయితే
స్వప్న: నువ్వు చెప్పింది నిజమయ్యే చాన్స్ ఉంది ఆర్ ఫ్యాక్టరీ అంటే రాజ్ ఫ్యాక్టరీయే
రాహుల్: ఇది కేవలం మన అనుమానం మాత్రమే స్వప్న నిజం ఏంటో తెలియకుండా రాజ్‌ను వెళ్లి అడగలేం కదా..? నాకు చాలా భయంగా ఉంది స్వప్న అసలు రాజ్ కావ్య ఇదంతా ఎందుకు చేస్తున్నారు
స్వప్న: ఈ ప్రశ్నలు అన్నింటికీ సమాధానం కావాలంటే రాజ్, కావ్యలను అడగాల్సిందే..
రాహుల్: అలా ఎలా అడుగుతాం.. మనకు పూర్తిగా ఏమీ తెలియదు కదా
స్వప్న: రాజ్, కావ్య అయితే ఆ కంపెనీకి ఫండ్స్ ట్రాన్సఫర్ చేసినట్టుగా ఈ ఫోన్ లో సాక్ష్యం అయితే ఉంది కదా..? దాని గురించే అడుగుదాం
రాహుల్: అలా అడిగితే పెద్ద గొడవ అవుతుందేమో స్వప్న
స్వప్న: గొడవ అయితే అవ్వని నిజం ఏంటో తెలుస్తుంది. కదా..? ఇప్పుడు మనం అడగకుండా వదిలేస్తే రేపు ఇంట్లో వాళ్లు అందరూ కూడా నిజం తెలిసినా నువ్వెందుకు చెప్పలేదు అని అందరూ నిన్ను తప్పు పడతారు
రాహుల్: అది కాదు స్వప్న ఇవాళ ఆంటీ, అంకుల్ వాళ్ల పెళ్లి రోజు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఈ టైంలో మనం వెళ్లి గొడవ చేస్తే..
స్వప్న: తప్పు జరుగుతుంది అని తెలిసినప్పనుడు వెంటనే వెళ్లి నిలదీయాలి రాహుల్.. లేదంటే అది మన మెడకే చుట్టుకుంటుంది. నేనే వెళ్లి అడుగుతాను
అంటూ స్వప్న వెళ్లిపోతుంది. కింద అందరూ సాంగ్స్ వేసుకుని డాన్స్ చేస్తుంటారు. స్వప్న వెళ్లి ప్లవర్ వాజ్ పగులగొడుతుంది.
ఇందిరాదేవి: నీకేం మాయ రోగం పట్టిందే.. బంగారం లాంటి ప్లవర్ వాజ్ ను అలా పగులగొట్టావు
స్వప్న: రాజ్..
ధాన్యలక్ష్మీ: ఏమైంది నీకు ఎందుకు అలా అరుస్తున్నావు
ఇందిరాదేవి: నిన్నటి నుంచి ఇది ఇలాగే చేస్తుంది. దెయ్యం ఏమైనా పట్టిందేమో
స్వప్న: నాకు దెయ్యం పట్టడం కాదు.. నీ మనవడు ఏం చేశాడో తెలిస్తే మీకు పడుతుంది దెయ్యం
రాజ్: ఏమైంది స్వప్న నేనేం చేశాను
స్వప్న: ఏం చేశావా..? ఆర్ ఫ్యాక్టరీ అంటే ఏంటి..? స్వరాజ్ గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్‌కు సంబంధం లేకుండా కొత్త కంపెనీని ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు.. ఈ కంపెనీ గురించి ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్ గా ఇలా చేయడానికి కారణం ఏంటి..?
అంటూ స్వప్న అడగ్గానే.. సీతారామయ్య షాక్ అవుతాడు. దీంతో అందరి మధ్య గొడవ జరుగుతుంది. ఇంతలో రాజ్ కల్పించుకుని ఆర్ ఫ్యాక్టరీ అంటే రాహుల్ ఫ్యాక్టరీ అని నిజం చెప్తాడు. రుద్రాణి నమ్మదు. దీంతో రాజ్, కావ్య ఫ్రూప్స్ చూపించగానే.. స్వప్న ఏడుస్తూ కావ్యకు సారీ చెప్తుంది. రాహుల్ కూడా సారీ చెప్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!



















