Chiranjeevi: 'గుంటూరు కారం' ఇంటికి వెళ్లిన చిరంజీవి, త్రిష
Vishwambhara movie shooting location: మెగాస్టార్ చిరంజీవి, సౌత్ క్వీన్ త్రిష జంటగా నటిస్తున్న సినిమా 'విశ్వంభర'. వాళ్లిద్దరూ 'గుంటూరు కారం' ఇంటికి వెళ్లారు. ఎందుకంటే?
సంక్రాంతికి థియేటర్లలో విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా 'గుంటూరు కారం'. అందులో హీరో ఇల్లు ఉంది కదా! ఇప్పుడు ఆ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి, సౌత్ క్వీన్ త్రిష వెళ్లారు. ఎందుకు? అంటే...సినిమా కోసమే! వాళ్లిద్దరూ జంటగా నటిస్తున్న తాజా సినిమా 'విశ్వంభర'. ఆ సినిమా చిత్రీకరణ 'గుంటూరు కారం' హౌస్‌లో జరుగుతోంది. చిరు, త్రిషతో పాటు మరికొంత మంది ప్రధాన తారాగణం పాల్గొనగా... ఓ పాటను తెరకెక్కిస్తున్నారని తెలిసింది. ఆ పాటకు శోభి మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
'విశ్వంభర' సినిమాకు తగ్గట్టు ఆ ఇంటిలో కొన్ని మార్పులు చేశారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సోషియో ఫాంటసీ జానర్‌లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'గుంటూరు కారం' ఇల్లు 'విశ్వంభర'లో ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: గూస్ బంప్స్ గ్యారెంటీ - ఆపరేషన్ వాలెంటైన్ ఫస్ట్ ట్విట్టర్ రివ్యూ చూశారా?
View this post on Instagram
నల్గొండలో కీలక సన్నివేశాలు...
Chiranjeevi new movie update: హైదరాబాద్ సాంగ్ షూటింగ్ కంటే ముందు నల్గొండలో రెండు మూడు రోజుల పాటు కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. 'విశ్వంభర' చిత్రానికి వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్ బస్టర్ 'బింబిసార' తర్వాత ఆయన తీస్తున్న చిత్రమిది. యువి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
త్రిషతో పాటు మరో హీరోయిన్ కూడా!
'విశ్వంభర' సినిమాలో త్రిష మెయిన్ హీరోయిన్. గతంలో చిరు సరసన 'స్టాలిన్'లో ఆమె నటించారు. అయితే, సుమారు 18 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ జోడీ సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయనుంది. సినిమాలో త్రిషతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లకు కూడా చోటు ఉంది. ఓ పాత్రకు శర్వానంద్ 'ఎక్స్ ప్రెస్ రాజా', ధనుష్ 'రఘువరన్ బీటెక్', నాని 'జెంటిల్ మన్' ఫేమ్ సురభిని ఎంపిక చేశారు. మరొక పాత్రకు ఎవర్ని ఎంపిక చేస్తారో చూడాలి.
Also Read: వెన్నెల కిశోర్ ఫ్యాన్స్ రెడీనా - చారి 111 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది
ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో 13 సెట్స్ వేశారు. సోషియో ఫాంటసీ యాక్షన్ సినిమాగా రూపొందుతోంది. వశిష్ఠ దర్శకుడిగా పరిచయమైన 'బింబిసార' కూడా ఆ తరహా చిత్రమే. అందుకని మంచి బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. ఓవర్సీస్ రైట్స్ కోసం సుమారు 18 కోట్లకు పైగా కోట్ చేసినట్లు టాక్. ఇందులో విలన్ రోల్ రానా దగ్గుబాటి చేస్తారని ప్రచారం జరిగింది. అయితే, చిత్ర బృందం ఏమీ చెప్పలేదు. విలన్ వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైన్ : ఏఎస్ ప్రకాష్, కాస్ట్యూమ్ డిజైనర్ : సుశ్మితా కొణిదెల, కూర్పు : కోటగిరి వెంకటేశ్వర రావు & సంతోష్ కామిరెడ్డి, మాటలు : సాయి మాధవ్ బుర్రా, పాటలు : శ్రీ శివ శక్తి దత్తా & చంద్రబోస్, స్క్రిప్ట్ అసోసియేట్స్ : శ్రీనివాస గవిరెడ్డి - గంటా శ్రీధర్ - నిమ్మగడ్డ శ్రీకాంత్ - మయూఖ్ ఆదిత్య, ఛాయాగ్రహణం : ఛోటా కె. నాయుడు, సంగీతం : ఎంఎం కీరవాణి.