Brahmamudi Serial Today February 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇంట్లో పంచాయితీ పెట్టిన అనామిక, ఇష్టం లేకపోతే వెళ్లిపోవచ్చన్న కళ్యాణ్
Brahmamudi Today Episode: కళ్యాణ్ తనను మోసం చేశాడని ఆఫీసుకు వెళ్లి కూడా కవితలు రాస్తున్నాడని ఇంట్లో అనామిక పంచాయితీ పెట్టడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: ఇంట్లో అనామిక కోపంగా అటూ ఇటూ తిరుగుతుంటే.. ధాన్యలక్ష్మీ వచ్చి అనామిక ఎంటి అలా ఉన్నావు. ఎందుకు అటూఇటూ తిరుగుతున్నావు అని అడుగుతుంది. ఎలా ఉన్నాను అత్తయ్యా అంటూ సీరియస్‌గా చూస్తుంటుంది అనామిక. ఎవరైనా ఏమైనా అన్నారా? చెప్పు అంటూ ధాన్యలక్ష్మీ ప్రశ్నించడంతో అనామిక కోపంగా చూస్తూ.. చెప్తాను. అన్నీ చెప్తాను. అందరికీ చెప్తాను. అందరినీ బయటకు రమ్మని చెప్పాను. అందరి ముందే చెప్తాను.. అనగానే అందరూ హాల్ లోకి వస్తారు.
రుద్రాణి: ఏంటి అనామిక అందరినీ రమ్మన్నావు.
అనామిక: వచ్చావా కవి పుంగవా? ఇవాళ ఏం జరిగిందో అసలు రోజూ ఏం జరుగుతుందో ఇందులో సూత్రధారి ఎవరో పాత్రధారి ఎవరో కపటధారి ఎవరో అన్నీ ఇవాళ బయటపడి తీరాల్సిందే.
అపర్ణ: చాలు ఆపు అనామిక. అడవిలో అడుగు ఎత్తలేని కుందేలు నిలువెత్తు ఏనుగుల్ని, సింహాల్ని నిలబెట్టి పంచాయతీ పెట్టినట్లు ఉంది. ఇన్ని పద ప్రయోగాలు నీకెందుకమ్మా? నీకష్టమేంటో ఊరికే చెప్పుకో అతే కానీ ఈ అరుపులు, విరుపులు ఇక్కడ కుదరవు.
అనామిక: నాకు తెలుసు ఈ ఇంట్లో నాకే స్వాతంత్రం లేదు. నోరెత్తేవాళ్లకి ప్రశ్నించేవాళ్లకు మాట్లాడే అవకాశమే ఇవ్వరు. కనీసం మోసం జరిగినప్పుడైనా, అన్యాయం జరిగినప్పుడైనా నిలదేసే హక్కు లేదు.
అంటూ అనామిక వెళ్లిపోతుంటే ధాన్యలక్ష్మీ ఆపి ఇంతకీ ఏం జరిగింది చెప్పు అనగానే నీ సమస్య ఏంటని అడగ్గానే నా సమస్య మీ కొడుకే అంటూ కళ్యాణ్ గురించి చెప్తుంది. ఆఫీసుకు వెళ్లి కూడా కవిసమ్మేళనం పెట్టాడు. అంటూ బాధపడుతుంది. దీంతో అనామిక ఆఫీసులో కూడా కళ్యాణ్‌ను అందరి ముందు తిట్టివచ్చిందని అందరూ తిడతారు. కావ్య, కళ్యాణ్ గురించి మంచిగా మాట్లాతుంటే..
అనామిక: ఆపు నా భర్తను మొత్తం చెడగొట్టింది నువ్వే. నా భర్తను అసమర్థుడిలా తయారు చేశావు. కళ్యాణ్‌ను ఎందుకు పనికిరానివాడిలా చేయాలనుకుంటున్నారు.
కళ్యాణ్: స్టాపిట్ అనామిక. ఇంతసేపు చాలా మాట్లాడావు. ఆఫీసులో చాలానే మాట్లాడి వచ్చావు. ఎందుకంటే నాకు నీ మీద ప్రేమ అలాగే ఉంది కాబట్టి. ఏం అర్హత ఉందని పెద్దల ముందు అరుస్తున్నావు. అసలు ఎంతసేపు నీ గురించే కానీ నా గురించి తెలుసుకున్నావా? నిన్ను బాధపెట్టడం ఇష్టం లేక ఆఫీసుకు వెళ్లాను. ఇప్పుడు చెప్తున్నాను విను అనామిక నేను నీకోసం, నీ ఆశల కోసం ఏమీ చేయలేను. నేను నా దారిలోనే వెళ్తాను.
అంటూ కళ్యాణ్ చెప్పగానే అనామిక పైకి వెళ్లి కళ్యాణ్ రాసిన కవితలు కిందకు విసిరేస్తుంది. ఈ పనికిమాలిన రాతలు చూస్తూ ఎప్పుడూ బతకాలా? నీ అభిరుచి కోసం నేను ఎప్పుడూ ఇలాగే బతకాలా? అంటూ నిలదీస్తుంది. ఇంతలో కావ్య అనామికకు కవిత్వం గురించి చెప్పబోతుంటే కళ్యాణ్ కావ్యను ఆపి మూర్ఖులకు కవిత్వం గురించి ఎంత చెప్పినా వ్యర్థం అనగానే
ఇందిరాదేవి: ఇంక ఆపు అనామిక నువ్వు కళ్యాణ్ రాసే కవితలను చూసి పెళ్లి చేసుకున్నావా? లేక వాడి వెనక ఉన్న ఆస్థిని చూసి పెళ్లి చేసుకున్నావా? ఆస్థిని చూసే అయితే పది తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్థి ఉంది. ఇక వెళ్లు
కళ్యాణ్: ఆగు అనామిక నేను నీ కోసం బతకను నాకు నచ్చినట్టుగానే బతుకుతాను. ఇది నువ్వు జీర్ణం చేసుకోగలిగితేనే ప్రశాంతంగా ఉండగలుగుతావు. ఇక వెళ్లు
అనగానే అనామిక వెళ్లిపోతుంది. తర్వాత కళ్యాణ్ కూడా రూంలోకి వెళ్లి అనామిక మీద రాసిన కవితను నీకు చదివే అర్హత కూడా లేదని పేపరు మడచి దూరంగా విసిరివేస్తాడు. ఆ పేపరు కావ్య తీసుకుని చదువుతుంది. ఇంతలో అనామిక కూడా కోపంగా గార్డెన్ లోకి వెళ్లిపోవడం కావ్య చూసి. కావ్య కూడా గార్డెన్‌లోకి వెళ్తుంది. కళ్యాణ్‌ను బాధపెట్టొద్దని కావ్య చెప్పి కళ్యాణ్ రాసిన కవితను అనామికకు ఇస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: అలా అడగాలంటే కన్ను, కిడ్నీ దానం చేయండి - నేను చేస్తున్నది నాకే నచ్చలేదు: రానా దగ్గుబాటి