Brahmamudi Serial Today December 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కొత్త ప్లాన్ చేసిన రాహుల్ - రాజ్‌ను కలిసిన స్మగ్లర్
Brahmamudi serial today episode December 27th: రాజ్ బిజినెస్‌ను దెబ్బ తీసేందుకు రాహుల్ కొత్త ప్లాన్ వేయడంతో ఇవాల్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode: కావ్యను త్వరగా నిద్రపోమ్మని రాజ్ కూడా పడుకుంటాడు. వెంటనే కావ్య గట్టిగా అరుస్తూ నిద్ర లేస్తుంది. కావ్య అరుపులకు రాజ్ ఉలిక్కిపడి మేల్కొంటాడు. ఏమైంది కళావతి అంటూ కంగారు పడుతూ అడుగుతాడు.
కావ్య: మన ఇల్లు కాలిపోయినట్టు కల వచ్చిందండి
రాజ్: ఏంటి కలగన్నావా..?
కావ్య: అది కలలా అనిపించలేదు అండి నిజంగా కళ్ల ముందు జరిగినట్టు అనిపించింది అండి
రాజ్: అయినా చిన్న పిల్లలా కలకు భయపడతావేంటి..?
కావ్య: నాకు చాలా సార్లు పీడ కలలు వస్తూ ఉంటాయి. నేను దేనికి ఇంతలా భయపడలేదు.. నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది అండి
రాజ్: కీడు లేదు కాకరకాయ లేదు అదంతా మన బ్రెయిన్ క్రియేట్ చేసే ఇల్యూషన్ అంతే
కావ్య: అయ్యో నేను చెప్తున్నాను కదా మీరెందుకు ఇంత సింపుల్‌గా తీసుకుంటున్నారు ఏంటి..? ఇల్లు కాలిపోతున్నట్టు కల రావడం మామూలు కాదండి
రాజ్: నువ్వు పడుకున్నప్పుడు ఏం చేస్తున్నావు..
కావ్య: కొత్త ఇంటికి స్కెచ్ గీసాను కదా
రాజ్: మరి పడుకున్నప్పుడు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి. కొత్త ఇంటికి స్కెచ్ వేశావు. అందుకే నీకు అలాంటి కల వచ్చింది
కావ్య: ఎవండి మీరు చెప్పింది నిజం అయితే నేను గీసిన డిజైన్‌లో ఉన్న ఇల్లు కాలిపోయినట్టు కల రావాలి కానీ మన ఇల్లు కాలిపోతున్నట్టు కల వచ్చిందేంటి
రాజ్: మనకు వచ్చే కలకు కూడా లాజిక్ ఉండాలన్న నీ ఆలోచనకు హ్యాట్సాప్ కళావతి. మార్నింగ్ ఆఫీసులో చాలా పని ఉందే నన్ను పడుకోనివ్వవే..
కావ్య: అది కాదండి.. సరే మీరు పడుకోండి
రాజ్: ఏయ్ నువ్వేం చేస్తావు.. నీకొచ్చిన కల గురించి ధీసెస్ రాసి ప్రాజెక్టు రిపోర్ట్ ఏమైనా రాస్తావా పడుకో నువ్వు కూడా
కావ్య సరే అంటూ నిద్రపోతుంది. తర్వాత రాహుల్ కొత్త ప్లాన్ గురించి ఆలోచిస్తూ… రాజ్ గురించి గుర్తు చేసుకుని ఇరిటేట్ అవుతుంటాడు.
రాహుల్: ( మనసులో) పది రోజుల్లో నా బిజినెస్‌ను తారాస్థాయికి తీసికెళ్లిన వాడిని కానీ ఇంతలోనే ఇంత డల్ అయిపోతుంది అనుకోలేదు. లాభం లేదు ఏదో ఒకటి చేయాలి
రుద్రాణి: ఏంట్రా ఆలోచిస్తున్నావు మళ్లీ ఈ ఫ్యామిలీ మోచేతి నీళ్లు ఎలా తాగాలి అని ఆలోచిస్తున్నావా..? మళ్లీ వీళ్ల అందరి కాళ్ల దగ్గర సాగిలపడి ఎలా బతకాలి అని ఆలోచిస్తున్నావా..?
