అన్వేషించండి

Brahmamudi Serial Today April 2nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : అనామికను అందరి ముందు బుక్‌ చేసిన రుద్రాణి - స్వప్న, అనామికల మధ్య మొదలైన రగడ

Brahmamudi Today Episode: అనామికను రెచ్చగొట్టి తర్వాత రాహుల్ కోసం స్వప్నను రుద్రాణి రంగంలోకి దించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రస్టింగ్ గా జరిగింది.

Brahmamudi Serial Today Episode: కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకుంటాను. అంతే తప్పా ఏ పాపం తెలియని ఈ బిడ్డను మాత్రం అనాథను చేయను  అంటూ రాజ్ అనడంతో అందరూ షాక్‌ అవుతారు. ఉండనిస్తే ఇంట్లో ఉంటాను. వెళ్లిపోమ్మంటే వెళ్లిపోతాను.. ఆ నిర్ణయం కూడా మీకే వదిలేస్తున్నాను అంటూ బాబును తీసుకుని పైకి వెళ్లిపోతాడు రాజ్‌. మరోవైపు కావ్య ఇందిరాదేవి దగ్గరకు వచ్చి ఏమైందని అడుగుతుంది. దీంతో ఇంట్లో జరిగిన గొడవ గురించి చెప్తుంది. ఇలా జరుగుతుందని  నేను ఉదయమే అనుకున్నాను. అనగానే మరి ముందే ఆపొచ్చు కదా అంటుంది. అంటూ బాబు కోసం ఎండీ సీటు కూడా వదులుకున్నాడు అని చెప్పగానే కావ్య షాక్‌ అవుతుంది. ఏదో ఒకటి చేసి బాబు తల్లి ఎవరో తెలుసుకోవాలి అని డిసైడ్‌ అవుతుంది. మరోవైపు సుభాష్‌ దగ్గరకు రాజ్‌ వెళ్తాడు.

రాజ్: డాడ్‌ మిమ్మల్ని అడక్కుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నందుకు కోపం వచ్చిందా? నాకు తెలుసు డాడ్‌ మీరు బాబాయ్‌ ఈ కంపెనీని ఎంత కష్టపడి పైకి తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఈరోజు మీ నమ్మకాన్ని బ్రేక్‌ చేశాను. కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నాకు ఏ దారి కనిపించలేదు.

సుభాష్‌: ప్రతి గమ్యానికి రెండు దారులుంటాయి రాజ్‌. మనం  ఏ దారి ఎంచుకున్నామన్నదే ముఖ్యం.  

రాజ్‌: కానీ నాకు ఆ అవకాశం లేదు డాడ్‌.

సుభాష్‌: ఉంది కానీ నువ్వు ఆ దారిని వద్దనుకుంటున్నావు.

అని ఇద్దరూ మాట్లాడుకుంటూ కంపెనీ ఎండీగా కావ్యను చేయాలని డిసైడ్‌ అవుతారు. ఈ పరిస్థితుల్లో  కావ్యనే ఎండీగా చేయడం బెటర్‌ అని రాజ్‌ చెప్తాడు. తనకు అన్ని అర్హతలు ఉన్నాయి అని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు రూంలో కావ్య బాబును ఆడిస్తుంది. నువ్వొచ్చి నా జీవితాన్ని తలకిందులు చేశావు కదరా? ఏమీ తెలియని నువ్వు, అన్నీ తెలిసిన ఆ దేవుడు నన్ను బొమ్మను చేసి ఆడుకుంటున్నారు అంటుండగానే రాజ్‌ వస్తాడు.

కావ్య: ఏం జరుగుతుందో మీకు తెలుస్తూనే ఉంది. భార్య దగ్గర నమ్మకం పోగొట్టుకున్నారు. కన్నతల్లి దగ్గర ప్రేమ పొగొట్టుకున్నారు. ఇంటి సబ్యుల దగ్గర మర్యాద పోగొట్టుకున్నారు. ఇప్పుడు కంపెనీ బాధ్యతలు కూడా పొగొట్టుకున్నారు. ఇన్నీ పొగొట్టుకుని మీరు ఏం సాధిస్తున్నారు.

 అని చెప్పి కావ్య వెళ్లిపోతుంది. ఇన్ని తెలిసిన సమర్థులు ఈ ఇంట్లో ఇంకెవరున్నారు కళావతి. నీకు చెప్పకుండా కంపెనీ బాధ్యతలు నీకే అప్పజెప్పబోతున్నాం. అని మనసులో అనుకుంటాడు రాజ్‌.  తర్వాత అనామిక, రుద్రాణి, రాహుల్ కలిసి గార్డెన్‌ లో మాట్లాడుకుంటుంటారు.

రుద్రాణి: ఇదే సరైన సమయం రాజ్‌ తనంతట తానే కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకునేలా చేశాను. ఇక చేయాల్సింది అంతా నువ్వే అనామిక.

అనామిక: బావగారు తప్పుకోవడం నాకు ఆనందంగానే ఉంది. కానీ ఇప్పుడు నేను ఎం చేయను.

రుద్రాణి: నువ్వు అడిగింది అడిగినట్లు చేశాక కూడా ఇంకా నేనేం చేయాలి అంటావేంటి అనామిక. రాజ్‌ను కంపెనీ బాధ్యతల నుంచి దింపేలా చేసింది నీ కోసమేగా

 అంటూ అనామికను రెచ్చగొడుతుంది రుద్రాణి. ఇప్పుడు వెళ్లి మా వదినను అడుగు కళ్యాణ్‌ను కంపెనీకి ఎండీని చెయ్యమని ఒప్పించు అని రెచ్చగొట్టి పంపిస్తుంది. దీంతో రాహుల్‌ నన్ను చైర్మన్‌ను చేస్తానని ఆ కళ్యాణ్‌ను చేస్తానంటావా? అని అడగడంతో ఇదంతా కావాలని చేస్తున్నాను. ముందు దాన్ని రెచ్చగొట్టి తర్వాత నిన్ను ఎండీ చేయమని అడిగిద్దాం అనగానే ఈ ఇంట్లో నాకు సపోర్టు చేసేవాళ్లు ఎవరు మమ్మీ అంటాడు రాహుల్‌. నీ పెళ్లాం చేస్తుంది. పద వెళ్లి స్వప్నకు చెబుదాం అంటూ లోపలికి వెళ్తారు. స్వప్న వినేటట్టు నిన్ను కూడా ఎండీని చేయమని మా వదినను అడిగేదెవరు? కళ్యాణ్‌ కోసం అనామిక వెళ్లింది మరి నీకోసం ఎవరు వెళ్తారు అని మాట్లాడుకోవడంతో స్వప్న కూడా కిందకు వెళ్లిపోతుంది. ఇంతలో అనామిక వెళ్లి అందరిని కళ్యాణ్‌ను ఎండీగా చేయమని అడుగుతుంది. దీంతో ఇంకా ఈ విషయంలో ఏ డిసీజన్‌ తీసుకోలేదని చెప్తారు. ఇంతలో స్వప్న వెళ్లి కళ్యాణ్‌కు బిజినెస్‌ మీద ఇంట్రెస్ట్‌ లేదని ఎండీగా రాహుల్‌కు మాత్రమే ఆ అర్హత ఉందని స్వప్న చెప్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: అవార్డులు ఇంట్లో పెట్టుకుని ఏం చేయాలి? అందుకే వేలం వేసి.. ఆ పని చేశా: విజయ్ దేవరకొండ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Jio Airtel Best Plans: కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Embed widget