అన్వేషించండి

Brahmamudi Serial Today April 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : కావ్య మంచి భార్య - ఓల్డ్ స్టూడెంట్ పార్టీలో బయటపడిన రాజ్ ప్రేమ

Brahmamudi Today Episode: ఓల్డ్ స్టూడెంట్ పార్టీ మొదలయ్యింది. వెన్నెల కోసం ఎదురుచూసే కావ్య . వెన్నెల వస్తుందన్న విషయమే తెలియని రాజ్.. ఈ అంశాలతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రస్టింగ్ గా జరిగింది.

Brahmamudi Serial Today April 15th: కావ్య బయటకు వెళ్ళటానికి సిద్ధం అవుతుంది .. కానీ అమ్మమ్మ అందుకు ఒప్పుకోదు. బాధ పడుతుంది. కానీ వెళ్ళక తప్పని పరిస్థితి అని చెప్పి కావ్య బయలుదేరుతుంది. ఆఫీస్ లో రాహుల్ టోనీకి ఫోన్ చేస్తాడు. అబ్రాడ్ నుండి తీసుకొచ్చిన దొంగ బంగారాన్ని తమ కంపెనీ కొనుక్కునేలా చేస్తానని మాట ఇస్తాడు. అయితే ఈ విషయంలో అగ్రిమెంట్ తప్పకుండా కావాలంటాడు అవతలి వ్యక్తి. కళ్యాణ్ ని ఎలాగైనా జైలుకి పంపించి తాను ఎండి పోస్ట్ కొట్టేయాలనుకుంటున్న రాహుల్,  శకుంతల గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు తక్కువ ధరకే బంగారాన్ని మనకి అమ్ముతారు అని కళ్యాణ్  కి చెబుతాడు. అయితే తాను ఆ విషయంలో అన్నయ్యను అడిగి మాత్రమే నిర్ణయం తీసుకుంటాను అంటాడు కళ్యాణ్. కానీ రాజ్ పార్టీకి వెళ్తున్నాడని తెలుసు కాబట్టి రాజ్ వచ్చేలోపే ఈ డీల్ కంప్లీట్ చేద్దామనుకుంటాడు రాహల్. 

మరోవైపు అక్కడ ఓల్డ్ స్టూడెంట్ పార్టీ మొదలవుతుంది. రాజ్, కావ్య ఇద్దరు బాబుతో పార్టీకి వస్తారు.  రాజు వెన్నెలను ఎందుకు అజ్ఞాతంలో పెట్టాడు, బాబుని వెన్నెల ఎందుకు రాజ్ దగ్గరకి పంపించిందో అర్థమయ్యే రోజు ఇది అనుకుంటూ శ్వేత ఇద్దరినీ  రిసీవ్ చేసుకుంటుంది.

రాజ్ : మొత్తానికి పట్టుపట్టి రప్పించావ్.

శ్వేత : తప్పలేదు రాజ్ మన గతాన్ని మర్చిపోకూడదు కదా.

రాజ్ : నా గతం ఏమీ గుర్తు పెట్టుకునే అంత గొప్పది కాదులే.

శ్వేత : కానీ పాత మిత్రుల్ని గుర్తుపెట్టుకోవడం వల్ల పోయేదేమీ లేదు కదా. మనం అప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, ఆ స్నేహం, ఆ అల్లరి,  ఆ గొడవలు అన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే లైఫ్ రిఫ్రెష్ అవుతుంది.

కావ్య : కరక్టే శ్వేత. కొన్ని పరిచయాలు అక్కడితోనే ఆగిపోవచ్చు. కొన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండొచ్చు. ఏ స్నేహం ఏ మలుపు తిప్పుతుందో ఎవరికి తెలుసు. 

