Niharika Konidela: నిహారిక సమర్పణలో 'సాగు' - ఏకంగా 16 ఓటీటీల్లో విడుదల
Saagu Movie OTT Release: మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో ఓ ఇండిపెండెంట్ ఫిల్మ్ 'సాగు' మార్చి 4న ఓటీటీల్లో విడుదలవుతోంది. ఏకంగా 16 ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది.
మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) నటి మాత్రమే కాదు... నిర్మాత కూడా! పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి... యూట్యూబ్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ 'సాగు' (Saagu Movie) నచ్చి తన సమర్పణలో విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
మార్చి 4న 'సాగు' విడుదల
Saagu Independent Film Release Date: వంశీ తుమ్మల, హారిక బల్ల జంటగా నటించిన సినిమా 'సాగు'. ఇదొక ఇండిపెండెంట్ ఫిల్మ్. వినయ్ రత్నం దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని డా. యశస్వి వంగా నిర్మించారు. మార్చి 4న ఓటీటీల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ నచ్చడంతో నిహారిక సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.
ఏకంగా 16 ఓటీటీల్లో 'సాగు' స్ట్రీమింగ్
Saagu Streaming Platforms: వీలైనంత ఎక్కువ మంది వీక్షకులకు 'సాగు'ను చూపించడమే లక్ష్యంగా వివిధ ఓటీటీల్లో సినిమా స్ట్రీమింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ, టాటా స్కై బింగ్, ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్, ఎంఎక్స్ ప్లేయర్స్, హంగామా, జెసాన్, వ్యూయిడ్, యాక్ట్, నెట్ ప్లస్ బ్రాండ్, విఐ, ఫైర్ టీవీ స్టిక్, ఎంఐ, ఎల్.జి, వన్ ప్లస్ టవీ, క్లౌడ్ వాకర్, వాచో... ఇలా ఏకంగా 10 ఓటీటీ మాధ్యమాల్లో సినిమా విడుదల కానుంది.
వ్యవసాయదారులకు హోప్ ఇచ్చేలా...
మార్చి 4న 'సాగు' విడుదల కానున్న సందర్భంగా గురువారం కొందరికి సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. నిహారిక మాట్లాడుతూ... ''నాకు ఈ సినిమా ఎంతో ప్రత్యేకం. జీవితంలో మనకు చాలా ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. కానీ, హోప్ వదలకుండా ముందుకు వెళ్లాలనుకుంటాం. వ్యవసాయదారులకు ఎంతో హోప్ ఇచ్చేలా 'సాగు' ఉంటుంది. 52 నిమిషాల నిడివి గల ఈ సినిమాను కేవలం 4 రోజుల్లో షూట్ చేశారు. ఇటువంటి యంగ్ టీంను సపోర్ట్ చేయడం ఎప్పుడూ ఆనందమే. ఇంత మంచి సినిమాను నా దగ్గరకు తీసుకొచ్చిన అంకిత్‌కు థాంక్స్. రైతుల కష్టాల్ని నేను దగ్గరుండి చూడలేదు. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం సంతోషంగా ఉంది'' అని చెప్పారు.
Also Read: 'గుంటూరు కారం' ఇంటికి వెళ్లిన చిరంజీవి, త్రిష
దర్శకుడు వినయ్ రత్నం మాట్లాడుతూ... ''మాకు ఎంతో సపోర్ట్ చేసిన నిహారిక గారికి థాంక్స్. రైతుల గురించి చెప్పాలని సాగు తీశా. కులం, డబ్బు, సమాజం... ఎన్ని మనల్ని ఆపినా, సమస్య ఎటువంటిదైనా ఆత్మహత్య పరిష్కారం కాదనే సందేశాన్ని ఇవ్వాలని తీశా'' అన్నారు. తాను ఆరేడేళ్లుగా షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాని, నిహారిక గారి వల్ల ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చిందని నటుడు వంశీ చెప్పారు. 'సాగు' తనకు ఎంతో గుర్తింపు ఇచ్చిందని, ఈ సినిమా వల్ల తనకు పేరు వచ్చిందని నటి హారిక బల్ల సంతోషం వ్యక్తం చేశారు. 'సాగు' సమర్పణ కాకుండా తన నిర్మాణ సంస్థలో నిహారిక మరో సినిమా చేస్తున్నారు.
Also Read: గూస్ బంప్స్ గ్యారెంటీ - ఆపరేషన్ వాలెంటైన్ ఫస్ట్ ట్విట్టర్ రివ్యూ చూశారా?