Brahmamudi Serial Today May July 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాహుల్‌ను చీకొట్టిన దుగ్గిరాల ఫ్యామిలీ – మొగుడి పోస్ట్ నుంచి పనోడిగా మారిన రాహుల్
Brahmamudi Today Episode: రాహుల్ చేసిన నిర్వాకం ఇంట్లో వాళ్లకు చెప్తుంది స్వప్న దీంతో అందరూ కలిసి రాహుల్ ను పనోడిగా మార్చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode: ఆఫీసులో ఎవ్వరూ తనను చూసి భయపడటం లేదని రాజ్ అందరినీ ఉద్యోగాల్లోంచి తీసేస్తున్నాను అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతలో కావ్య వస్తుంది.
కావ్య: సూపర్ సార్ సూపర్… ఏంటి అందరూ అలా చూస్తున్నారు. ఓ సార్ మిమ్మల్ని ఫైర్ చేస్తుంటే.. నేను వచ్చి సూపర్ అంటూ క్లాప్స్ కొడుతున్నానేంటి అనా..? మీరేం కంగారు పడకండి ఇది నిజమైన ఫైర్ చేయడం కాదు. ఉత్తుత్తి ఫైరే
రాజ్: ఉత్తుత్తి ఫైర్ ఏంటి కళావతి గారు నేను నిజంగానే వీళ్లందరినీ ఉద్యోగాల్లోంచి తీసేస్తున్నాను
కావ్య: ఇక మీ పెర్మామెన్స్ ఆపండి సార్ ఇదంతా ఎంప్లాయీస్‌ను అలెర్ట్ చేయడానికి మీరు చేసిన ఫ్రాంక్ అని చెప్పండి
రాజ్: ఏంటి..? ఫ్రాంకా..?
కావ్య: అవును సార్ ఫ్రాంకే.. మీరంతా వెళ్లండి అందరూ మీ పని చూసుకోండి వెళ్లండి
అని చెప్పగానే అందరూ వెళ్లిపోతారు. రాజ్‌ను తీసుకుని కావ్య ఇంటికి వెళ్తుంది. ఇంట్లో రాహుల్‌ను లాక్కొచ్చి రుద్రాణి కాళ్ల దగ్గర పడేస్తుంది స్వప్న. అందరూ షాక్ అవుతారు.
రుద్రాణి: ఎంత ధైర్యం ఉంటే కట్టుకున్న మొగుణ్ని అలా తోస్తావు అది నా కళ్ల ముందే
స్వప్న: కట్టుకున్న మొగుడు కాబట్టే ఇంటికి తీసుకొచ్చి మీ అందిరి ముందు నిలబెట్టాను. అదే వేరే ఎవరైనా మీ కొడుకు చేసిన పని చేసి ఉంటే అక్కడే చంపేసేదాన్ని
రుద్రాణి: ఇరవై నాలుగు గంటలు నా కొడుకు మీద పడి ఏడవడం తప్పా మీకు వేరే పని లేదా..?
స్వప్న: అవును మరి మీరు పెద్ద సెలబ్రిటీలు మీ ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడానికి మీద పడుతున్నాము
ఇందిరాదేవి: అసలు ఏం జరిగిందో ఎందుకు అంతలా అరుస్తున్నావు
స్వప్న: ఏం జరిగిందో మీ మనవణ్నే అడగండి అమ్మమ్మ ఆ దరిద్రాన్ని నా నోటితో చెప్పాలంటే నాకే అసహ్యంగా ఉంది
అపర్ణ: రాహుల్ మళ్లీ ఏం చేశావు నువ్వు
ప్రకాష్: ఏముంటుంది వదిన మళ్లీ ఏదో వెధవ పని చేసి ఉంటాడు. దానికి స్వప్నకు కోపం వచ్చి ఉంటుంది
రుద్రాణి: అనండి అందరూ నా కొడుకునే అనండి ఇంట్లో తిట్టడానికైనా కొట్టడానికైనా తేరగా దొరికేది మేమే కదా..?
స్వప్న: నీ కొడుకు ఏం చేశాడో నిజం చెప్తే ఇంట్లో వాళ్లే అందరూ కొడతారు.
అని రాహుల్ నగలు తీసుకెళ్లి లవర్‌కు ఇచ్చిన విషయం చెప్తుంది స్వప్న
రుద్రాణి: నువ్వు చెబితే నమ్మాలా.? అసలే నీకు నా కొడకంటే కోపం ఉంది..?
అప్పు: ఇది చెబితే నమ్ముతావా..? దీనికే రాహుల్ నగలన్నీ ఇచ్చారు. ఏంటి అలా చూస్తున్నావు జరిగింది మొత్తం చెప్పు
రాహుల్ లవర్: అవునండి అప్పు మేడం చెప్పింది నిజమే నేనేం అడగలేదు. నేను అందంగా ఉంటానని నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఏడు వారాల నగలు నాకు ఇచ్చాడు
రాజ్: చూడ్డానికి ఇన్నోసెంట్‌గా ఉంటాడు కానీ రాహుల్ మంచి రసికుడే
కావ్య: చాల్లే ఊరుకోండి రామ్ గారు..
ఇంట్లో అందరూ రాహుల్‌ను తిట్టి, ఆయన లవర్‌ను వెళ్లగొడతారు. ఇక నుంచి ఇంట్లో పనులన్నీ రాహులే చేయాలని అందరూ డిసైడ్ అవుతారు. రూంలోకి వెళ్లిన తర్వాత రుద్రాణి కోపంగా రాహుల్‌ను కొడుతుంది. ఎన్ని సార్లు చెప్పినా మారవా అంటూ తిడుతుంది. రాహుల్ సారీ చెప్పినా వినదు రుద్రాణి. మరోవైపు రాజ్ యామినికి ఫోన్ చేసి ఇవాళ రాత్రికి రావడం లేదని కళావతిగారితో మీటింగ్ ఉందని చెప్తాడు. దీంతో యామిని ఇరిటేటింగ్ గా ఫీలవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!






