రాహుల్: (కోపంగా) మామ్
రుద్రాణి: ఏం కోపం వచ్చిందా..? నేను అన్న దాంట్లో తప్పేం ఉందిరా..? ఇప్పుడు కానీ మళ్లీ నువ్వు బిజినెస్‌లో పుంజుకోకపోతే నీకు మిగిలేది చిప్పే.. నీ తెలివిని నీ శక్తిని నీ కన్నింగ్ మెంటాలిటీని ఉపయోగించి పది రోజుల్లోనే ఆ రాజ్, కావ్య షాక్ అయ్యేలా ఎదిగి చూపించినవాడివి.. కానీ వాళ్లు నెల రోజుల్లోనే వాళ్ల బిజినెస్‌ను పెంచుకోవడమే కాకుండా నీకు అసలు బిజినెస్ లేకుండా చేశారు. చూశావా వాళ్ల టాలెంట్.. అలాంటిది వాళ్లను ఎలా ఎదుర్కొంటారు. నీ బిజినెస్‌ను ఎలా పెంచుకుంటావు. వాళ్లకు సమంగా ఎలా నిలబడతావు..
రాహుల్: అదే ఆలోచిస్తున్నాను మామ్
రుద్రాణి: టైం ఎప్పుడూ మనది కాదు అందుకనే నువ్వు వాళ్లను మార్కెట్ లో కొట్టలేవు కాబట్టి ఇంట్లో నుంచి నరుక్కొద్దాం అంటున్నాను. రాజ్, కావ్య మీద పడే దెబ్బ ఇంట్లో నుంచే మొదలవ్వాలి
రాహుల్: వద్దు మామ్ నువ్వు అలాంటి ప్లాన్స్ ఏమీ వేయోదు
రుద్రాణి: ప్లాన్స్ వేయక వాళ్లు అలా ఎదుగుతూ ఉంటే.. నువ్వు ఇలా కుంగిపోతూ ఉంటే చూస్తూ కూర్చోమంటావా..?
రాహుల్: ఇప్పుడు దానికి పరిష్కారం దొరికింది. నేను ఎలా మార్కెట్ లో నిలబడాలో తెలిసింది
రుద్రాణి: ఇప్పుడు అది నువ్వు అనుకుంటున్నంత ఈజీ కాదు.. వాళ్లను నువ్వు బిజినెస్‌లో దెబ్బ కొట్టడం అంత సులువు కాదు
అని రుద్రాణి చెప్పగానే.. గోల్డ్ స్మగ్లింగ్ చేసి దాన్ని రాజ్ మీదకు నెట్టేస్తానని తన ప్లాన్ చెప్తాడు రాహుల్. ప్లాన్ మొత్తం విన్న రుద్రాణి చాలా బాగుందిరా ప్రొసీడ్ అని చెప్తుంది. తర్వాత రాజ్ కోసం హారతి తీసుకుని కావ్య వస్తుంది. హారతి ఆరిపోతుంది. అందరూ భయపడతారు. వెంటనే పంతులు దగ్గరకు వెళ్తారు. ఇక ఇంట్లో బోర్ కొడుతుంది అన్న అప్పుకు సివిల్స్‌కు ప్రిపేర్ అవ్వమని ధాన్యలక్ష్మీ బుక్స్ ఇస్తుంది. మరోవైపు రాహుల్ మనిషి రాజ్ దగ్గరకు వెళ్లి గోల్డ్ స్మగ్లింగ్ గురించి చెప్పడంతో రాజ్ కోపంతా అతన్ని అక్కడి నుంచి గెంటేస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!




















