అన్వేషించండి

Bunny Vasu: అల్లు అర్జున్, సుకుమార్ గొడవపై స్పందించిన బన్నీ వాసు

అల్లు అర్జున్, సుకుమార్ మధ్య గొడవ జరిగినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో నిర్మాత బన్నీ వాసు క్లారిటీ ఇచ్చారు. మీడియాల్లో వస్తున్న వార్తలన్నీ వాస్తవాలకు దూరంగా ఉన్నాయన్నారు.

Bunny Vasu Pushpa 2 Rumors: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ దేశ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగించిన ఈ సినిమా, పలు ప్రతిష్టాత్మక అవార్డులను కూడా దక్కించుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు ఏకంగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ‘పుష్ప 2’ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ మూవీ కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ సినిమా చాలా రోజుల క్రితమే విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించినా పలుమార్లు వాయిదా పడింది. చివరకు డిసెంబర్ 6న విడుదల అవుతుందని వెల్లడించారు.

బన్నీ-సుకుమార్ మధ్య గొడవ

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ హాట్ న్యూస్ సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ వీడియాలో వైరల్ అయ్యింది. అల్లు అర్జున్, సుకుమార్ మధ్య గొడవ జరిగిందనేది ఆ వార్తల సారాంశం. ఇద్దరు గొడవపడి సుకుమార్ అమెరికాకు వెళ్లిపోతే, అల్లు అర్జున్ దుబాయ్ వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది. సుకుమార్ షూటింగ్ విషయంలో డిలే చేస్తున్నందుకే బన్నీకి కోపం వచ్చిందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, బన్నీ తన గడ్డం కూడా ట్రిమ్ చేసుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ రూమర్స్ ఇండస్ట్రీలో సంచలనం కలిగిస్తున్నాయి.  

అల్లు అర్జున్-సుకుమార్ గొడవపై బన్నీవాసు క్లారిటీ

తాజాగా ఈ బన్నీ, సుకుమార్ గొడవ గురించి వస్తున్న వార్తలపై నిర్మాత బన్నీ వాసు స్పందించారు. ‘ఆయ్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. “’ఆయ్’ సినిమా ప్రమోషన్ లో సుకుమార్ విషయం గురించి మాట్లాడితే కరెక్ట్ కాదు. ఆ విషయం చెప్తే.. ఈ సినిమా ప్రమోషన్ మొత్తం ఎగిరిపోతుంది. నిజం చెప్పాలంటే, రెండు రోజుల క్రితం బన్నీ, సుకుమార్ గొడవకు సంబంధించి ఓ ఫ్రెండ్ పంపితే రెండు మూడు ఆర్టికల్స్ చదివాను. లోపల ఏం జరుగుతుంది? అనేది సుకుమార్ గారు, బన్నీ గారు, ప్రొడ్యూసర్స్ తర్వాత అత్యంత సన్నిహితంగా తెలిసింది నాకే. ఆ ఆర్టికల్ చూసి నవ్వుకున్నాం. మాకు పబ్లిసిటీ బాగా వస్తుంది. ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్నారు. అలాగే కానివ్వండి అనుకున్నాం. ‘పుష్ప 2’ సినిమాలో బన్నీగారు మరో 15 రోజులు కేటాయిస్తే సరిపోతుంది. క్లైమాక్స్, ఓ సాంగ్ మాత్రమే పెండింగ్ లో ఉంది. సుకుమార్ గారు చెప్పిందేంటంటే? ముందుగా ఎడిటింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత బన్నీ పార్ట్ కంప్లీట్ చేయాలంటున్నారు. ఒకేసారి క్లైమాక్స్, సాంగ్ తో పాటు ప్యాచ్ వర్క్ కూడా తీసేసుకోవాలి అనుకున్నారు. ఎడిటింగ్‌కు నెల రోజుల టైమ్ పడుతుంది. ఆ గ్యాప్ లో మళ్లీ గడ్డం వచ్చేలా షేవ్ చేసుకున్నాడు. ఫ్యామిలీతో కలిసి ఫారిన్ వెకేషన్ కు వెళ్లారు. దాన్ని అందరూ కలిసి బీభత్సం చేశారు. సుకుమార్‌తో నాకు, బన్నీకి స్పెషల్ బాండింగ్ ఉంది. ఇంకో 6 నెలలు షూటింగ్ చేసినా బన్నీ గారు వచ్చేందుకు సిధ్దంగా ఉన్నారు. ‘పుష్ప‘ అనేది వారి కెరీర్‌కు ఎంతో వెయిట్ తీసుకొచ్చింది. రాసుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ, వారి ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. వారి వారి పనుల్లో బిజీ గా ఉన్నారు. ఆగష్టు తొలివారంలో మరో షెడ్యూల్ మొదలవుతుంది” అని బన్నీవాస్ వివరించారు.

Read Also: గడువు ముగిసిన విచారణకు రాని రాజ్‌ తరుణ్‌ - ఆలస్యంగా స్పందిస్తూ పోలీసులకు లేఖ, ఏమన్నాడంటే..

టాప్ హెడ్ లైన్స్

Lust Stories 3 OTT : ట్రెండింగ్‌లో బోల్డ్ అంథాలజీ సిరీస్ లస్ట్ స్టోరీస్ 3 - సిద్దార్థ్, అదితి రావ్ ఎపిసోడ్ డోంట్ మిస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
ట్రెండింగ్‌లో బోల్డ్ అంథాలజీ సిరీస్ లస్ట్ స్టోరీస్ 3 - సిద్దార్థ్, అదితి రావ్ ఎపిసోడ్ డోంట్ మిస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Ee Paata Korinavaaru Review - 'ఈ పాట కోరినవారు' రివ్యూ: చంద్ర సిద్ధార్ధ స్టైల్‌కు భిన్నంగా తీసిన ప్రయోగాత్మక సినిమా - ఎలా ఉందంటే?
'ఈ పాట కోరినవారు' రివ్యూ: చంద్ర సిద్ధార్ధ స్టైల్‌కు భిన్నంగా తీసిన ప్రయోగాత్మక సినిమా - ఎలా ఉందంటే?
The India Story OTT : ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
Zombie Reddy 2 Upendra : జాంబీల వరల్డ్‌లో ఉపేంద్ర - జాంబీ రెడ్డి 2లో మాంత్రికుడిగా ఇంటెన్స్ లుక్ వేరే లెవల్
జాంబీల వరల్డ్‌లో ఉపేంద్ర - జాంబీ రెడ్డి 2లో మాంత్రికుడిగా ఇంటెన్స్ లుక్ వేరే లెవల్

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy: ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
Irumudi OTT : థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
Hyderabad Crime News: వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
యువతకు నచ్చేలా అపాచీ, రోనిన్‌లో కొత్త టెక్నాలజీ ఫీచర్లు.. ధరలు ఎంతంటే?
యూత్‌ఫుల్‌ Apache, Ronin బైకుల్లో కొత్త వేరియంట్లు, కొత్త టెక్నాలజీ
Laptop Keyboard Cleaning : ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
Embed widget