Brahmamudi Serial Today January 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాహుల్ ప్లాన్ సక్సెస్ - జైలుకెళ్లిన రాజ్
Brahmamudi serial today episode January 8th: రాహుల్ వేసిన స్మగుల్ గోల్డ్ ప్లాన్ లో రాజ్ పోలీసులకు దొరికిపోతాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: కావ్య తన రూంలో కూర్చుని రుద్రాణి చేసిన పనే గుర్తు చేసుకుని ఏడుస్తుంది. రాజ్ వచ్చి కావ్యను ఓదారుస్తుంటాడు. కావ్య ఏడుస్తూనే ఉంటుంది. రాజ్ ఎంత చెప్పినా కన్వీన్స్ కాదు..
రాజ్: కళావతి ఇన్ని రోజులు తను ఎన్ని తప్పులు చేసినా..? నీ మీద ఎంత కక్ష్య గట్టినా తన గుణం అంతే అని సరిపెట్టుకున్నాం. ఏదో ఒకరోజు మారుతుందిలే అని పట్టించుకోలేదు కానీ ఈరోజు ఇంతకీ తెగిస్తుందనుకోలేదు..
కావ్య: ఆవిడకు మనం ఏం పాపం చేశామండి ఆవిడకు ఏ ద్రోహం చేశామని ఇంతకు పూనుకుంది. సమయానికి మా అమ్మ కానీ చూసి ఉండకపోతే ఎన్నో ఆశలు పెట్టుకున్న నా బిడ్డ ఏమైపోయేది. మన బిడ్డను కాపాడునేందుకు నేను నన్ను కాపాడుకోవాలని మీరు పడ్డ కష్టం భరించిన ఆవేదన అంతా గంగపాలు అయిపోయేది కదా..? ఇన్నేళ్ల నా నిరీక్షణ బిడ్డను కళ్లారా చూసుకోవాలన్న కళ అదంతా చెదిరిపోవడమే కాదండి మన బిడ్డ ముఖం మీద మనమే మట్టి వేసుకునే పరిస్థితి వచ్చేది
రాజ్: కళావతి వద్దు అలాంటి అపశకునపు మాటలు మాట్లాడొద్దు నేను భరించలేను
కావ్య: ఏ ఆడదైనా.. ఏ తల్లైనా..? తన బిడ్డను మోయడానికి కనడానికి యుద్దం చేస్తుందండి.. కానీ నేను నా బిడ్డను బతికించుకోవడానికి ఈ ప్రపంచానికి చూపించడానికి పోరాటం చేయాల్సి వస్తుంది కదండి.. నేను ఎంత దురదృష్టవంతురాలినండి..
రాజ్: లేదు కళావతి నువ్వు దురదృష్టవంతురాలివి కాదు అదృష్టవంతురాలివి అందుకే తల్లి దక్కితే బిడ్డ దక్కదు.. బిడ్డ దక్కితే తల్లి దక్కదు అనే భయంలోంచి తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు అన్న ఆనందంలోకి వచ్చామంటే ఇది మన అదృష్టం కాదా..? రుద్రాణి లాంటి చీడపురుగులు అంత కుట్ర చేసినా ఈ క్షణం కూడా నీ కడుపులో బిడ్డ క్షేమంగా ఉందంటే ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు కలావతి నీకు బిడ్డను దూరం చేయడం
కావ్య: ఏవండి ఏం అంటున్నారండి మీరు
రాజ్: అవును ఈ పాటికే నీకు బిడ్డ దూరం అయిపోయేది. కానీ చివరి క్షణంలో ఆ విషయం మనకు తెలిసేలా చేశాడంటే.. ఆ దేవుడు మన బిడ్డను కాపాడాలి అనుకున్నట్టే కదా..? ఆ దేవుడు మనకు అండగా ఉండగా మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు కళావతి నువ్వు బాధపడొద్దు.. భయపడొద్దు.. ఇక నుంచి మన బిడ్డ విషయంలో ఇంకెంచెం జాగ్రత్తగా ఉండటానికి ఇదో హెచ్చరిక మనకు
కావ్య: లేదండి మీరు నాకు ధైర్యం చెప్పడానికి మీరు నన్ను ఎంత కన్వీన్స్ చేసినా..? నాలో కంగారు తగ్గడం లేదండి.. ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ మన బిడ్డ క్షేమం కోరుకునేవారే.. నా బిడ్డ ఈ ప్రపంచం చూడాలని కలలు కన్నారు. కానీ ఇందరి మంచి మనుషుల మధ్య నుంచి ఒకరి రాక్షసత్వం బయటపడిందంటే మన బిడ్డ ఎంత ప్రమాదంలో ఉందో ఊహించుకుంటేనే భయం వేస్తుందండి
రాజ్: ఆ రాక్షసత్వానికి అవకాశం లేకుండా ఇంట్లో నుంచి పంపించేశాం కదా కళావతి.. నీకు ఏ భయం అక్కర్లేదు..
కావ్య: అలా అనకండి కళ్ల ముందే ఉంటేనే ఇంత కర్కషంగా మారారు.. ఇక ముందు ముందు మన బిడ్డకు ఏ వైపు నుంచి ప్రమాదం వస్తుందోనని నాకు తలుచుకుంటేనే భయం వేస్తుందండి
రాజ్: కళావతి ఏంటిది ఎప్పుడూ లేనిది నేనున్నాను కదా..? ఏ చెడు నీడ కూడా నీ మీద పడనివ్వను.. అయినా ఇంకెన్ని రోజులు రెండు నెలలే కదా..? బంగారం లాంటి బిడ్డకు నువ్వు జన్మనిస్తావు.. నువ్వేం టెన్షన్ పడకు కూల్‌గా ఉండు..
అంటూ రాజ్ కావ్యను ఓదారుస్తాడు. తర్వాత అందరూ హాల్లో ఉంటారు. ఇంతలో పోలీసులు వచ్చి స్మగుల్ గోల్డ్ పర్చేస్ చేసిన కేసులో రాజ్‌ను అరెస్ట్ చేస్తున్నామని చెప్తారు. సాక్ష్యం ఏముందని అడగ్గానే.. శాండీని చూపిస్తారు. ఇల్లంతా వెతికి చివరికి రాజ్ కారులో స్మగుల్ గోల్డ్ పట్టుకుంటారు. పోలీసులు రాజ్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే.. కావ్య స్పృహ కోల్పోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