దీంతో వెంటనే  శ్వేత టాపిక్ మార్చడానికా అన్నట్టు పదండి  అంటూ ఇద్దరినీ  మిగతా అందరి మధ్యలోకి తీసుకెళ్తుంది.  చూడండి ఎవరు వచ్చారో అంటూ రాజ్ ని,  అతని వైఫ్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది.  అందరూ  ఉత్సాహంగా రాజ్ కి హాయ్ చెబుతారు. పిల్లలందరినీ ఒకే చోట ఉంచి ఆడించడానికి ఒక ఆయాను ఏర్పాటు చేశానని బాబుని ఆమెకు ఇమ్మని చెబుతుంది శ్వేత. 

అదే సమయానికి సందీప్ అనే ఒక ఓల్డ్ ఫ్రెండ్ వస్తాడు. సందీప్ ని చూసి షాక్ అవుతాడు రాజ్. అదేంటి మీరిద్దరూ కలిసిపోయారా అని అడుగుతాడు. అప్పుడే కలిసిపోయాం రాజ్ బ్రహ్మముడిని ఎవరు విడదీయలేరు మేమిద్దరం ఒకరిని ఒకరం అర్థం చేసుకున్నాము అని సందీప్ చెప్తాడు. వెంటనే కావ్య అందుకుంటుంది. నీకు భార్య భర్తల్ని  విడదీయడం బాగా అలవాటు అనుకుంటా అంటుంది. శ్వేత, సందీప్ భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటే అంతకు మించిన ఆనందం ఏముంది అని మాట్లాడుతుండటంతో రాజ్ మెహం మాడిపోతుంది. ఇదే అవకాశం అన్నట్టు శ్వేత కూడా అర్థం చేసుకునే భార్య ఉండటం మగవాడి అదృష్టం అని, అలా అర్థం చేసుకోని వాళ్ళు దండగే అంటూ రాజ్ పై డైలాగ్ లు వేస్తుంది. దీంతో ఏదో పని ఉన్నట్టు అక్కడ నుంచి వేరే వాళ్ళతో మాట్లాడుతూ వెళ్ళిపోతాడు రాజు. 

శ్వేత కావ్యని పక్కకు తీసుకొస్తుంది. వచ్చిన వారిలో వెన్నెల ఉందా లేదా అని శ్వేతని అడుగుతుంది కావ్య. లేదనటంతో కావ్య బాధపడుతుంది ఇన్ని ఏర్పాట్లు చేసింది వెన్నెల కోసమే కదా అంటుంది. లేదు వెన్నెల దారిలో ఉంది.  తప్పకుండా వస్తుంది అని శ్వేత ధైర్యం చెబుతుంది. వెన్నెల రావడానికి అసలు అంగీకరించలేదని కానీ తనే చాలా బలవంతం చేసి వెన్నెలను రప్పిస్తున్నానని  చెబుతుంది. కానీ వెన్నెల చాలా తక్కువగా మాట్లాడుతుందని తను ఫోన్ చేసినప్పుడు కూడా పెద్దగా మాట్లాడలేదని చెబుతుంది శ్వేత. రాజ్  గురించి ఏమన్నా అడిగిందా అని కావ్య అడిగితే లేదని చెబుతుంది శ్వేత. కావ్య అన్నిసార్లు అడిగేసరికి వెన్నెలకి ఫోన్ చేస్తుంది శ్వేత. కారులో దారిలో ఉన్నానని చెప్పి పెట్టేస్తుంది వెన్నెల. 

ఈరోజు ఎలా అయినా వెన్నెలతో మాట్లాడాలని బాబు  సమస్యకి తన సమస్యకి పరిష్కారం కనుక్కోవాలి అని కావ్య గట్టిగా నిర్ణయించుకుంటుంది.

అక్కడ అప్పుకి మంచి సంబంధం తీసుకొచ్చాను అంటూ శకుంతల ఇంటికి వస్తుంది పక్కింటి గజలక్ష్మి. పెళ్లయి 40 ఏళ్ల వయసు ఒక పిల్లాడి తండ్రి ఫోటో చూపిస్తుంది. దీంతో శకుంతల కి ఎక్కడలేని కోపం వస్తుంది. గట్టిగా ప్రశ్నించిన శకుంతలకు నువ్వు నీ కూతుర్లు అందరి పెళ్లిళ్లు డబ్బు చూసే చేశావు కదా అంటూ దెప్పిపొడుస్తుంది గజలక్ష్మి. అప్పు గట్టిగా ఎదురు సమాధానం చెప్పడంతో  ముఖం ముడుచుకొని వెళ్ళిపోతుంది గజలక్ష్మి. 

