Brahmamudi Serial Today February 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : అలిగి పుట్టింటికి వెళ్లిన కావ్య - ధాన్యలక్ష్మీకి బుద్ది చెప్పిన సుభాష్
Brahmamudi Today Episode: రాజ్ పై కోపంతో కావ్య పుట్టింటికి వెళ్లిపోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: కనకం, మూర్తి బయట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో రాజ్, కావ్య వస్తారు. వారిని చూసిన కనకం అల్లుడు గారు వచ్చారు అని మూర్తికి చెబుతూనే కారు దగ్గరకు వెళ్తుంది. లోపలికి రమ్మని రాజ్‌ను పిలుస్తుంది కనకం. కానీ పని ఉందని కావ్యను డ్రాప్ చేయడానికి వచ్చానని చెప్తాడు రాజ్. కనీసం కాఫీ అయినా తాగి వెళ్లండని కనకం రిక్వెస్ట్ చేస్తుంది. దీంతో కావ్య కోపంగా ఎందుకు బతిమాలుతున్నావని.. ఉండాలనుకునే వాళ్లు ఎలాగైనా ఉంటారని.. వెళ్లాలనుకున్నవాళ్లు ఎలా వెళ్లాలా? అని ఆలోచిస్తారని కోపంగా లోపలికి వెళ్తుంది. రాజ్ కూడా తనకు టైం అవుతుందని చెప్పి వెళ్లిపోతాడు. లోపల కావ్య ఆలోచిస్తూ ఉంటే..
అప్పు: అక్క ఏమైందక్కా..ఎం జరిగింది.
లోపలికి వచ్చిన కనకం
కనకం: ఏం జరిగిందే అల్లుడుగారేమో అర్థం కానట్లు మాట్లాడి వెళ్లిపోయారు. నువ్వేమో మౌనంగా నిలబడ్డావు.
కావ్య: ఆయన మాటలే కాదమ్మా ఆయన ప్రవర్తన కూడా అర్థం కావడం లేదు.
మూర్తి: అసలు ఏం జరిగిందమ్మా..?
అని అందరూ అడగ్గానే కావ్య ఏడుస్తూ రాజ్ వేరే అమ్మాయితో తిరుగుతున్నారని నిజం చెప్తుంది. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని చెప్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. తర్వాత అప్పు కోపంగా బావను నిలదీస్తానని వెళ్లబోతుంటే ఆపి వద్దని వారిస్తారు. దీంతో కోపంగా అప్పు తెలియక తప్పు చేస్తే సరిదిద్దొచ్చు.. కానీ తెలిసి తప్పు చేస్తే ఎలా సరిచేయగలం అని వాదిస్తుంది. అవసరవమైతే కోర్టుకు లాగాలి.. అనగానే ఆయన నన్ను నమ్మించడానికి వేరే అమ్మాయితో తిరుగుతున్నట్లు నటించారని.. ఆయనకు నాతో కలిసి ఉండటమే ఇష్టం లేదని బాధపడుతుంది కావ్య. అయితే ఇప్పుడు ఏం చేయాలనకుకుంటున్నావే అంటూ కనకం అడుగుతుంది. తెలియదన్నట్లు కావ్య చూస్తుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అపర్ణ, అనామిక, రుద్రాణి, ధాన్యలక్ష్మీ హాల్లో కూర్చుని ఉంటారు. ఇంతలో రాజ్ ఆఫీసు నుంచి వస్తాడు.
ధాన్యలక్ష్మి: ఒక్క నిమిషం రాజ్ నీతో మాట్లాడాలి. మీరే వచ్చారు ఆ మహరాణి ఏది?
రాజ్: కావ్యనా?
ధాన్యలక్ష్మీ: అవును ఈ ఇంటి పెద్ద కోడలని మీ అమ్మ తన నెత్తిన కీర్తి కిరీటాలు పెట్టింది. మన ఇంటి మహాలక్ష్మీ అని మీ నాన్నమ్మ ఆవిడ కోసం ఒక సింహాసనమే వేసింది. కనకపు సింహాసనం.
ప్రకాష్: ఏమైంది నీకు అంత వెటకారంగా మాట్లాడుతున్నావేంటి?
ధాన్యలక్ష్మీ: ఏమైందా? ఎవరు ఏంటనేది అర్థమైంది. నాకే కాదు ఈ ఇంట్లో ఆడవాళ్లందరికీ అర్థం అయింది. మీ ముగ్గురికే అర్థం కాలేదు.
రాజ్: ఏం జరిగిందో చెప్పు పిన్ని
రుద్రాణి: ఏం లేదు రాజ్ మార్నింగ్ మీ అమ్మా కావ్యకు లాకర్ కీస్ ఇచ్చింది. తనేమో ఎవ్వరికీ చెప్పకుండా అందులోంచి రెండు లక్షలు తీసుకువెళ్లింది.
ధాన్యలక్ష్మీ: మీరు 5 లక్షలు ఇవ్వమని మనిషిని పంపిచినప్పుడే ఈ విషయం బయటపడింది బావగారు.
అని ధాన్యలక్ష్మీ కావ్యను దొంగను చేసి మాట్లాడుతుంది. దీంతో రాజ్ కోపంగా ధాన్యలక్ష్మీని తిడతాడు. తనకు ఏ అవసరం వచ్చిందో తీసుకుని ఉండోచ్చని అంటాడు. దీంతో అందరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. చివరికి కావ్యను ఈ ఇంట్లో ఎవరూ ఏమీ అడగొద్దని తెగేసి చెప్పి వెళ్లిపోతాడు రాజ్. మరోవైపు కావ్య ఏడుస్తుంటే ఈ సమస్యను ఎదురించి పరిష్కరించుకోవాలని అప్పు చెప్తుంది. అయితే ఎదిరించి సాధించుకోవడానికి ఇవి ఆస్తి హక్కులు కావని కావ్య చెప్తుంది. మరి ఎం చేద్దామని కనకం, మూర్తి అడగ్గానే నేను ఆయన జీవితంలోంచి తప్పుకోవాలనుకుంటున్నాను అంటుంది కావ్య. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతలో ఇందిరాదేవి వచ్చి తప్పుకుని.. నువ్వు తప్పు చేసిన దానివి అవుతావా? అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: ‘అతడు’ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరో - బ్రహ్మానందాన్నే సర్‌ప్రైజ్ చేశాడు.. ఇదిగో ఇలా