Brahmamudi Serial Today January 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : కుటుంబాన్ని కాపాడమన్న కావ్య – పెళ్లాం బాటలో నడుస్తున్న ప్రకాష్
Brahmamudi Today Episode: కావ్య, సుభాష్ దగ్గరకు వెళ్లి ఎలాగైనా ఈ పరిస్థితిని చక్కదిద్దండి అని చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
![Brahmamudi Serial Today January 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : కుటుంబాన్ని కాపాడమన్న కావ్య – పెళ్లాం బాటలో నడుస్తున్న ప్రకాష్ brahmamudi serial today episode January 28th written update Brahmamudi Serial Today January 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : కుటుంబాన్ని కాపాడమన్న కావ్య – పెళ్లాం బాటలో నడుస్తున్న ప్రకాష్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/28/9cd526bf854ed0657b809e9e2f5c255e1738032335819879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Brahmamudi Serial Today Episode: రుద్రాణిని నేనే కాపాడాను కాబట్టి మీరు ఇక నుంచి నాకు జీవితాంతం రుణపడి ఉండాలని స్వప్న చెప్తుంది. దీంతో రుద్రాణి కోపంగా రాహుల్‌ను కొడుతుంది. కరెంట్ షాక్ ఐడియా వేసింది నువ్వే కదా అంటూ తిడుతుంది. అయితే నువ్వు వస్తావని నేను అనుకోలేదు మామ్ అటాడు రాహుల్. మరోవైపు అప్పుకు చెప్తుంటే బట్లలు సర్దుతుంటాడు కళ్యాణ్.
కళ్యాణ్: ఇక నా వల్ల కాదు కూచి నేను సర్దలేను నీకేం కావాలో నువ్వే సర్దుకో
అప్పు: అంటే నేను నిన్ను విసిగిస్తున్నానా..? చికాకు తెప్పిస్తున్నానా..? కన్పీజ్ చేస్తున్నానా..?
కళ్యాణ్: నేను పాట కూడా ఒక వర్షన్ రాసి ఫైనల్ చేస్తాను. నువ్వు కిరాణ షాపుకు వెళ్లిన చిన్న పిల్లలా అది ఇది అంటూ నన్ను కన్పీజ్ చేస్తున్నావు. నీకేం కావాలో ఒకటి ఫైనల్ చేసుకుని చెప్పు నేను సర్దుతాను.
అప్పు: ఏమీ వద్దు నేను సర్దుకుంటాను
కళ్యాణ్: నేను సర్దుతానులే
అప్పు: ఏమీ వద్దులే
అని అప్పు సర్దుకుంటుంటే కళ్యాణ్‌కు అపర్ణ ఫోన్ చేస్తుంది.
అపర్ణ: కళ్యాణ్ ఎక్కుడున్నావు నేను అడిగితే ఒక నిజం చెప్తావా..?
కళ్యాణ్: మీ దగ్గర నిజం దాచాల్సిన అవసరం నాకెందుకు వస్తుంది పెద్దమ్మ..
అపర్ణ: ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది..
కళ్యాణ్: అసలు ఏమైంది పెద్దమ్మ
అపర్ణ: కావ్య నీ దగ్గర ఏదైనా చెప్తుంది కదా..?
కళ్యాణ్: అవును చెప్తుంది పెద్దమ్మ..
అపర్ణ: అయితే రాజ్, కావ్య కలిసి మన గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టారు. అది చెప్పారా..?
కళ్యాణ్: అవునా నాకు చెప్పలేదు పెద్దమ్మా.. అసలు ఏం అయింది పెద్దమ్మా..
అపర్ణ: సరే అయితే నేను ఫోన్ చేసినట్టు ఎవ్వరికీ చెప్పొద్దు కళ్యాణ్.
అంటూ ఫోన్ కట్ చేస్తుంది అపర్ణ. అప్పు వచ్చి ఏమైంది డల్లుగా ఉన్నావు అని అడుగుతుంది. ఏం లేదు నీ ట్రైన్‌కు టైం అవుతుంది వెళ్దాం పద అంటాడు. మరోవైపు దుగ్గిరాల ఇంటికి కోర్టు నోటీసులు పంపిస్తారు ధాన్యలక్ష్మీ, ప్రకాష్. ఆ నోటీలుసు చూసిన కావ్య షాక్ అవుతుంది.
సుభాష్: ఏంటమ్మా అది
కావ్య: కోర్టు నోటీసు మామయ్య
సుభాష్: కోర్టు నోటీసా మనకెవరు పంపించారు. చూడు ఎవరు పంపించారో
ఇంతలో ప్రకాష్, ధాన్యలక్ష్మీ కిందకు వస్తారు.
ప్రకాష్: ఆ నోటీసులు మేమే పంపించాం
ఇందిరాదేవి: ఏంటి మీరు నోటీసులు పంపించారా..? ఎందుకు..?
ధాన్యలక్ష్మీ: అవును అత్తయ్య మేమే పంపించాం. మా వాటా ఆస్థి మాకు కావాలని కోర్టుకు వెళ్తున్నాం. అలా బొమ్మలా నిలబడతారేంటి చెప్పండి
ప్రకాష్: అవునమ్మా..
స్వప్న: ఇది వాళ్లకు పుట్టిన బుద్ది కాదు.. ఈ గూడుపుఠాణీలో మా అత్త హస్తం కచ్చితంగా ఉంటుంది.
రుద్రాణి: నాకేం తెలియదు. సిటీలో మంచి లాయర్ ఎవరంటే నేను చెప్పాను.. కానీ కోర్టు నోటీసులు పంపించడానికి అని నాకెలా తెలుసు
ధాన్యలక్ష్మీ: స్వప్న మీ అత్తను ఎందుకు అంటావు.. ఇంట్లో మీ అక్క వెలగబట్టేది చూడటం లేదా..?
సుభాష్: ఏరా ఒక్కమాట కూడా మాకు చెప్పకుండా ఇలా చేశావేంట్రా
ప్రకాష్: నీకు ఎన్నో సార్లు చెప్పాను అన్నయ్యా.. నువ్వు కూడా ఎప్పుడూ కావ్యనే సపోర్టు చేశావు. పైగా ధాన్యం పోరు పడలేక కోర్టుకు వెళ్లాల్సి వచింది
అపర్ణ: మీ నాన్న హాస్పిటల్ లో ఉంటే నువ్వు ఇలా చేయడం కరెక్టేనా ప్రకాషం.
కావ్య: ఈ ఆస్థి తాతయ్యగారి ఆస్తి ఆయన వారసులందరికీ ఈ ఆస్థి చెందుతుంది. ఇదంతా మూటగట్టుకుని మా పుట్టింటికి మోసుకుపోలేను.. దయచేసి ఇదంతా ఇక్కడితో ఆపండి.. కోర్టు దాకా వెళ్లి.. తాతయ్య, అమ్మమ్మ వాళ్లను బాధపెట్టకండి.
అంటూ కావ్య చెప్పినా వినరు.. రాజ్ కూడా ఎంత ట్రై చేసినా ధాన్యలక్ష్మీ కానీ ప్రకాష్ కానీ తమ నిర్ణయం మార్చుకోరు. తర్వాత కావ్య, సుభాష్ దగ్గరకు వెళ్లి మీరే ఈ పరిస్థితిని చక్కదిద్దగలరు అని చెప్తుంది. దీంతో అపర్ణ కోపంగా కావ్యను తిడుతుంది. ఇంతటితో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)