Brahmamudi Serial Today December 31st: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాహుల్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అప్పు – అడ్డు పడిన స్వప్న
Brahmamudi serial today episode December 31st: దొంగ బంగారం రాజ్ కారులో పెట్టాలనుకున్న రాహుల్‌ను అప్పు చూస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode: రాజ్, రేఖతో చనువుగా ఉంటున్నాడని రాజ్‌ను ఆటపట్టిస్తుంది కావ్య. అంతా ఇందిరాదేవి గమనిస్తుంది. కావ్యను పిలిచి ఎందుకు రాజ్ తో అలా ఉంటున్నావని అడుగుతుంది.
ఇందిరాదేవి: అదేదో పిజ్జానో బర్గరో అడిగితే తీసుకొచ్చి ఇచ్చాడు. దానికి అది కౌగిలించుకుంటే దానికే నువ్విలా అనుమానపడాలా..? వాడితో అంతలా ఆడుకోవాలా..?
కావ్య: ఏం మీ మనవడు ఫీల్ అయిపోయాడని మీకు పొడుచుకువచ్చిందా..?
ఇందిరాదేవి: కాదా మరి నా మనవడు శ్రీరామచంద్రుడు అని నీకు తెలియదా..? నిజం చెప్పు
కావ్య: అయ్యో అమ్మమ్మ నా మొగుడు గురించి నాకు తెలియదా చెప్పండి.. ఆయన కళ్లల్లో కావ్య.. మనసులో కావ్య, ఒళ్లంతా కావ్య జపమే కదా
ఇందిరాదేవి: అమ్మదొంగా మరి ఎందుకు వాడిని అలా బాధపెడుతున్నావు..
కావ్య: అమ్మమ్మ ఇన్ని రోజుల నుంచి మీ మనవడిని ఏడిపించే అవకాశమే రాలేదు. ఇప్పుడు దొరికింది మరి వదిలిపెడితే ఎలా..?
ఇందిరాదేవి: అమ్మ నీ కడుపు బంగారం కాను.. నిద్ర లేచిన దగ్గరి నుంచి నీ కొంగు పట్టుకుని తిరిగుతూ నీకు సేవలు చేస్తున్నాడు కదే సరిపోవడం లేదా..?
కావ్య: ఎలా సరిపోతుంది అమ్మమ్మ నాకు సేవలు చేస్తుంటే.. ఆయనకు టైం పాస్.. కానీ నాకు టైం పాస్ కావాలి కదా..? అందుకే కాస్త ఏడిపించే పని పెట్టుకున్నాను.. అమ్మమ్మ నాకు రేపు డెలివరీ అయ్యాక పుట్టిన బిడ్డ వాడి పెంపకం.. అంటూ బిజిగా ఉంటాను.. ఇక మీ మనవడితో ఆడుకునేది ఎప్పుడు..? అవకాశం వచ్చినప్పుడే వాడుకోవాలి. ఈ మగవాళ్లను టైం వచ్చినప్పుడే ఆడుకోవాలి. మళ్లీ టైం దొరకదు..
ఇందిరాదేవి: ఎంతటి కిలాడివే నువ్వు..
కావ్య: అమ్మమ్మ గారు ఈ మాటలు అప్పుడే లీక్ చేయకండి.. సార్‌కు ముందు ముందు డోస్ పెంచేది ఉంది సరేనా
అని కావ్య వెళ్లిపోతుంది. ఇందిరాదేవి నవ్వుకుంటుంది. మరోవైపు రాహుల్ స్మగుల్ గోల్డ్ శాండీ దగ్గర తీసుకుని ఎలాగైనా ఆ గోల్డ్‌ను రాజ్ కారులో పెట్టాలని అనుకుంటాడు. ఆ గోల్డ్ తీసుకుని ఇంటికి వస్తాడు. రాజ్ కారును చూస్తుంటాడు. అప్పుడే అప్పు వస్తుంది.
అప్పు: ఏంటి రాహుల్ ఇక్కడ నిలబడ్డావు..
రాహుల్: ఇప్పుడే బయటి నుంచి వచ్చాను అందుకే ఇలా నిలబడిపోయాను
అప్పు: అది సరే ఎందుకని ఇందాకటి నుంచి ఎందుకలా రాజ్ బావ కారు చూస్తున్నావు..
రాహుల్: రాజ్ కారు బాగుంది కదా తొందరలో ఇలాంటి కారు కొందామని.. అందుకే చూస్తున్నాను అప్పు.. ఏదైనా కొనే ముందే బాగా చూసి కొనాలి
అప్పు: రాజ్ బావ ఈ కారు కొని చాలా రోజులైంది. ఇప్పుడు కొనడమేంటి..?
రాహుల్: అంటే ఇన్ని రోజులు దృష్టి పెట్టలేదు.. అందుకని..
అప్పు: ఓకే మరి ఎందుకని అంతలా కంగారుపడుతున్నావు..
రాహుల్: కంగారా..? నేనా..? అదేం లేదే
అప్పు: నువ్వు కంగారు పడకపోతే ముఖం నిండా ఆ చెమటలు ఏంటి..?
రాహుల్: ( మనసులో) వామ్మో ఈ బుడ్డది ఏంటి నన్ను పట్టుకుంది. అయినా ఇది నన్ను ఫోకస్ చేసిందేంటి..? దీన్నుంచి ఎలా తప్పించుకోవాలి
అనుకుంటుంటే అప్పుడే స్వప్న వచ్చి అప్పుతో మాట్లాడి రాహుల్‌ను తీసుకుని వెళ్లిపోతుంది. అప్పు మాత్రం రాహుల్‌ను అనుమానంగా చూస్తుంది. అదే విషయం కళ్యాన్‌కు చెప్తుంది. మరోవైపు రుద్రాణి, రేఖ మాట్లాడుకుంటుంటే.. రాహుల్ వెళ్లి ఎలాగైనా రాజ్, కావ్యను దూరం చేసి రేఖను రాజ్‌కు దగ్గర చేయాలని ప్లాన్ చెప్తాడు. ఆ ప్లాన్ విన్న రుద్రాణి, రేఖ చాలా బాగుందని మెచ్చుకుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















