Brahmamudi Serial Today May 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : కళ్యాణ్‌ను లేచిపోదామన్న అప్పు – కావ్యను కిడ్నాప్ చేసిన రౌడీలు
Brahmamudi Today Episode: అప్పు కళ్యాణ్ తో లేచి పోదామనడం, మరోవైపు కావ్యను రౌడీలు కిడ్నాప్ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Brahmamudi Serial Today Episode : అప్పు.. కావ్యకు ఫోన్ చేస్తుంది. నువ్వు చెప్పిన లోకేషన్‌కు వచ్చానని చెప్తుంది. దీంతో కావ్య నేను అక్కడి నుంచి కొద్ది దూరం వచ్చానని చెప్పి లోకేషన్ చెప్తుంది. అప్పు.. కావ్య చెప్పిన లోకేషన్‌కు వస్తుంది. లేడీ కిడ్నాపర్ కావ్యను ఊరి చివరకు తీసుకెళ్తుంది. ఇంతలో కిడ్నాపర్ల కారు వస్తుంది. కావ్యను కిడ్నాప్ చేస్తారు. కావ్యను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లడం అప్పు చూసి కారు వెనక పరిగెడుతుంది. కారు స్పీడుగా వెళ్లిపోతుంది. అప్పు ఆగిపోయి రాజ్ కు ఫోన్ చేస్తుంది. రాజ్ ఆఫీసు సెక్యూరిటీ గార్డుతో మాట్లాడుతుంటాడు. మరోవైపు అప్పు టెన్షన్‌తో రాజ్ కు ఫోన్ చేస్తుంటుంది. ఇంతలో రాజ్ ఫోన్ స్విచ్చాఫ్ అవుతుంది. కావ్యకు అంతా తెలిసే ఏమీ తెలియనట్టు నా ముందు నటించిందా? అంటూ రాజ్ వెళ్లిపోతుంటాడు. అప్పు, కళ్యాణ్‌కు ఫోన్ చేస్తుంది. కళ్యాణ్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడు. దీంతో డైరెక్టుగా ఇంటికి వెళ్లి బావకు చెప్పాలని వెళ్తుంది అప్పు. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో కళ్యాణ్, అనామికల పంచాయతీ నడుస్తుంది.
కళ్యాణ్: నేను పుట్టి పెరిగిన ఇన్ని సంవత్సరాలలో ఇంట్లో ఎవరి వల్ల బాధపడలేదు. కానీ నీ వల్ల చాలా బాధపడ్డాను. ఇంట్లో ప్రతి చిన్న విషయానికి గోడవ చేస్తున్నావు. అర్థం చేసుకోవడానికన్నా.. అపార్థం చేసుకుంటున్నావు. ఎప్పుడూ ఏ తప్పు చేయని నన్ను పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెట్టావు. ఇన్ని చేసి నీవల్ల నేనేం బాధపడుతున్నావని కొత్తగా అడుగుతున్నావేంటి. నువ్వు అడుగుపెట్టినప్పటి నుంచి నేను ప్రశాంతంగా నిద్రపోయింది లేదు.
ఇందిరాదేవి: ఇద్దరూ సర్దుకుపోతేనే కదా సమస్య తీరేది.
కళ్యాణ్: లేదు నాన్నమ్మా సంస్కారం తెలియని పెళ్లాంతో సంసారం సవ్యంగా సాగదు.
అనామిక: అంటే ఏమంటున్నావు ఇప్పుడు?
కళ్యాణ్: నేను నీకు విడాకులు ఇద్దామనుకుంటున్నాను.
అని కళ్యాణ్ అనగానే అందరూ షాక్ అవుతారు. ఇంట్లో అందరూ కళ్యాణ్‌కు సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా కళ్యాణ్ ఉలకడు.. పలకడు..దీంతో అనామిక మా మధ్య ఆ అప్పు వల్లే గొడవలు అని చెప్తుండగానే అప్పు పరుగెత్తుకుంటూ దుగ్గిరాల ఇంట్లోకి వస్తుంది.
అనామిక: చూశారా? కళ్యాణ్ విడాకులు ఇస్తానని ఎందుకు అన్నాడో ఇప్పుడైనా అర్థం అయిందా?
కళ్యాణ్: మళ్లీ అప్పు గురించి తప్పుగా మాట్లాడితే బాగుండదు.
రుద్రాణి: అనామిక మాట్లాడిన దాంట్లో తప్పేముందిరా? దేని గురించైతే గొడవ జరుగుతుందో ఆ పిల్ల సమయానికి ఇప్పుడే రావాలా? మీరిద్దరూ కలిసి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? ఏంటి?
అప్పు: ఏం బాగోతం జరుగుతుంది ఇక్కడ?
స్వప్న: అనామికకు కళ్యాణ్‌కు నీవల్లే గొడవలు జరుగుతున్నాయి అంట. అందుకే అనామిక పంచాయతీ పెట్టిచింది.
ధాన్యలక్ష్మీ: ఏం తల్లీ పోలీస్‌స్టేషన్ దాకా వెళ్లినా నీకింకా బుద్ది రాలేదా? వీళ్లీద్దర్నీ విడదీసేదాకా నిద్రపోవా?
అనగానే అప్పు ధాన్యలక్ష్మీ మీద ఫైర్ అవుతుంది. నీ కొడుకు కోడలు జగదేకవీరుడు అతిలోక సుందరి అనుకున్నావా? అంటూ ధాన్యలక్ష్మీని తిడుతూ కళ్యాణ్‌ను లేచిపోదాం దా అంటూ వీళ్లు అనుకున్నదే నిజం చేద్దాం అంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. తర్వాత నీలాంటి వాణ్ని ఇంత కష్టపెడతున్నారు. అంటూ తిట్టి వెళ్లిపోతుంది. ఇంట్లో అందరూ కలిసే ఉండాలని కళ్యాణ్‌కు నచ్చజెప్తారు. మరోవైపు కావ్యను కిడ్నాప్ చేసిన రౌడీలు ఒక డెన్‌కు తీసుకెళ్తారు. అక్కడ చీకటి గదిలో పడవేస్తారు. ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారని అడిగితే నిన్ను విదేశాలకు అమ్మేయడానికి అని రౌడీలు చెప్పడంతో కావ్య భయపడుతుంది. మరోవైపు అప్పు రాజ్ కోసం వెయిట్ చేస్తుంటుంది. ఇంతలో రాజ్ వస్తాడు. కావ్యను కిడ్నాప్ చేసినట్లు అప్పు చెప్పగానే రాజ్ షాక్ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ : సత్యభామ సినిమా గురించి మాట్లాడిన కాజల్