ఓల్డ్ స్టూడెంట్స్ పార్టీ ఉత్సాహంగా సాగుతోంది. ట్రూత్ ఆర్ డేర్ ఆడదామని అంటుంది శ్వేత. మొదటి అవకాశం శ్వేతకే వస్తుంది నచ్చిన వ్యక్తి, నచ్చని వ్యక్తి ఎవరో చెప్పమని అడుగుతారు స్నేహితులు. రెండూ రాజ్ అనే చెప్తుంది శ్వేత. తనకు సహాయం చేసినందుకు రాజు తనకి నచ్చాడని. కానీ ఒక విషయంలో మాత్రం రాజ్ తనకి నచ్చడు అని చెబుతుంది శ్వేత.  కొంతమంది స్నేహితుల తర్వాత  వస్తుంది రాజ్ వంతు. భార్య పై ప్రేమను వ్యక్తం చేయమని అడుగుతుంది శ్వేత. ఒక్క క్షణం ఆలోచించి మొదలుపెడతాడు రాజ్.. నా భార్య పేరు కావ్య అంటూ ఆమెపై తనకున్న ప్రేమని చాలా అందంగా చెబుతాడు. 

తరువాయి భాగంలో..

శ్వేత ఆత్రుతగా గేట్ వైపు చూడటం చూసి ఎవరికోసం అంత  ఎదురుచూస్తున్నావు అని అడుగుతాడు రాజ్. వెన్నెల వస్తానంది అని చెబుతుంది శ్వేత.. షాక్ అవుతాడు రాజ్.. పక్కనే ఉన్న కావ్య  వెన్నెలపై ఆసక్తి చూపడంతో ఏమీ ఎరగనట్టు  నీకు వెన్నెల తెలుసా అని కావ్యని అడుగుతుంది శ్వేత. నాకు ఒక వెన్నెల తెలుసు ఆ వెన్నెల, ఈ వెన్నెల  ఒకరో కాదో తెలియదు అంటుంది కావ్య. రాజ్ మాత్రం చాలా టెన్షన్ పడతాడు. వెన్నెల వస్తే నిజం బయటపడుతుంది కదా అని ఆలోచిస్తుంటాడు.

Read Also: సెక్యులరిజమా? పబ్లిసిటీ స్టంటా?- విశాల్ వీడియోపై నటి కస్తూరి తీవ్ర విమర్శలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
Amaran OTT Release Date: 'అమరన్' ఓటీటీ రిలీజ్‌కు ఇంకా టైమ్ ఉంది... ఈ నెలలో కాదు, Netflixలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'అమరన్' ఓటీటీ రిలీజ్‌కు ఇంకా టైమ్ ఉంది... ఈ నెలలో కాదు, Netflixలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
KA Movie OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం 'క'... సౌండింగ్‌తో కుమ్మేసిన ఈటీవీ విన్ యాప్, స్ట్రీమింగ్ షురూ
ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం 'క'... సౌండింగ్‌తో కుమ్మేసిన ఈటీవీ విన్ యాప్, స్ట్రీమింగ్ షురూ
Anantapur News Today: వస్తున్నా నాన్న అన్నాడు- వదిలి వెళ్లిపోయాడు- అనంతపురంలో చదువు ఒత్తిడితో వైద్య విద్యార్థి ఆత్మహత్య
వస్తున్నా నాన్న అన్నాడు- వదిలి వెళ్లిపోయాడు- అనంతపురంలో చదువు ఒత్తిడితో వైద్య విద్యార్థి ఆత్మహత్య
Embed widget