Brahmamudi Serial Today July 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్, కావ్యల డిన్నర్ ఆపేందుకు రాహుల్ ప్లాన్ - రాహుల్ కు మోషన్స్ టాబ్లెట్స్ ఇచ్చిన స్వప్న
Brahmamudi Today Episode: రాజ్, కావ్య లు డిన్నర్ కు వెళ్లకుండా ఆపేందుకు ప్రయత్నిస్తున్న రాహుల్ కు స్వప్న జ్యూస్ లో మోషన్ టాబ్లెట్ కలిపి ఇవ్వడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఫన్నీగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: నేను సంవత్సరం నిన్ను దూరంగా పెట్టానని అదంతా ఒక్కరోజే నన్ను టార్చర్ పెడుతున్నావు అంటూ రాజ్ అనగానే కావ్య కోప్పడుతుంది. దీంతో ఇదంతా వద్దు కానీ ఇవాళ మనం డిన్నర్‌కు వెళ్దాం పద అంటాడు రాజ్. అలా అడిగితే ఎలా వస్తానని ఒక భర్త భార్యను అడిగినట్లు అడగమని చెప్తుంది. దీంతో రాజ్ ప్రేమగా అడగ్గానే కావ్య సరేనని చెప్పి లోపలికి వెళ్తుంది. దూరం నుంచి అంతా విన్న రుద్రాణి డిన్నర్‌కు వెళ్తారా? ఎలా వెళ్తారో చూస్తానని లోపలికి వెళ్తుంది.
రుద్రాణి: రాహుల్ నువ్వు అర్జెంట్‌గా ఒక పని చేయాలిరా?
రాహుల్: అసలు కుదరదు మమ్మీ నాకు ఒక హవర్‌లో మీటింగ్ ఉంది త్వరగా వెళ్లాలి.
రుద్రాణి: నువ్వేమైనా ఎంప్లాయి అనుకుంటున్నావా? టైంకు వెళ్లాలి అనడానికి.. బాస్‌వే కదా కాస్త ఆలస్యంగా వెళితే వచ్చే నష్టంమేమీ లేదు.
రాహుల్: పని చేయకపోతే చేయ్యలేదంటావు. చేస్తుంటే ఇలా అడ్డుపడితే ఎలా? సరే ఏంటో చెప్పు
రుద్రాణి: రాజ్, కావ్యను డిన్నర్‌కు తీసుకువెళ్లాలనుకుంటున్నాడు.
రాహుల్: అయితే ఏంటి?
రుద్రాణి: నీకు అసలు విషయం తెలియక అయితే ఏంటి అంటున్నావు. రాజ్ తన మనసులో ఉన్న ప్రేమను కావ్యకు చెప్పి దగ్గరవ్వాలనుకుంటున్నాడు. అదే కనక జరిగితే కావ్య మన నెత్తిన ఎక్కుతుంది.
అని చెప్పగానే రాహుల్ అర్థం అయ్యింది మామ్ అంటూ రాజ్‌ను అఫీసుకు రమ్మని చెప్తాను. నాతో పాటే ఆఫీసుకు తీసుకువెళ్తాను. అనగానే చాటు నుంచి అంతా విన్న స్వప్న దొంగ ముఖాల్లారా ఇదా మీ ప్లాన్ అంటూ వెళ్లి మోషన్స్ అయ్యే టాబ్లెట్ కలిసిన జ్యూస్ తీసుకుని వచ్చి రోమాంటిక్‌గా మాట్లాడి రాహుల్ చేత జ్యూస్ తాగిస్తుంది. తర్వాత రాజ్, కావ్య వెళ్తుంటే వెళ్లి రాహుల్ ఆపుతాడు.
రాహుల్: నేను వస్తాను రాహుల్
స్వప్న: పెళ్లాం, మొగుడు కలిసి వెళ్తుంటే మధ్యలో నువ్వు దూరిపోయి కలిసి వెళ్తానంటావేంటి రాహుల్
రాహుల్: కలిసి వెళ్లేది ఆఫీసుకే కదా?
రాజ్: మేము ఆఫీసుకే వెళ్తున్నామని నీకెవరు చెప్పారు.
రాహుల్: ఇవాళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది కదా?
రాజ్: ఉంది. అది డాడీ బాబాయ్ చూసుకుంటారు కదా?
రాహుల్: ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ రాజ్.
కావ్య: ఏవండి ఈ మీటింగ్ ఇంపార్టెంట్ మీటింగ్ అని మీకు ఎవరూ ఎందుకు చెప్పలేదు. ఒకసారి ఫోన్ చేయండి.
అనగానే రాహుల్ వద్దని నువ్వు ఆఫీసుకు రావాల్సిందేనని పట్టుబడతాడు. అంత ఇంపార్టెంట్ అయితే డాడీ నాకు చెప్పేవారు కదా అంటాడు రాజ్. ఇంతలో రాహుల్ కడుపులో ఇబ్బందిగా అనిపించి పైకి పరుగెత్తుకెళ్తాడు. మీరిద్దరూ మొదటిసారి డిన్నర్‌కు వెళ్తున్నారు హ్యాపీగా వెళ్లిరండి మీటింగ్ సంగతి సుభాష్ అంకుల్ చూసుకుంటారని స్వప్న చెప్పగానే కావ్య, రాజ్ వెళ్లిపోతారు. మరోవైపు రాహుల్ ఒకపక్క అప్పు మరోపక్క పోకిరీలు అన్న మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటారు. కళ్యాణ్ అప్పుకు ఫోన్ చేసి ఒకసారి కలుద్దామని అడగ్గానే వద్దని అప్పు ఫోన్ కట్ చేస్తుంది. దీంతో కళ్యాణ్ కవితలు రాసుకుంటాడు. మరోవైపు డిన్నర్‌కు వెళ్లిన రాజ్, కావ్య హ్యాపీగా ఉంటారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: అల్లు అర్జున్, సుకుమార్ గొడవపై స్పందించిన బన్నీ వాసు