Brahmamudi Serial Today March 1st: ‘బ్రహ్మముడి’ సీరియల్: మళ్లీ కలుసుకున్న అప్పు కళ్యాణ్ - బావతో కలిసి పుట్టింటికి పయనమైన కావ్య
Brahmamudi Today Episode: కవితలు తీసుకుని తనని తాను నిరూపించుకంటానని కళ్యాణ్ వెళ్లిపోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: ఖైరతాబాద్ బ్రాంచ్ పేపర్స్ కల్యాణ్‌కు ఇస్తూ ఆ బ్రాంచ్ చూసుకోమ్మని చెబుతాడు రాజ్. నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావ్ అన్నయ్య అని కల్యాణ్ అంటాడు. ఇంతలో కావ్య అక్కడకు వచ్చి నీ మంచి కోసమే మీ అన్నయ్య చెబుతున్నారు అనగానే.. మనసుకు నచ్చిన పని చేయమని మీరే కదా అన్నారు అని కల్యాణ్ అంటాడు.
కావ్య: అది చేస్తూనే ఇది కూడా చేయండి.
కళ్యాణ్: నా వల్ల కాదు వదినా నా మనసుకు నచ్చని పని చేయలేను. ఇన్ని రోజులు ఆఫీస్‌కు వెళ్లి నటించింది చాలు. అలసిపోయాను. నాకు నచ్చిందే చేస్తాను
అనామిక: అంటే ఏం చేయబోతున్నారు
కళ్యాణ్: నీకు చెప్పినా అర్థం కాదు. అర్థం చేసుకోవాన్న మనసు అంతకన్నా లేదు.
అనామిక: అంటే, మళ్లీ నన్ను బాధపెట్టాలని అనుకుంటున్నారా?
కళ్యాణ్: నేను నిన్ను బాధ మాత్రమే పెడుతున్నాను. కానీ, నువ్వు మాత్రం నా మనసు ముక్కలు చేశావ్ అని కల్యాణ్ అంటాడు.
నీ భార్య నీ మంచి కోసమే కదరా చెబుతోంది అని ధాన్యలక్ష్మీ అంటే.. పాతికేళ్ల వచ్చినవాడికి ఏది మంచి ఏది చెడు అని చెబితే జెనరేషన్ తాలుకూ అర్థమేముంది అని కల్యాణ్ అంటాడు. శభాష్ రా కల్యాణ్. నేను నిన్ను సపోర్ట్ చేస్తాను అని తండ్రి ప్రకాశం అంటాడు. నాకు ఏది చేతకాదు అని కొందరు ఇక్కడ అనుకుంటున్నారు. నేనేంటో నిరూపించాలని వెళ్తున్నాను. నా కవితలను ఎవరైనా పబ్లిష్ చేస్తారో వెళ్లి ట్రై చేస్తాను అని కల్యాణ్ అంటాడు. దానికి ఇంకొకరి దగ్గరికి వెళ్లడం ఎందుకురా. ఎంత అవుతుందో చెప్పు. మనమే పబ్లిష్ చేద్దాం అని రాజ్ అంటాడు. ఇది నా అస్థిత్వం కోసం చేస్తున్నా పోరాటం అని కల్యాణ్ అంటాడు. తర్వాత ఓ ఆఫీస్‌లో కల్యాణ్ కవితలను చదివిన పబ్లిషర్ చాలా బాగున్నాయని, మంచి ఫీల్‌తో రాశాని పొగుడుతాడు. కానీ, పబ్లిష్ చేయనని అంటాడు. దీంతో కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు కల్యాణ్‌కు కవితలు బాగున్నాయి. స్టోరీ డెవలప్ చేసేందుకు వస్తారా అని కాల్ వస్తుంది. నేను కవితలు, పాటలు తప్పా స్టోరీస్ రాయలేనని కళ్యాణ్ వాళ్లకు చెప్తాడు. కారు దిగి ఓ చోట కొబ్బరిబొండాం తాగుతాడు కళ్యాణ్. కల్యాణ్ దగ్గర డబ్బులు లేకపోవడంతో అప్పు వచ్చి ఇస్తుంది. తర్వాత అప్పుకు జరిగిందంతా చెబుతాడు కల్యాణ్.
అప్పు: నువ్ అనుకున్నది సాధించాకా వాళ్లే నిన్ను గొప్పగా ఫీల్ అవుతారు
కళ్యాణ్: ఒకవైపు అనామికను బాధ పెడుతున్నాను. నన్ను అనామిక అర్థం చేసుకోలేదని మరోవైపు బాధగా ఉంది. నువ్ కూడా నన్ను లవ్ చేశావ్ గా అలా ఎప్పుడు సాధించలేదు కదా మరి ఎందుకు అనామిక నన్ను అంతలా సాధిస్తుంది.
అప్పు: కొడుక్కి జాబ్ రాకుంటే తండ్రి అరుస్తాడు. నిలదీస్తాడు. అంతమాత్రానా ఆ తండ్రికి ప్రేమ లేనట్లు కాదు. అవన్నీ పక్కన పెట్టి నీ పని మీద ఫోకస్ పెట్టు
కళ్యాణ్: అవును, అది కూడా నిజమే. థ్యాంక్స్ అప్పు. ఎప్పుడు నాలో ఆత్మవిశ్వాసం పెంచుతావ్
అని కల్యాణ్ చెప్పగానే తర్వాత తాను పోలీస్ అవ్వాలని అనుకుంటున్నట్లు చెబుతుంది అప్పు. నువ్ కచ్చితంగా సాధిస్తావ్. ఆల్ ది బెస్ట్ అని చేయి ఇస్తాడు కల్యాణ్. మరోవైపు రాజ్ తనని పట్టించుకోని విషయం ఇందిరాదేవికి చెబుతుంది కావ్య. కళ్యాణ్ గురించి బాధపడుతూ నిన్ను పట్టించుకోవడం లేదని బామ్మ చెబుతుంది. మీరు పుట్టింటికి వెళ్తున్నట్లు, అక్కడికి రాజ్ వచ్చేలా చేయాలని బామ్మ చెప్తుంది. దీంతో కావ్య తాను పుట్టింటికి వెళ్తున్నానని రాజ్‌కు చెబుతుంది. దాంతో సంతోషంగా వెళ్లిరా.. నేను చాలా ప్రశాంతంగా ఉంటాను అని రాజ్ అంటాడు. అయితే కావ్య వాళ్ల బావ కూడా కావ్యతో వెళ్తున్నాడని తెలుసుకుని రాజ్ ఇరిటేటింగ్‌గా ఫీలవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: నిహారిక సమర్పణలో 'సాగు' - ఏకంగా 16 ఓటీటీల్లో విడుదల