Vijay Devarakonda: అవార్డులు ఇంట్లో పెట్టుకుని ఏం చేయాలి? అందుకే వేలం వేసి.. ఆ పని చేశా: విజయ్ దేవరకొండ
Vijay Devarakonda: విజయ దేవరకొండ ఎప్పటికప్పుడు తన మంచి మనసు చాటుకుంటూనే ఉంటారు. ఇప్పుడిక అవార్డుల విషయంలో కూడా ఆయన అదే పనిచేశారు. వేలం వేసి దాన్ని చారిటీకి ఇచ్చారట.
Vijay Devarakonda About His Awards: విజయదేవరకొండ ఈ తరం హీరోలకి ఆయన ఒక ఇన్ స్పిరేషన్ అనే చెప్పాలి. కేవలం సినిమాల విషయంలోనే కాదు.. మిగతా చాలా విషయాల్లో ఆయన ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తారు. మంచి పనులు చేస్తూ అపదలో ఉన్నవాళ్లకి సాయం చేస్తుంటారు విజయ దేవరకొండ. 'ఖుషి' సినిమా సక్సెస్ అవ్వడంతో కోటి రూపాయలు తన ఫ్యాన్స్ కి హెల్ప్ గా ఇచ్చిన దేవరకొండ. ఇప్పుడు మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. అవార్డులను అమ్మి చారిటీకి ఇచ్చారంట ఆయన.
ఇంట్లో పెట్టుకుని ఏం చేసుకుంటాం?
'ఫ్యామిలీ స్టార్' సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్న విజయ దేవరకొండ ఇటీవల ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దాంట్లో భాగంగా ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అవార్డుల గురించి మాట్లాడారు. తను అవార్డులు, సర్టిఫికెట్లను పెద్దగా పట్టించుకోను అని చెప్పుకొచ్చారు. “నేను ఎక్కువగా అవార్డులు, రివార్డులు, సర్టిఫికెట్ల గురించి ఆలోచించను. కొన్నింటిని అలా ఆఫీస్ లో పెట్టేస్తాను. కొన్ని అమ్మ భద్రపరుస్తుంది. ఇంకొన్ని ఇచ్చేస్తుంటాను. దాంట్లో భాగంగానే ఈ మధ్యే నా బెస్ట్ యాక్టర్ ఫిలిమ్ ఫేర్ అవార్డును వేలం వేశాను. ఆ డబ్బును చారిటీకి ఇచ్చాను. ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తాం. ఆ అవార్డుకి ఇప్పుడే వాల్యూ ఎక్కువ అయింది” అనుకుంటాను అంటూ చెప్పుకొచ్చారు విజయ దేవరకొండ. ఇక ఇదే ఇంటర్వ్యూలో ఆయన తన రిలేషిప్ గురించి కూడా కామెంట్ చేశారు. “ఎస్ నేను రిలేషన్ షిలో ఉన్నాను. మా అమ్మ, నాన్న, తమ్ముడు, మీతో రిలేషన్ లో ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చారు ఆయన.
ఇదేం మొదటిసారి కాదు..
విజయ దేవరకొండ ఇలాంటి మంచి పనులు చేయడం ఇదేమి మొదటిసారి కాదు.. ఆయన గతంలో కూడా చారిటీకి సంబంధించి పనులు చేశారు. అవసరంలో ఉన్న ఎంతోమందికి సాయం చేశారు ఆయన. 'ఖుషి' సినిమా సక్సెస్ సందర్భంగా కోటి రూపాయలను తన ఫ్యాన్స్ కి పంచిపెట్టారు ఆయన. నిజంగా, జెన్యూన్ గా అవసరం ఉన్నవారిని ఎంచుకుని ఆయన సాయం చేశారు.
మలయాళ సినీ ఇండస్ట్రీపై ప్రశంసలు...
విజయ దేవరకొండ మలయాళ సినీ ఇండస్ట్రీపై ప్రశంసలు కురిపించారు. స్థిరమైన నాణ్యతతో ఆ సినిమాలు తీస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. విభిన్న ప్రేక్షకులను అలరించడానికి తన నిబద్ధతతో పనిచేస్తానని చెప్పారు దేవరకొండ. ఇక స్క్రిప్ట్ విషయానికి వస్తే.. ఎంచుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటానని అన్నారు దేవరకొండ. యువకులు, పెద్దలు అందరినీ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తానని, అందుకే సినిమాలు ఆలస్యం అవుతాయని చెప్పారు విజయ దేవరకొండ. ఇక ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉండగా.. ‘VD12,’ కూడా లైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 5న 'ఫ్యామిలీ స్టార్'..
విజయ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కలిసి నటిస్తున్న సినిమా 'ఫ్యామిలీ స్టార్'. 'గీత గోవిందం' డైరెక్టర్ పరుశరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
Also Read: అరిగిపోయిన సబ్బు ముక్కలని ఇప్పటికీ కలిపివాడతాను - మిడిల్ క్లాస్ ముచ్చట్లు చెప్పిన చిరంజీవి